ముంబై: యస్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్‌లకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి.
నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment