హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంసీఏసీలో వాటాల విక్రయ డీల్‌కు సంబంధించి రూ. 1,390 కోట్లు తమకు అందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. జీఎంసీఏసీకి 2026 డిసెంబర్ వరకూ తాము టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా కొనసాగుతామని పేర్కొంది.
ఫిలిప్పీన్స్‌లోని సెబు విమానాశ్రయానికి సంబంధించి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్ (జీఏఐబీవీ), మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎంసీసీ) కలిసి జీఎంసీఏసీని ఏర్పాటు చేశాయి. ఇందులో తమ వాటాలను అబోయిటిజ్ ఇన్‌ఫ్రాక్యాపిటల్‌కు విక్రయించేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.
చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్!
Comments
Please login to add a commentAdd a comment