faggan singh kulaste
-
విశాఖ ఉక్కు: ‘ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లం’.. సాయంత్రానికి ఉల్టా పల్టా!
దొండపర్తి (విశాఖ దక్షిణ)/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే స్పష్టం చేశారు. గురువారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపై దృష్టి సారించామని తెలిపారు. గనుల సమస్యనూ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆపడం నా చేతుల్లో లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్ కులస్తే కొద్ది గంటల వ్యవధిలోనే మాట మార్చారు. గురువారం సాయంత్రం ఆయన నోవోటెల్లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయం చేసిన ప్రకటనపై మరింత క్లారిటీ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, సి.హెచ్.నరసింగరావులు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చామన్నారు. సింగరేణిలో ఆంధ్ర వాటా తేల్చండి బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు. సింగరేణి గనుల్లో ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉందని, ముందు ఆ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై బీఆర్ఎస్కు అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి సహకరించాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని, గనుల కేటాయింపు విషయం ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తామని మంత్రి చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణపై కేంద్రం కాస్తా వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోందని చెప్పారు. ప్లాంట్ లాభాల కోసం మాట్లాడుతుండటం శుభపరిణామమన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా చేస్తామని ముందుకు వస్తే ప్లాంట్ కొనటానికి వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. బీజేపీతో గొడవ ఉంటే వారితో నేరుగా తేల్చుకోవాలని, స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. పూర్తి సామర్థం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపైనే ఫోకస్ పెట్టామన్నారు. వీటిపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. బిడ్‌లో టీఎస్ సర్కార్ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ సింగ్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
లోహాల ఉత్పత్తిలోనూ ‘ఆత్మనిర్భరత’ కావాలి
సాక్షి, హైదరాబాద్: ఇనుము, ఉక్కు వంటి లోహాల ఉత్పత్తిలోనూ మన దేశం ‘ఆత్మనిర్భరత’సాధించేందుకు శాస్త్రవేత్తలు తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే పిలుపునిచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు భారత్‌లో ఉన్నారని, సామర్థ్యానికి తగ్గట్టుగా కృషి చేస్తే అసాధ్యం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వార్షిక సాంకేతిక సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిభకు కొరతేమీ లేదని, కావాల్సిందల్లా కొద్దిపాటి ప్రోత్సాహం మాత్రమేనని అన్నారు. కోవిడ్ సమయంలోనూ ఈ విషయం రుజువైందని, రికార్డు సమయంలో టీకాలు తయారు చేయడమే కాకుండా.. వాటిని అందరికీ అందించడం ద్వారా లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ మార్పు కనిపిస్తోందని తెలిపారు. అంతకు ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్ బి.జె.రావు మాట్లాడుతూ లోహశాస్త్రంలో అద్భుతాలు సృష్టించేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నా యని, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నా లజీల సాయంతో మునుపెన్నడూ ఎరుగని లక్షణాలున్న లోహా లను తయారు చేసి వాడుకోవ చ్చునని వివరించారు. శాస్త్రవేత్తలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని, వెయ్యిమందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం హైదరాబాద్ చైర్మెన్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, డీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూధన్ రెడ్డి, ఐఐఎం అధ్యక్షుడు, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్‌లు పాల్గొన్నారు. -
Viral Video: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు
భోపాల్: రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్మే వ్యక్తితో కేంద్రమంత్రి బేరమాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రహదారి పక్కన కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే.. మూడు మొక్కజొన్న కంకులను మంచిగా కాల్చి.. నిమ్మరసం, ఉప్పు రాసి ఇవ్వమన్నారు. మంత్రి చెప్పినట్టే చేసిన ఆ యువకుడు మూడు కంకులకు రూ.45 ఇవ్వమన్నాడు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ఏంటి? మూడు మొక్కజొన్న కంకులకు 45 రూపాయలా? ధర చాలా ఎక్కువ కదా? అన్నారు. కంకులమ్మే వ్యక్తి మాత్రం నవ్వుతూ.. లేదు సర్ నేను సాధారణ ధరే చెప్పాను. మీరు కారులో వచ్చారు కదా అని ఎక్కువ చెప్పడం లేదంటూ బదులిచ్చాడు. ఊర్లో ఈ మొక్కజొన్న కంకులు ఉచితంగా ఇస్తారు కదా అన్న మంత్రి.. చివరికి మూడు కంకులకు రూ.45 చెల్లించారు. आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU — Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022 కేంద్రమంత్రి మధ్యప్రదేశ్‌లోని శివనీ నుంచి మండ్లా వెళ్తుండగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ యువకుడు చాలా పేదవాడు. ఒక్క మొక్కజొన్న కంకికి రూ.15 అంటే మీకు చాలా ఎక్కువ అనిపిస్తుందా? సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కేకే విశ్రా విమర్శలు గుప్పించారు. మరోవైపు బీజేపీ మాత్రం మంత్రిని సమర్థించుకుంది. రోడ్డుపై కారు ఆపి మొక్కజొన్నలు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు కేంద్రమంత్రి వెళ్లారని, అతను అడిగినంత డబ్బు ఇచ్చారు కదా అని పేర్కొంది. దేశంలో నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెరిగాయని విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. చదవండి:లక్ అంటే ఇదే.. తల్లి సలహాతో జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు! -
కేంద్ర ఉక్కు సహాయ మంత్రికి ఉద్యమ సెగ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకు స్టీల్‌ప్లాంట్ ఉద్యమ సెగ తగిలింది. కులస్తే శనివారం కోల్‌కతా నుంచి విశాఖ మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంది. విజయవాడకు నేరుగా విమానం లేకపోవడంతో విశాఖలో దిగి, ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం విమానంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఉక్కు ఉద్యమకారుల ఆందోళనలతో ఆయన పర్యటనలో మార్పు జరిగింది. ఎన్ఏడీ కొత్తరోడ్డు వద్ద ఓ ప్రైవేట్ హోటల్లోనే ఆయన బస చేశారు. కొద్దిసేపు స్టీల్‌ప్లాంట్ అధికారులు, బీజేపీ నేతలతో ఆయన మాట్లాడారు. అక్కడే విశ్రాంతి తీసుకుని విజయవాడ వెళ్లిపోయారు. సర్క్యూట్ హౌస్ జంక్షన్లో నిరసన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సిరిపురం జంక్షన్ నుంచి సర్క్యూట్ హౌస్ జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేసిన జేఏసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులను పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి.. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ అనేక త్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కును అమ్మే హక్కు మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. -
120 ఎంటీకి స్టీల్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ స్టీల్ ఉత్పత్తి 120 మిలియన్ టన్నులకు చేరే వీలున్నట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీ తాజాగా అంచనా వేశారు. ఇది 18 శాతం వృద్ధికాగా.. డిమాండ్ సైతం 100 ఎంటీని తాకవచ్చని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది(2020–21)లో 6 శాతం తక్కువగా 102 ఎంటీ స్టీల్ తయారయ్యింది. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు ప్రభావం చూపింది. కాగా.. 2021 ఏప్రిల్–జూన్‌లో దేశీయంగా స్టీల్ ఉత్పత్తి 45 శాతం జంప్‌చేసింది. 37.52 ఎంటీని తాకింది. దీంతో ఈ ఏడాది 115–120 ఎంటీని స్టీల్‌ను తయారు చేయగలమన్న ధీమాతో ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. జాతీయ స్టీల్ పాలసీ 2017లో భాగంగా ప్రభుత్వం 2030–31కల్లా 300 ఎంటీ స్టీల్ ఉత్పత్తిని అందుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కరోనా నేపథ్యంలో గతేడాది దేశీ స్టీల్ వినియోగం దాదాపు 7 శాతం క్షీణించి 93.43 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌ను ప్రకటించిందని, ఈ పథకం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో స్టీల్ వినియోగం ఉంటుందని వివరించారు. -
నాణ్యమైన లైమ్ స్టోన్ ఇక్కడే ఉంది: కేంద్ర మంత్రి
సాక్షి, కృష్ణా: దేశ వ్యాప్తంగా దాదాపు 1259 ఎకరాలు ఈ లైమ్ స్టోన్ గనులు విస్తరించి ఉన్నాయని, ఇందులో అత్యంత నాణ్యమైన లైమ్ స్టోన్ విశాఖలోనే ఉందని కేంద్ర స్టీల్ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులను గురువారం ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా అంబేద్కర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక లైమ్ స్టోన్ గనులను, యత్ర సామాగ్రిని పరిశీలించి.. మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 146 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ వెలికి తీస్తున్నామని తెలిపారు. ఇక్కడ 900 ఎకరాల అటవీ భూమి ఉందని, ప్రస్తుతం 345 ఎకరాల మైనింగ్ జరుగుతుందని చెప్పారు. సంవత్సరానికి 997 టన్నుల లైమ్ స్టోన్‌ను ఈ గనుల నుంచి వెలికితీస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్‌ను తవ్వీ తీసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. రైల్యే, సముద్ర మర్గాలలో లైమ్ స్టోన్ ఇతర దేశాలకు ఎగుమతులు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఈ ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలనలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. -
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్‌కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
ఫీజు ఎంతో వైద్యానికి ముందే చెప్పాలి
న్యూఢిల్లీ: రోగి చికిత్సకయ్యే వ్యయాన్ని ముందుగానే వైద్యుడు వెల్లడించాలని కేంద్రం స్పష్టం చేసింది. చికిత్స తర్వాత ఫీజుల వివరాలు చెబుతామనటం సరికాదని తెలిపింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు-2002 ప్రకారం ఫీజుతోపాటు చికిత్సకు అయ్యే ఖర్చు వివరాలను ఆస్పత్రులు స్పష్టంగా చెప్పాలని సూచించింది. వైద్యులు సేవలు అందించటానికంటే ముందుగానే తాము అందించే సేవలు, రుసుము వివరాలను తప్పనిసరిగా రోగికి గానీ, వారి కుటుంబీకులకు గానీ వెల్లడించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే మంగళవారం రాజ్యసభలో లిఖిత పూర్వకంగా తెలిపారు.