
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్‌ఐఎన్‌ఎల్) సెయిల్, ఎన్‌ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు.
ప్రస్తుతం ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు.