
న్యూఢిల్లీ: ఎన్‌ఎండీసీకి చెందిన నాగర్నాల్ ఉక్కు ప్లాంటులో వ్యూ హాత్మక వాటాలను విక్రయించేందుకు కేంద్రం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. సందేహాలను సమర్పించేందుకు డిసెంబర్ 29, బిడ్లను దాఖలు చేసేందుకు 2023 జనవరి 27 ఆఖరు తేదీ అని దీపం తెలిపింది.
చత్తీస్‌గఢ్‌లోని నగర్నార్‌లో ఎన్‌ఎండీసీ 3 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎన్‌ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎన్‌ఎండీసీ నుండి ఎన్‌ఎండీసీ స్టీల్‌గా విడగొట్టి, ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.