న్యూఢిల్లీ: టెక్నికల్ కోర్సులను అందించే వెర్నాక్యులర్ ఎడ్యుటెక్ ఫ్లాట్ ఫామ్ గువి(జీయూవీఐ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ తాజాగా పేర్కొంది.
ఐతే డీల్ విలువను వెల్లడించలేదు. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ మద్దతుతో ఏర్పాటైన కంపెనీ వెబ్ డెవలప్‌మెంట్, ఏఐ మాడ్యూల్, ఎస్‌క్యూఎల్ తదితర పలు సాంకేతిక కోర్సులను అందిస్తోంది. పారిశ్రామిక నిపుణుల ద్వారా రూపొందించిన విభిన్న కోర్సులను సైతం వెర్నాక్యులర్ లాంగ్వేజీలలో అందిస్తోంది.
విద్యార్ధులు, యూనివర్శిటీలు, ఉద్యోగులకు అనువైన(టైలర్‌మేడ్) కోర్సులను సైతం రూపొందిస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా దేశ, విదేశాలలో టెక్ వృత్తి నిపుణులను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment