Stakes
-
స్విగ్గీలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి వాటాలు
న్యూఢిల్లీ: ఐపీవోకి సన్నద్ధమవుతున్న ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కి చెందిన ఫ్యామిలీ ఆఫీస్ స్వల్ప వాటాలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగులు, ప్రారంభ దశ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ లావాదేవీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 10,414 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు స్విగ్గీ షేర్హోల్డర్లు ఏప్రిల్‌లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయించనున్నారు. -
ఈజ్ మై ట్రిప్ చేతికి ‘చెకిన్’
హైదరాబాద్: ఆన్లైన్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అయిన ఈజ్‌మైట్రిప్ ‘చెకిన్’ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. చెకిన్ అన్నది పర్యాటకులు ఎలాంటి బేరమాడే అవసరం లేకుండా హోటల్ బుకింగ్‌లపై డిస్కౌంట్‌కు వీలు కల్పించే రియల్‌టైమ్ మార్కెట్ ప్లేస్. ఆల్గోరిథమ్ ఆధారితంగా టాప్–5 హోటల్ చెకిన్ ఆఫర్లను ఇది అందించగలదు. చెల్లింపులు మాత్రం హోటల్ వద్దే చేయవచ్చు. మరోవైపు చెకిన్ యాప్ యాక్సెస్‌ను హోటల్ వారికి ఈజ్‌మైట్రిప్ అందించనుంది. దీని ద్వారా వారు ఎప్పటికప్పుడు త మ బుకింగ్‌లు, డిమాండ్ తీరును తెలుసుకుని, ధరలను నియంత్రించుకోవచ్చని ఈజ్‌మైట్రిప్ తెలిపింది. తద్వారా తమ ప్రాపర్టీలను వేగంగా విక్రయించుకోగలరని (బుకింగ్‌లు) పేర్కొంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి బిడ్స్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ప్రాథమిక) బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయానికి పలు కంపెనీలు ఆసక్తిని చూపినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో అటు ప్రభుత్వం, ఇటు ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటాను విక్రయించనున్నాయి. ఇందుకు అక్టోబర్‌లోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికాయి. వీటికి ఈ నెల 7న గడువు ముగిసింది. తొలి దశ ముగియడంతో రెండో దశలో భాగంగా బిడ్డర్లు సాధ్యా సాధ్యాలను పరిశీలించాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది. విజయ వంతమైన బిడ్డర్ సాధారణ వాటాదారుల నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. కాగా.. కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండటంతోపాటు.. ఐదేళ్లలో మూడేళ్లు లాభాలు ఆర్జించి ఉంటేనే బ్యాంకులో వాటా కొనుగోలుకి బిడ్ చేసేందుకు అర్హత ఉంటుందటూ గతంలోనే దీపమ్ తెలియజేసింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
జీఎంసీఏసీలో జీఎంఆర్ వాటాల విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంసీఏసీలో వాటాల విక్రయ డీల్‌కు సంబంధించి రూ. 1,390 కోట్లు తమకు అందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. జీఎంసీఏసీకి 2026 డిసెంబర్ వరకూ తాము టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా కొనసాగుతామని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లోని సెబు విమానాశ్రయానికి సంబంధించి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్ (జీఏఐబీవీ), మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎంసీసీ) కలిసి జీఎంసీఏసీని ఏర్పాటు చేశాయి. ఇందులో తమ వాటాలను అబోయిటిజ్ ఇన్‌ఫ్రాక్యాపిటల్‌కు విక్రయించేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
యస్ బ్యాంక్‌లో వాటాలకు కార్లైల్‌కి గ్రీన్ సిగ్నల్
ముంబై: యస్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్లకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్ వెల్లడించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
ఎన్ఎండీసీ నగర్నార్ ప్లాంటుకు బిడ్ల ఆహ్వానం
న్యూఢిల్లీ: ఎన్ఎండీసీకి చెందిన నాగర్నాల్ ఉక్కు ప్లాంటులో వ్యూ హాత్మక వాటాలను విక్రయించేందుకు కేంద్రం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. సందేహాలను సమర్పించేందుకు డిసెంబర్ 29, బిడ్లను దాఖలు చేసేందుకు 2023 జనవరి 27 ఆఖరు తేదీ అని దీపం తెలిపింది. చత్తీస్‌గఢ్‌లోని నగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎన్ఎండీసీ నుండి ఎన్ఎండీసీ స్టీల్‌గా విడగొట్టి, ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
బేవకూఫ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థకు వాటాలు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ టీఎంఆర్‌డబ్ల్యూ తాజాగా డీ2సీ బ్రాండ్ అయిన బేవకూఫ్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. 70–80 శాతం వాటా కోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వచ్చే అయిదేళ్లలో రూ. 1,500 కోట్ల ఆదాయాలను బేవకూఫ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్యాజువల్ వేర్ విభాగంలో వినూత్న బ్రాండ్‌గా బేవకూఫ్ నిలుస్తోందని టీఎంఆర్‌డబ్ల్యూ సీఈవో ప్రశాంత్ తెలిపారు -
హెచ్‌సీఎల్ గ్రూప్ చేతికి గువి
న్యూఢిల్లీ: టెక్నికల్ కోర్సులను అందించే వెర్నాక్యులర్ ఎడ్యుటెక్ ఫ్లాట్ ఫామ్ గువి(జీయూవీఐ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఐతే డీల్ విలువను వెల్లడించలేదు. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ మద్దతుతో ఏర్పాటైన కంపెనీ వెబ్ డెవలప్మెంట్, ఏఐ మాడ్యూల్, ఎస్‌క్యూఎల్ తదితర పలు సాంకేతిక కోర్సులను అందిస్తోంది. పారిశ్రామిక నిపుణుల ద్వారా రూపొందించిన విభిన్న కోర్సులను సైతం వెర్నాక్యులర్ లాంగ్వేజీలలో అందిస్తోంది. విద్యార్ధులు, యూనివర్శిటీలు, ఉద్యోగులకు అనువైన(టైలర్‌మేడ్) కోర్సులను సైతం రూపొందిస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా దేశ, విదేశాలలో టెక్ వృత్తి నిపుణులను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ తెలియజేసింది. -
బంగారు బాతును కాపాడుకోవాలి!
ఎల్ఐసీ దేశానికి ఎంతో ఇచ్చింది. ఇంకెంతో ఇవ్వనుంది. మరి ప్రభుత్వం దానికి తిరిగి ఏమిస్తోంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనూ, కార్పొరేషన్లనూ ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడం ఒక విధానంగా పెట్టుకున్న కేంద్రం... అక్షయ పాత్రలాంటి ఎల్ఐసీనీ ప్రైవేటీకరించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1956లో ప్రభుత్వం సమకూర్చిన ఐదు కోట్ల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 66 ఏళ్లలో రూ. 31 వేల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చింది ఎల్ఐసీ. 2022 మార్చి 31 నాటికి రూ. 40,84,826 కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా పెట్టింది. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చౌకగా బీమా సౌకర్యాన్నీ కల్పిస్తూ వచ్చింది. అయినా ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను ప్రభుత్వం అమ్మివేసింది. ఈ మధ్య ఎన్టీఆర్ఐను ప్రారంభిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లేకుండా దేశ ప్రగతిని ఊహించుకోలేమనీ, ఎల్ఐసీ గత 66 ఏళ్లలో అద్భుతంగా రాణిస్తోందనీ కితాబు ఇచ్చారు. అటువంటి అద్భుత సంస్థ ‘యోగక్షేమం వహామ్యహం’ (ప్రజల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను) అనే నినాదంతో మొదలై 2022 సెప్టెంబర్ 1 నాటికి 66 ఏళ్ళు పూర్తి చేసుకుని 67వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1956లో ఎల్ఐసీ ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే నినాదంతో, ఉన్నత లక్ష్యాలతో పనిచేయబట్టే... నేడు ప్రజల, పాలసీ దారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. అడుగడుగునా తనను నమ్మి తన మీద భరోసా పెట్టుకున్న ఖాతాదారులకు అభయం ఇచ్చి, ఎల్ఐసీ దేశీయ జీవిత బీమా రంగంలో మార్కెట్ మేకర్‌గా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022 మార్చి 31 నాటికి ఎల్ఐసీ రూ. 40,84,826 కోట్ల పెట్టుబడులను మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టింది. ఇందులో రూ. 28,85,569 కోట్ల నిధులను హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పనకూ; కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలకూ కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ. 14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ సమకూర్చింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! 2021–22 ఆర్థిక సంవత్సరంలో క్లెయిముల చెల్లింపుల రూపేణా దాదాపు లక్ష కోట్ల మేరకు పాలసీ దారులకు చెల్లించింది. 99 శాతం క్లెయిముల పరిష్కారం రేటుతో క్లెయిముల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరెన్నికగన్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే (ఏప్రిల్ నుండి జూన్ లోపల) 85,298 కోవిడ్ డెత్ క్లెయిములను పరిష్కరించి, రూ. 2,334 కోట్లు పాలసీదారుల వారసులకు చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 614 శాతం ఎక్కువ. నిమిషానికి 41 పాలసీలను విక్రయిస్తూ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 17 లక్షల పాలసీలను ఎల్ఐసీ సేకరించింది. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం నికర ప్రీమియం ఆదాయం పెరిగింది. 22 సంవత్సరాల పోటీ తర్వాత కూడా ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అంశంలో మార్కెట్ వాటాలో 65 శాతం కలిగి ఉంది. పాలసీల సంఖ్యలో దాదాపు 74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది అపూర్వమైన ఘనత. ఏ దేశంలో లేని విధంగా... ఒకే కంపెనీ, అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీ, మార్కెట్ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఒక్క ఎల్ఐసీ విషయంలో మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రూ. 36,000 కోట్లు లాభం ఆర్జించిన ఎల్ఐసీ సంస్థ, ఈ ఏడాదిలో రూ. 42,000 కోట్లు లాభాలు ఆర్జించింది.గత ఏడాది జూన్ నాటికి ఎల్ఐసీ ఆస్తులు రూ. 38.13 లక్షల కోట్లు కాగా, ఇప్పుడవి రూ. 42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 23 ప్రయివేటు బీమా కంపెనీల మొత్తం ఆస్తుల కన్నా 3 రెట్లు ఆస్తులు, ఎల్ఐసీ సంస్థ కలిగి ఉంది. రెండో అతిపెద్ద ప్రయివేటు జీవిత బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్‌తో పోలిస్తే, ఎల్ఐసీ ఆస్తులు 16 రెట్లు ఎక్కువ. దేశంలో మొత్తం మ్యూచ్యువల్ ఫండ్ల ఆస్తుల కన్నా, ఎక్కువ ఆస్తులను ఎల్ఐసీ కలిగి ఉంది. 2021–22లో పాలసీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 98 శాతం 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించి అత్యుత్తమ పారదర్శక సంస్థగా నిలిచింది. ‘ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకం ద్వారా అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తోంది. కార్పొరేట్ నిర్వహణలో ఎల్ఐసీ అనేక అవార్డులు, రివార్డులు పొందింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ ఎల్ఐసీనే మార్కెట్లను ఆదుకుంది. ‘మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్’. ‘బెస్ట్ బ్రాండ్ అవార్డ్’తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డులను ఎల్ఐసీ సొంతం చేసుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణకు ‘బంగారు నెమలి‘ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలై ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల నడుమ ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేశారు. దాంతో తర్వాత కాలంలో ఎల్ఐసీ షేర్ విలువ దాదాపు 28 శాతం తగ్గిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఎల్ఐసీ సంస్థ ఏనుగు వలే శక్తి మంతమైనది అయినప్పటికీ, అది నాట్యం చేయలేదని కొందరు మార్కెట్ పండితులు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. అయితే, జేపీ మోర్గాన్ సంస్ధ తన తాజా నివేదికలో, ఎల్ఐసీ నిజ విలువను, శక్తిని గుర్తించడంలో మార్కెట్ విఫలమైందని వ్యాఖ్యానించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఎల్ఐసీ నూతన వ్యాపార వృద్ధి రేటు 95 శాతంగా ఉంది. కాగా, ప్రయివేటు బీమా కంపెనీల వృద్ధి దాదాపు 48 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఎల్ఐసీ వృద్ధి రేటు 63 శాతం కాగా, ప్రయివేటు కంపెనీల వృద్ధి రేటు 38 శాతంగా ఉంది. తాజాగా ఎల్ఐసీ ఫార్ట్యూన్ గ్లోబల్ –500 కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి లిస్ట్ అయిన కంపెనీల ఆదాయం, లాభాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబితాలో లిస్టింగ్ అయిన రెండు నెలల లోపలే ఎల్ఐసీ 98వ స్థానం పొందింది. ఎల్ఐసీ వ్యాపారాభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఎల్ఐసీ షేర్ విలువ కూడా పెరుగుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోన్న పరిస్థితుల్లో సైతం ఎల్ఐసీ చక్కని ప్రదర్శన చేస్తోంది. ప్రయివేటు బీమా సంస్థలు మెట్రోలు, మహానగరాలకే పరిమితమయినా... ఎల్ఐసీ గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విశేషంగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్ఐసీకి 48.22 శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్ఐసీకి మొత్తం పాలసీలలో 21.46 శాతం, ప్రీమియంలో 15.6 శాతం వ్యాపారం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్ఐసీ వ్యాపారాన్ని గమనిస్తే 28.89 శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన గలవారు. 43 శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ. లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ. 25,000 కాగా, ప్రయివేటు కంపెనీ లలో ఇది రూ 1,06,000 గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు పెద్ద పాలసీలపై దృష్టి పెడితే, ఎల్ఐసీ సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బీమా రక్షణ కలిగిస్తోందని స్పష్టమవుతోంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటి గనుక, ఎల్ఐసీలో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే వ్యాపారం వైపు సంస్థ పరుగులు పెట్టవలసి వస్తే అది భారతదేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల ప్రయోజనాలకు భంగకరం అవుతుంది. 40 లక్షల మంది ఎల్ఐసీ షేర్ హోల్డర్ల ప్రయోజనాల కన్నా, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలూ, విశాల దేశ ప్రయోజనాలే పరమావధిగా ఎల్ఐసీ బోర్డు అడుగులు వేయాలి. ప్రజల, ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత నడుమ ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలు మాత్రమే ప్రస్తుతానికి అమ్మడం జరిగింది. ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వానికి అక్షయ పాత్ర లాంటిది. 1956లో ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతో కార్యకలాపాలు ప్రారంభించి... ఇప్పటివరకూ 31 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెంట్ చెల్లించింది. నిరంతరం, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం నిధులు అందిస్తూనే ఉంది. అటువంటి బంగారు బాతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి తెగనమ్మే ప్రయత్నాలు చేయడం సరికాదు. ప్రభుత్వం తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటుందని ఆశిద్దాం. పి. సతీష్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు ‘ 94417 97900 -
అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!
అటు సంపదలోనూ, ఇటు విభిన్న వ్యాపార విస్తరణలోనూ పోటీ పడుతున్న కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తాజాగా మీడియా విభాగంలోనూ సై అంటున్నారు. రుణాలను ఈక్విటీగా మార్పు చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో 29 శాతానికిపైగా వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. మెజారిటీ వాటాపై కన్నేసింది. ఇప్పటికే బ్రాడ్‌క్యాస్టింగ్ సంస్థ నెట్వర్క్ 18ను ముకేశ్ అంబానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే!! న్యూఢిల్లీ: వార్తా చానళ్ల మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్(ఎన్డీటీవీ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 4 ముఖ విలువగల దాదాపు 1.68 కోట్ల షేర్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకంటే ఆఫర్ ధర అధికమని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఎన్ఎస్ఈలో ఎన్డీటీవీ షేరు సోమవారం ముగింపు ధర రూ. 359కాగా.. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం షేరుకి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి (రూ. 18 లాభపడి) రూ. 377 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఓపెన్ ఆఫర్ ధర కంటే 28% అధికం! 55 శాతానికి ఎన్డీటీవీలో వారంట్ల మార్పిడి ద్వారా అదానీ గ్రూప్ దాదాపు 30% వాటాను సొంతం చేసుకుంది. దీంతో పబ్లిక్ నుంచి మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ విజయవంతమైతే ఎన్డీటీవీలో 55%పైగా వాటాను అదానీ గ్రూప్ పొందే వీలుంది. ఏఎంజీ మీడియా నెట్వర్క్స్కు పూర్తి అనుబంధ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేట్ లిమిటెడ్(వీసీపీఎల్) వారంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్‌లో 99.5% వాటాను చేజిక్కించుకుంది. దీంతో ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను పొందింది. ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్పీఆర్. వెరసి వీసీపీఎల్‌తో పాటు అదానీ మీడియా నెట్వర్క్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉమ్మడిగా ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాయి. 26% వాటాకు సమానమైన 1,67,62,530 షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు సంస్థలో సంయుక్తంగా 32.26% వాటా ఉంది. కాగా.. అదానీ గ్రూప్ రూ. 114 కోట్లకు కొనుగోలు చేసిన వీసీపీఎల్ గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ సంస్థ కావడం కొసమెరుపు! మాతో చర్చించ లేదు వారంట్ల మార్పిడి ద్వారా ఆర్ఆర్పీఆర్లో వాటా చేజిక్కించుకున్న విషయంపై ప్రమోటర్లతో వీసీపీఎల్ చర్చించలేదు. అనుమతి కోరలేదు. ఈ విషయం వీసీపీఎల్ జారీ నోటీసు ద్వారా ఈరోజే ప్రమోటర్లకు తెలిసింది. వాటా విక్రయించేందుకు ప్రమోటర్లు ఎవరితోనూ చర్చించడంలేదు’. – ఎన్డీటీవీ -
వొడాఫోన్-ఐడియా కీలక ప్రకటన, ప్రభుత్వం చేతికి..
దేశంలో మూడో అతి పెద్ద ఫోన్ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామం వ్యవస్థాపకులతో సహా కంపెనీ ప్రస్తుత షేర్‌హోల్డర్లందరికీ దెబ్బేసేదే!. అయితే కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్ద లాభదాయక పరిస్థితులు కనిపించకపోతుండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ సమర్థించుకుంటోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ పూర్తి వివరాల్ని తెలిపింది కంపెనీ. ఈ మేరకు సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపింది. యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్ 17.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 36 శాతం దాకా వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ కీలక పరిణామం తర్వాత మంగళవారం నాటి స్టాక్ సూచీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లు 19 శాతం పడిపోవడం గమనార్హం. చదవండి: బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్, ఉచితంగా 5జీబీ డేటా! -
వాటా అమ్మకానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్..మరికొన్ని కూడా!
కరోనా కారణంగా దేశీయ విమానయాన రంగం భారీగా నష్టపోయింది.ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఏఐ కొన్ని ప్రైవేట్ సంస్థలతో చేతులు కలిపి దేశంలోని పలు ఎయిర్ పోర్ట్‌ల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. అయితే కోవిడ్ వల్ల విమానయాన రంగానికి నస్టం రావడంతో ఆయా ఎయిర్ పోర్ట్‌లలో ఉన్న వాటాల్న అమ్మేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన విమానశ్రయాల్లోని తన వాటాల్ని అమ్మాలని నిర్ణయించింది. మహమ్మారి వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ఇంధన ధరలు కొండెక్కి కూర్చోవడంతో దేశీయ విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ.9,500- రూ.10,000 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది.ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్ట్‌లలో 13శాతం వాటాను, హైదరాబాద్ - బెంగళూరుకు చెందిన ఎయిర్ పోర్ట్‌లలో మరో 13శాతం వాటాను అమ్మనుంది. అయితే వాటాల్ని అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని ఏవియేషన్ మినిస్ట్రీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనల్నిపంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటాల అమ్మకం' ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా,ఈ ప్రక్రియ తొలత బెంగళూరు - హైదరాబాద్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ముంబై - ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ల వాటాను అమ్మనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి: కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు -
ఎస్బీఐ లైఫ్‌కు స్టోక్..కార్లయిల్ ఔట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వైదొలగింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.9 శాతం వాటాను విక్రయించింది. షేరుకి రూ. 1,130 సగటు ధరలో ఎస్బీఐ లైఫ్లోగల 1.9 శాతం వాటాను అనుబంధ సంస్థ సీఏ ఎమరాల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 2,147 కోట్లు. 2021 జూన్‌కల్లా ఎస్బీఐ లైఫ్‌లో సీఏ ఎమరాల్డ్ 1.9 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. ఈ షేర్లను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింగపూర్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలతోపాటు. పలు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.5 శాతం బలపడి రూ. 1,151 వద్ద ముగిసింది. -
బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కీలక నిర్ణయం
లండన్: రోదసీ యాత్రతో బిలియనీర్లలో జెలస్ రేపుతున్న వర్జిన్ గెలాక్టిక్ అధిపతి బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పేస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టాడు. ఈ మేరకు లండన్‌కు చెందిన సెరాఫిమ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొనుగోలు మొత్తం వివరాలను సెరాఫిమ్ వెల్లడించలేదు. అయితే ప్రాథమికంగా 178 మిలియన్ పౌండ్ల (246.99 మిలియన్ డాలర్లు) విలువైన వాటాలను కొనుగోలు చేసినట్లు తెలిపింది. అలాగే ఇటీవల ఐవీవో పూర్తి చేసుకున్న సెరాఫిమ్ భాగస్వామ్య కంపెనీలలో ఎయిర్ బస్ ఎస్ కూడా ఒకటి. త్వరలోనే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ప్రారంభించనున్న సెరాఫిమ్ ప్రకారం ఐపీవోలో భారీ పెట్టుబడులు పెట్టింది ఎయిర్ బస్. -
రీటైల్ రంగంలోకి అమెజాన్ : భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది. ఈ కామర్స్‌వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది. దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్ యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్‌ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది. కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్‌పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆన్లైన్ ఫుడ్ అండ్ కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం వార్షిక వృద్ధిరేటును సాధించనుంది. -
ఇప్పుడు... ఇదే బెటర్
మార్కెట్లలో ఏడాదికి పైగా బలమైన ర్యాలీ తర్వాత ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ సమయంలోనూ పెట్టుబడులకు అనువైన మ్యూచువల్ ఫండ్ పథకాలున్నాయి. అందులో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్. స్టాక్స్‌ను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరిస్తుంది. సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ విలువల వద్దే లభిస్తున్న షేర్లలో 70 శాతం నిధుల్ని ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో మార్కెట్లు అధిక విలువలకు చేరి కరెక్షన్ రిస్క్ ఉన్న తరుణంలో ఈ ఫండ్ పెట్టుబడుల తీరు ఒకింత రిస్క్ తగ్గించేదే అని చెప్పుకోవచ్చు. ఇది మల్టీ క్యాప్ ఫండ్... టాటా ఈక్విటీ పీఈ ఫండ్ అన్నది మల్టీక్యాప్ కిందకు వస్తుంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ లాభాలను ఇచ్చేందుకు అనువుగా ఉన్నాయనుకుంటే ఆ సమయంలో వాటికి 40–50 శాతం నిధులను కేటాయిస్తుంది. 2014 సమయంలో ఇదే చేసింది. 2015, 2016లో మార్కెట్లు అస్థిరతలకు గురైన సమయంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించుకుంది. దీంతో ఈ పథకం ఫ్లెక్సీ క్యాప్ విధానంలో పనిచేస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన ఏడాదిగా మార్కెట్లు అంతకంతకూ పెరుగుతూ వెళుతుండడం, మిడ్, స్లామ్స్ క్యాప్ స్టాక్స్ ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్న దృష్ట్యా ఈ పథకం లార్జ్ క్యాప్ స్టాక్స్‌కు ప్రాధాన్యం పెంచింది. 2017 ప్రారంభంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కోసం 31 శాతం కేటాయించగా... ఇపుడు ఆ కేటాయింపును 13 శాతానికి పరిమితం చేసింది. అలాగే, మార్కెట్లలో అనిశ్చితి పెరిగిందని సంకేతాలు కనిపిస్తే ముందు చూపుతో నగదు నిల్వలు పెంచుకోవడంతోపాటు, డెట్ విభాగానికి కూడా తగినంత కేటాయింపులు చేస్తుంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం పనితీరును పరిశీలిస్తే బెంచ్ మార్క్ పనితీరు కంటే 10 శాతం ఎక్కువే రాబడులను ఇచ్చింది. ఇతర మల్టీక్యాప్ ఫండ్స్ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీ క్యాప్, ఫ్రాంక్లిన్ ఫ్లెక్సీ క్యాప్ పథకాలకు మించి మెరుగైన పనితీరును టాటా ఈక్విటీ పీఈ ఫండ్ చూపించింది. పోర్ట్‌ఫోలియోలో ఆటోకే ప్రాధాన్యం... సాఫ్ట్వేర్ రంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, బలమైన రూపాయి నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపులను తగ్గించేసింది. డిసెంబర్ నాటి పోర్ట్‌ఫోలియోను గమనిస్తే ప్రధానంగా ఆటో, ఆటో యాన్సిలరీ విభాగానికి 18.4 శాతం నిధుల్ని కేటాయించింది. మారుతి సుజుకి, సియట్ విలువలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడంతో పెట్టుబడులను తగ్గించుకుంది. తక్కువ విలువల వద్ద లభిస్తున్న ఎంఅండ్ఎం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లను పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్‌కు పెట్టుబడుల్లో అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. యెస్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. -
భారతి టెలికాంలో సింగపూర్ టెలీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ సింగ్టెల్ రెండు దేశాల టెలికాం దిగ్గజాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సింగ్ టెల్ థాయ్ టెలికాం సంస్థ ఇన్ టచ్ హోల్డింగ్స్ , ఇండియాకు చెందిన భారతి టెలికం లిమిటెడ్ కంపెనీల్లో సుమారు రెండు బిలియన్ల డాలర్లతో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, థాయ్ లాండ్ టెలికాం మార్కెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్న సంస్థ ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పాగా వేయాలనే దాని వ్యూహంలో భాగంగా మొత్తం 1.8 మిలియన్ డాలర్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఇన్ టచ్ లో 21 శాతం, భారతి ఎయిర్టెల్ సొంతమైన భారతి టెలీలో 7.39 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్టు సింగపూర్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో సింగ్ టెల్ పేర్కొంది. సింగె టెల్ కొనుగోలు చేస్తున్న భారతి టెలీవాటాల విలువ రూ. 4,400 కోట్లకు పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుందని తెలిపింది. అంతర్గత నగదు, స్వల్పకాలిక రుణాల ద్వారా ఈ వాటాలను హస్తగతం చేసుకోనున్నట్లు సింగ్ టెల్ తెలిపింది. ఈ రెండు లావాదేవీల ద్వారా రెండు కంపెనీల్లోతమ పెట్టుబడుల వృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి భారీ అవకాశాలున్న రెండుదేశాల్లోతమ కార్యకలాపాల వృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నామని సింగ్టెల్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చువా సాక్ చెప్పారు. ఈ రెండుదేశాల్లోని యువత జనాభా వివరాలను ఉదాహరించిన ఆమె తమ టెలికాం వ్యాపారానికి సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. ఇది వెల్ ప్యాకేజ్డ్ డీల్ అని నోమురా బ్యాంక్ వ్యాఖ్యానించింది. సింగ్టెల్ ఆదాయాలకు బూస్ట్ ఇస్తుందని, కానీ థాయ్ మరియు భారత మార్కెట్లలో ఎల్లప్పుడూ నిశ్చితంగా ఉండవనేది గమనించాలని తెలిపింది. మరోవైపు సింగ్ టెల్ భారతి టెలీలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేసిందన్న వార్తలతో మార్కెట్లో షేరుకు డిమాండ్ పెరిగింది. 2 శాతానికి పైగా లాభపడింది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని థాయిలాండ్ స్టాక్ ఎక్సేంజీ తెలపగా , దీనిపై వ్యాఖ్యానించడానికి భారతి ఎయిర్ టెల్ నిరాకరించడం విశేషం. -
కొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితం