Vodafone Idea: Government to own Major Stake Details Inside - Sakshi
Sakshi News home page

Vodafone Idea: ప్రభుత్వం చేతికి వొడాఫోన్‌-ఐడియా మేజర్‌ వాటా.. పడిపోతున్న షేర్లు!

Published Tue, Jan 11 2022 11:41 AM | Last Updated on Tue, Jan 11 2022 12:05 PM

Government to own Major Stake In Vodafone Idea - Sakshi

దేశంలో మూడో అతి పెద్ద ఫోన్‌ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్‌ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 


కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామం వ్యవస్థాపకులతో సహా కంపెనీ ప్రస్తుత షేర్‌హోల్డర్లందరికీ దెబ్బేసేదే!. అయితే కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్ద లాభదాయక పరిస్థితులు కనిపించకపోతుండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ సమర్థించుకుంటోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ పూర్తి వివరాల్ని తెలిపింది కంపెనీ.

ఈ మేరకు సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపింది. యూకేకు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ 28.5 శాతం కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్‌ 17.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 36 శాతం దాకా వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ కీలక పరిణామం తర్వాత మంగళవారం నాటి స్టాక్‌ సూచీల్లో వొడాఫోన్‌ ఐడియా షేర్లు 19 శాతం పడిపోవడం గమనార్హం.

చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రేజీ ఆఫర్‌, ఉచితంగా 5జీబీ డేటా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement