కరోనా కారణంగా దేశీయ విమానయాన రంగం భారీగా నష్టపోయింది.ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఏఐ కొన్ని ప్రైవేట్ సంస్థలతో చేతులు కలిపి దేశంలోని పలు ఎయిర్ పోర్ట్‌ల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. అయితే కోవిడ్ వల్ల విమానయాన రంగానికి నస్టం రావడంతో ఆయా ఎయిర్ పోర్ట్‌లలో ఉన్న వాటాల్న అమ్మేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన విమానశ్రయాల్లోని తన వాటాల్ని అమ్మాలని నిర్ణయించింది.
మహమ్మారి వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ఇంధన ధరలు కొండెక్కి కూర్చోవడంతో దేశీయ విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల‍్లినట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ.9,500- రూ.10,000 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది.ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్ట్‌లలో 13శాతం వాటాను, హైదరాబాద్ - బెంగళూరుకు చెందిన ఎయిర్ పోర్ట్‌లలో మరో 13శాతం వాటాను అమ్మనుంది.
అయితే వాటాల్ని అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని ఏవియేషన్ మినిస్ట్రీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనల్నిపంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటాల అమ్మకం' ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా,ఈ ప్రక్రియ తొలత బెంగళూరు - హైదరాబాద్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ముంబై - ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ల వాటాను అమ్మనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment