
న్యూఢిల్లీ: ఐపీవోకి సన్నద్ధమవుతున్న ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కి చెందిన ఫ్యామిలీ ఆఫీస్ స్వల్ప వాటాలు తీసుకున్నట్లు సమాచారం.
కంపెనీ ఉద్యోగులు, ప్రారంభ దశ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ లావాదేవీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 10,414 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు స్విగ్గీ షేర్‌హోల్డర్లు ఏప్రిల్‌లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment