ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు 2014-15లో భారీ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణకు సన్నాహాలు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు 2014-15లో భారీ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకు రూ.14,945 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సెయిల్ రూ.9,000 కోట్లు, ఎన్‌ఎండీసీ రూ.4,345 కోట్లు, ఎన్‌ఐఎన్‌ఎల్ రూ.1,600 కోట్లు వెచ్చించనున్నాయి.
ఆర్‌ఐఎన్‌ఎల్ తన ప్రణాళికలో భాగంగా విస్తరణ కొనసాగుతున్న వైజాగ్ ఫెసిలిటీకి రూ.400 కోట్లు కేటాయించనుంది. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్, సింటర్ ప్లాంట్ల ఆధునీకరణకు రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ 3 సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధునీకరణ, విస్తరణకు రూ.15,820 కోట్లు వ్యయం చేయనున్నాయి.