Equity shares
-
పోటెత్తిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్‌తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. -
ఎఫ్‌పీఐల దూకుడు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్‌పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్ నెలలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక మీదట ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్ క్రూడ్ ధరల్లో దిద్దుబాటు భారత్‌కు అనుకూలించే అంశాలు’’అని విజయ్ కుమార్ వివరించారు. వీటిల్లో పెట్టుబడులు ‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్ డాలర్ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్‌లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్‌కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్‌కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్‌లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్‌లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్‌కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
స్టాక్స్‌లో ఈపీఎఫ్‌వో మరిన్ని పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సొమ్ములో ఈక్విటీ వాటా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్విటీ వాటా పెంచడం వల్ల మరిన్ని రాబడులకు అవకాశం ఉంటుంది. అప్పుడు సభ్యులకు మెరుగైన రాబడి రేటు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈపీఎఫ్ నిధిలో ఈక్విటీ వాటాను 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఈపీఎఫ్‌వో పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ తన మొత్తం నిర్వహణ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతమే కేటాయిస్తోంది. ఈక్విటీలకు మరిన్ని పెట్టుబడులు కేటాయించడం వల్ల డెట్ సాధనాల్లో రాబడుల అంతరాన్ని పూడ్చుకోవచ్చని ఈపీఎఫ్‌వో ఆలోచనగా ఉంది. రాబడుల లక్ష్యాలను చేరుకోలేకపోతున్న దృష్ట్యా ఈక్విటీల వాటా పెంచడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈపీఎఫ్‌వోకు చెందిన ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ రెండు వారాల క్రితమే సమావేశమైంది. ఈ అంశంపై చర్చించి ఈక్విటీల వాటాను 25 శాతం పెంచేందుకు సిఫారసు చేసింది. ఒకే విడత కాకుండా తొలుత 15 శాతం నుంచి 20 శాతానికి ఈక్విటీ పెట్టుబడులను తీసుకెళతారు. అక్కడి నుంచి 25 శాతానికి పెంచుతారు. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ సిఫారసుపై జూన్ చివరి వారంలో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీబీటీ దీనికి ఆమోదం తెలిపితే దాన్ని తుది ఆమోదం కోసం కేంద్ర కార్మిక శాఖకు, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
షేర్ల బైబ్యాక్‌కు యూపీఎల్ సై
న్యూఢిల్లీ: అగ్రోకెమికల్స్ దిగ్గజం యూపీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రమోటర్లు మినహా వాటాదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా షేరుకి రూ. 875 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో సుమారు 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి గరిష్ట ధర ప్రకారం సుమారు 1,25,71,428 షేర్లను కొనుగోలు చేసే వీలుంది. ఇందుకు రూ. 1,100 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రతిపాదిత బైబ్యాక్‌కు నియంత్రిత సంస్థలు తదితరాల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 28.24 శాతం వాటా ఉంది. ప్రస్తుత డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ రూ. 1,179 కోట్ల నికర లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. -
బైబ్యాక్‌కు టీసీ‘ఎస్’
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పీడిస్తున్నప్పటికీ దేశీ దిగ్గజాల సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ కొనసాగుతోంది. కోవిడ్–19 ప్రభావంతో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. ఇది దేశీ ఐటీ దిగ్గజాలకు కలసి వస్తున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు ఐటీ కంపెనీలు మొగ్గు చూపినప్పటికీ ఫ్రెషర్స్ నియామకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల డిజిటల్ సేవలు విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం భారీ నిధులను కేటాయిస్తున్నాయి. దీంతో దేశీ కంపెనీలు భారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంటున్నాయి. వెరసి ఈ ఏడాది క్యూ3లో ఐటీ దిగ్గజాలు మరోసారి ఆకర్షణీయ పనితీరును ప్రదర్శించాయి. టీసీఎస్ అయితే మరోసారి సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు అగ్రస్థానంలో నిలుస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. అంతేకాకుండా రూ. 18,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతంపైగా ఎగసింది. రూ. 9,769 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,701 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం వృద్ధితో రూ. 48,885 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 42,015 కోట్ల టర్నోవర్ నమోదైంది. షేరుకి రూ. 4,500 షేరుకి రూ. 4,500 ధర మించకుండా 4 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టీసీఎస్ వెల్లడించింది. 1.08 శాతం ఈక్విటీకి ఇవి సమానంకాగా.. ఇందుకు రూ. 18,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత కేలండర్ ఏడాది(2021)లో కంపెనీ కీలకమైన 25 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని అందుకున్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం తెలియజేశారు. నైపుణ్యాలపై వెచ్చిస్తున్న పెట్టుబడులతో సరఫరాల సవాళ్లలోనూ పటిష్ట పురోగతిని సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా పేర్కొన్నారు. 2021–22 తొలి అర్ధభాగంలో తీసుకున్న 43,000 మంది ఫ్రెషర్స్ కాకుండా తాజా త్రైమాసికంలో 34,000 మందిని ఎంపిక చేసినట్లు సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్. ఇందుకు రికార్డ్ డేట్ ఫిబ్రవరి 7. ► క్యూ3లో నికరంగా 28,238 మందికి ఉపాధిని కల్పించింది. ► డిసెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 5,56,986కు చేరింది. ► ఉద్యోగ వలసల రేటు 15.3%గా నమోదైంది. ► డిసెంబర్‌కల్లా నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 59,920 కోట్లుగా నమోదు. ► కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 72.19%. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి. షేరు 1.5% నీరసించి రూ. 3,857 వద్ద ముగిసింది. కస్టమర్ల బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ అవసరాలకు అనుగుణమైన సర్వీసులు అందించడంలో కంపెనీకున్న సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎండ్టుఎండ్ నైపుణ్యాలు, సవాళ్ల పరిష్కారంలో కంపెనీ చూపుతున్న చొరవ తదితర అంశాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితాలలో వృద్ధి కొనసాగడమే ఇందుకు నిదర్శనం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
వొడాఫోన్-ఐడియా కీలక ప్రకటన, ప్రభుత్వం చేతికి..
దేశంలో మూడో అతి పెద్ద ఫోన్ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామం వ్యవస్థాపకులతో సహా కంపెనీ ప్రస్తుత షేర్‌హోల్డర్లందరికీ దెబ్బేసేదే!. అయితే కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్ద లాభదాయక పరిస్థితులు కనిపించకపోతుండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ సమర్థించుకుంటోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ పూర్తి వివరాల్ని తెలిపింది కంపెనీ. ఈ మేరకు సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపింది. యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్ 17.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 36 శాతం దాకా వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ కీలక పరిణామం తర్వాత మంగళవారం నాటి స్టాక్ సూచీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లు 19 శాతం పడిపోవడం గమనార్హం. చదవండి: బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్, ఉచితంగా 5జీబీ డేటా! -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. ఈ నెల 12న(బుధవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఇదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి అక్టోబర్– డిసెంబర్(క్యూ3) పనితీరును ప్రకటించనుంది. 2021 సెప్టెంబర్ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 51,950 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో.. ఇంతక్రితం టీసీఎస్ 2020 డిసెంబర్ 18న రూ. 16,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. షేరుకి రూ. 3000 ధరలో 5.33 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. అంతక్రితం 2018లోనూ షేరుకి రూ. 2,100 ధరలో 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 16,000 కోట్లను వెచ్చించింది. గతంలో అంటే 2017లో సైతం ఇదే స్థాయిలో బైబ్యాక్‌ను పూర్తి చేయడం గమనార్హం! ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో తదితరాలు మిగులు నిధులను వాటాదారులకు షేర్ల బైబ్యాక్‌ల ద్వారా పంచుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 9,200 కోట్లు వెచ్చించి 5.58 కోట్ల సొంత షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 1,538–1,750 మధ్య ధరలో బైబ్యాక్ చేసింది. గత జనవరిలో విప్రో 9,500 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుని పూర్తి చేసింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 3,855 వద్ద ముగిసింది. చేజిక్కిన పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్పీ) రెండో దశ ప్రాజెక్టును టీసీఎస్ చేజిక్కించుకుంది. తొలి దశ ప్రాజెక్టును చేపట్టి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న కంపెనీ పౌరులకు పాస్ట్‌పోర్ట్ సేవలను అందించడంలో భారీగా ముందడుగు వేసింది. ఈ బాటలో తాజాగా రెం డో దశ ప్రాజెక్టును సైతం అందుకున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. రెండో దశలో ఇప్పటికే ప్రా రంభమైన కీలక అతిపెద్ద ఈగవర్నెన్స్ ప్రోగ్రామ్‌కు కంపెనీ మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంగా సులభతర సర్వీసులకుగాను ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. త్వరలో ఈపాస్పోర్ట్.. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈపాస్పోర్ట్కు అవసరమైన టెక్నాలజీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారి తేజ్ భట్ల వెల్లడించారు. అయితే పాస్‌పోర్ట్‌కు అనుమతి, ప్రింటింగ్, జారీ తదితర అధికారిక సేవలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ రంగ బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న తేజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈపాస్పోర్ట్ పూర్తిస్థాయి పేపర్ఫ్రీ డాక్యుమెంట్కాదని.. స్టాంపింగ్ తదితరాలు కొనసాగుతాయని తెలియజేశారు. వీలైనంత వరకూ ఆటోమేషన్ చేయడం ద్వారా అవకాశమున్నచోట పేపర్(డాక్యుమెంట్) అవసరాలను తగ్గిస్తుందన్నారు. కొద్ది నెలల్లో ఈపాస్ట్పోర్ట్కు వీలున్నట్లు అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో 8.6 కోట్ల పాస్‌పోర్ట్‌ల జారీలో సేవలు అందించినట్లు పేర్కొంది. కాగా.. తాజా పీఎస్పీ ప్రాజెక్టు డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. -
ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది. బైబ్యాక్‌కు రెడీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. గైడెన్స్ భేష్..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వివరించారు. ఆర్డర్ బుక్ రికార్డు 2020–21లో భారీ డీల్స్ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్ ఏజీ నుంచి 3.2 బిలియన్ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్ నుంచి సంపాదించిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది. 25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్ గతేడాదిలో 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో 15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది. రూ. లక్ష కోట్లకు.. గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం. – ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ -
సూచీలకు రిలయన్స్ బలం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇచ్చిన మద్దతుతో దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం తిరిగి లాభాల బాట పట్టాయి. కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జీవితకాల గరిష్టానికి (రూ.2,078.90) దూసుకుపోయింది. ఫలితంగా సెన్సెక్స్ 269 పాయింట్లు పెరిగి (0.71 శాతం) 38,140 పాయింట్ల వద్ద క్లోజ్ అవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి (0.74శాతం) 11,215 వద్ద స్థిరపడింది. సూచీలకు వచ్చిన లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే ఎక్కువగా ఉంది. బుధవారం ఒక్క రోజు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్న సూచీలు, అంతక్రితం ఐదు రోజులు ర్యాలీ చేయడం గమనార్హం. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఐటీసీ, కోటక్ బ్యాంకు లాభపడగా.. యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ నష్టపోయాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీచడంతో బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో ముగిశాయి. చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలపై ఆందోళనల కంటే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తొందరగా వస్తుందన్న అంచనాలు, కంపెనీల ఫలితాలు ఆశించినదాని కంటే మెరుగ్గా ఉండడం అనుకూలించింది. ఐటీ మినహా చాలా వరకు సూచీలు లాభపడ్డాయి. మార్కెట్లు ఏ మాత్రం పడినా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది’’అంటూ జియోజిత్ ఫై నాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మురిపించిన ‘రోసారి’ లిస్టింగ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలోని రోసారి బయోటెక్ లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించింది. ఐపీవోలో భాగంగా ఒక్కో షేరును రూ.425కు కేటాయించగా, ఈ ధరపై 58 శాతం ప్రీమియంతో రూ.670 వద్ద బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఇంట్రాడేలో రూ.804 వరకు వెళ్లి స్టాక్ ఎక్సే్ఛంజ్ అనుమతించిన గరిష్ట ధర రూ.804 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను కూడా తాకింది. చివరకు 75 శాతం లాభంతో రూ.742 వద్ద క్లోజయింది. ఈ ఐపీవోకు అద్భుత స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ నాన్‌స్టాప్ ర్యాలీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్లో పెట్టుబడులకు అమెజాన్ ఆసక్తి చూపిస్తోందంటూ వచ్చిన వార్తలు స్టాక్‌ను నూతన గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.2,078.90 వరకు వెళ్లిన స్టాక్ చివరకు మూడు శాతం లాభపడి రూ.2,060.65 వద్ద క్లోజయింది. ఈ ఏడాది మార్చి 23న 867.82 కనిష్టాన్ని నమోదు చేయగా.. ఈ స్టాక్ కేవలం నాలుగు నెలల్లోనే 135 శాతం లాభపడడం గమనార్హం. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కామ్ తదితర కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ టాప్–50లోకి రిలయన్స్ న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో గుర్తింపు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 50 కంపెనీల్లోకి ప్రవేశించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లను దాటిపోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ విలువ పరంగా 48వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా చూస్తే సౌదీఆరామ్‌కో 1.7 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ (సుమారు రూ.127 లక్షల కోట్లు)తో మొదటి స్థానంలో ఉండగా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ స్టాక్ రూ.2,060.65 వద్ద క్లోజయింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.13,06,329.39 కోట్లను చేరుకుంది. చైనాకు చెందిన ఆలీబాబా గ్రూపు 7వ స్థానంలో ఉంది. టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్ టాప్ 100లో నిలిచింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.8.14లక్షల కోట్లుగా ఉంది. -
ఫండ్ ఇన్వెస్టర్లకు షాక్!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి .. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లకు హోల్డింగ్స్ అమ్మేయడం లేదా పెట్టుబడులపై మరిన్ని రుణాలు తెచ్చి తీర్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని సంస్థ భారత విభాగం ఎండీ సంజయ్ సాప్రే చెప్పారు. ఏదీ కుదిరే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పనిసరై ఆయా స్కీములను మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. మూసివేతతో ఇన్వెస్టర్లపరమైన లావాదేవీలేమీ జరగకపోయినప్పటికీ .. యాజమాన్యం దృష్టికోణంలో ఇవి కొనసాగుతాయని సాప్రే చెప్పారు. మెరుగైన రేట్లకు విక్రయించి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. ‘ఇటు మార్కెట్లు, అటు ఎకానమీ ఏ దిశ తీసుకుంటాయన్నదానిపై స్పష్టత కొరవడటంతో ఇన్వెస్టర్లకు మరిం త హాని జరిగే అవకాశముందని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంతోష్ కామత్ తెలిపారు. సుమారు 26 ఏళ్ల రీసెర్చ్ అనుభవం, 19ఏళ్లకు పైగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మె ంట్ అనుభవం కామత్‌కి ఉంది. ట్రిపుల్ ఎ కన్నా తక్కువ రేటింగ్ ఉండే బాండ్ల పెట్టుబడుల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సెబీతో సంప్రదించాకే: ‘ఆరు ఫండ్ల మూసివేత నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. దీనిపై నియంత్రణ సంస్థ సెబీతో విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలే ఉన్నాయని సెబీ కూడా భావించింది‘‡అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్ ఎండీ వివేక్ కుద్వా తెలిపారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు క్రమానుగతంగా, ’అందరికీ సమానంగా’ చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కుద్వా వివరించారు. ఇది టెంపుల్టన్కి మాత్రమే పరిమితం: యాంఫి 6 స్కీమ్‌ల మూసివేత అంశం కేవలం ఆయా స్కీమ్లకే పరిమితమైన దని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫి పేర్కొంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌పై దీని ప్రభావమేమీ ఉండబోదని కాన్ఫరెన్స్ కాల్లో యాంఫి చైర్మన్ నీలేశ్ షా చెప్పారు. డెట్ స్కీముల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగానే ఉన్నాయని భరోసానిచ్చారు. రూ.22.26 లక్షల కోట్లు ఈ మార్చి 31నాటికి మ్యూచువల్ ఫండ్స్ వద్ద సగటు నిర్వహణ నిధులు రూ.2.13 లక్షల కోట్లు మార్చి నెలలో ఫండ్స్(ఈక్విటీ, డెట్) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ సెబీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి: బ్రోకింగ్ సంస్థలు టెంపుల్టన్ ఆరు డెట్ స్కీముల మూసివేతతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొందని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను, కష్టార్జితాన్ని పరిరక్షించేందు కు ఆర్థిక శాఖ, సెబీ తక్ష ణం జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దాలని కోరింది. స మస్య మూలాల గుర్తింపునకు నిపుణుల కమిటీ వేయాలని పేర్కొంది. ఏం జరిగిందంటే.... కరోనా వైరస్ ధాటికి భారత్ సహా పలు ప్రపంచ దేశాల ఈక్విటీ, బాండ్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. అయితే, కొనేవాళ్లు కరువవడంతో .. రేట్లు గణనీయంగా పడిపోయాయి. పైపెచ్చు తక్కువ స్థాయి రేటింగ్ ఉన్న స్క్రిప్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలహీన క్రెడిట్ రేటింగ్స్ ఉన్న కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడం దాదాపు నిలిపివేశాయి. దీంతో తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల డెట్ స్క్రిప్‌లకు డిమాండ్ భారీగా పడిపోయింది. రిస్కులు ఎక్కువున్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కన్నా మిగులు నిధులను తక్కువ రాబడులు వచ్చినా రిజర్వ్ బ్యాంక్ దగ్గర సురక్షితంగా ఉంచుకునేందుకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై నమ్మకం సన్నగిల్లి ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లకు దూరంగా ఉంటుండటంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి. కరోనా వైరస్‌పరమైన మాంద్యం భయాలతో టెంపుల్టన్ మూసివేసిన ఆరు స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అయినకాడికి అమ్ముకునేందుకు మొగ్గుచూపారు. అయితే, మార్కెట్లో అమ్ముదామన్నా కొనేవారు కరువవడంతో మరో దారి లేక ఈ స్కీములను టెంపుల్టన్ మూసివేయాల్సి వచ్చింది. మిగతా డెట్ ఫండ్స్ మాటేంటి .. ఆరు స్కీమ్‌లు మూసివేసినంత మాత్రాన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పూర్తిగా మూతబడినట్లు కాదు. దాదాపు పాతికేళ్లకుపైగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టెంపుల్టన్ మరో ఏడు డెట్ ఫండ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నాటికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 17,800 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా టెంపుల్టన్ దాదాపు రూ. 36,663 కోట్ల విలువ చేసే 15 ఈక్విటీ ఫండ్స్‌ను, సుమారు రూ. 3,143 కోట్ల విలువ చేసే 11 హైబ్రిడ్ కేటగిరీ స్కీమ్‌లను (ఈక్విటీలు, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్) నిర్వహిస్తోంది (విలువలు మార్చి 31 నాటికి). ఈ ఫండ్సన్నీ యథాప్రకారం కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందరాదని సంస్థ పేర్కొంది. ఇప్పుడేంటి పరిస్థితి... స్కీములను మూసివేసినా ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. స్కీము వాస్తవ గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిందే. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ సంగతి తీసుకుంటే.. సగటు గడువు బట్టి చూసినప్పుడు.. ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి రావడానికి ఏడాది పైన 73 రోజులు పట్టొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్ సగటు కాలావధి బట్టి చూస్తే ఇన్వెస్టర్లు మూడేళ్ల పైన 80 రోజులు దాకా వేచి చూడాల్సి రానుంది. ఈ స్కీములు మూతబడ్డాయి కాబట్టి వీటిల్లోకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్న వారి వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ (ఎస్టీపీ) కింద వీటిల్లో డబ్బు పెట్టిన వారికి మాత్రం చిక్కులు తప్పవు. సాధారణంగా చేతిలో భారీ మొత్తం సొమ్ము ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టకుండా.. ఇలాంటి డెట్ సాధనాల్లో ఉంచుతారు. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా వీటిలో కాస్త ఎక్కువ రాబడి వస్తుందనే ఆలోచన ఇందుకు కారణం. ఇక, ఈ డెట్ సాధనాల నుంచి కొంత మొత్తాన్ని విడతలవారీగా (నెలకోసారి, వారాని కోసారి లాగా) ఈక్విటీల్లోకి ఇన్వెస్టర్లు మళ్లిస్తుంటారు. ప్రస్తుతం మూతబడిన టెంపుల్టన్ స్కీముల్లో ఇలా ఎస్టీపీ కింద భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేసినవారికి కాస్త ఇబ్బంది తప్పదనేది విశ్లేషకుల మాట. -
యస్ బ్యాంక్‌లో కపూర్
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్‌లో ప్రమోటర్ సంస్థ, మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్‌సీపీఎల్) 2.3 శాతం వాటాకు సమానమైన 5.8 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.58.1 ధరకు విక్రయించింది. వీటి విలువ రూ.334 కోట్లు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్‌నామ్) ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే క్రమంలో భాగంగా మోర్గాన్ క్రెడిట్స్ ఈ షేర్లను విక్రయించింది. యస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ ఎమ్‌సీపీఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వాటా విక్రయంతో రాణా కపూర్ కుటుంబం వాటా యస్ బ్యాంక్‌లో 7.4 శాతానికి తగ్గుతుంది. యస్ బ్యాంక్ 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టిందని, గత 15 ఏళ్లలో మంచి వృద్ధిని సాధించామని రాణా తెలిపారు. మోర్గాన్ క్రెడిట్స్ కంపెనీ 2018 ఏప్రిల్‌లో ఆర్‌నామ్)కి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ)జారీ చేసి రూ.1,160 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లు 2021, ఏప్రిల్‌లో మెచ్యూర్ అవుతాయి. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను స్టార్టప్ బిజినెస్‌ల కోసం మోర్గాన్ క్రెడిట్స్ వినియోగించింది. ఈ బాండ్లకు సంబంధించి ముందస్తుగా చెల్లించాల్సిన(వడ్డీతో కలుపుకొని) మొత్తం ఇప్పటిదాకా రూ.722 కోట్లుగా ఉంది. యస్‌బ్యాంక్‌లో విక్రయించిన వాటా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్‌నామ్ ఎన్‌సీడీలకు చెల్లింపులు జరపడానికి మోర్గాన్ క్రెడిట్స్ ఉపయోగించనున్నది. -
మైండ్ ట్రీకి ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా మైండ్ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980 ధరను (మైండ్ ట్రీ షేర్ శుక్రవారం రూ.969 ధర వద్ద ముగిసింది) ఆఫర్ చేస్తోంది. ఈ ఓపెన్ ఆఫర్ ఈ నెల 17 న మొదలై 28న ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారమైతే ఈ ఓపెన్ ఆఫర్ మే 14 నుంచే మొదలు కావలసి ఉంది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి రావడం ఆలస్యం కావడంతో ఓపెన్ ఆఫర్లో జాప్యం చోటు చేసుకుంది. అసెట్– లైట్ సర్వీసెస్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, లాభాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా మైండ్ ట్రీ కంపెనీని ఎల్ అండ్ టీ కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.10,700 కోట్లు... ఎల్ అండ్‌టీ కంపెనీ ఇప్పటికే మైండ్ ట్రీలో 35.15 శాతం వాటా షేర్లను కొనుగోలు చేసింది. తాజా ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబయితే మైండ్‌ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 66 శాతానికి చేరుతుంది. మొత్తం మీద మైండ్ ట్రీలో 66 శాతం వాటా కోసం ఎల్ అండ్ టీ కంపెనీ రూ.10,700 కోట్లు వెచ్చిస్తోంది. వి.జి. సిద్ధార్థ, కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ల నుంచి 20.15 శాతం వాటాకు సమానమైన 3.33 కోట్ల షేర్లను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించింది. ఈ వాటా షేర్ల కోసం మొత్తం రూ.3,269 కోట్లను వెచ్చించింది. ఇక మార్చి 18న యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా 15 శాతం వాటాకు సమానమైన 2.48 కోట్ల షేర్లను రూ.2,434 కోట్లకు కొనుగోలు చేసింది. -
సెన్సెక్స్ 279 పాయింట్లు అప్
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇటీవలి పతనం కారణంగా ధరలు పడిపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడమే దీనికి కారణం. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా కలసి వచ్చింది. చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 279 పాయింట్లు పెరిగి 37,393 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 11,257 పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ, ఆర్థిక, లోహ రంగ షేర్లు రాణించాయి. ఫార్మా షేర్లు పడిపోయాయి. ఈ నెలలో స్టాక్ మార్కెట్ లాభపడటం ఇది రెండో రోజు మాత్రమే. 23 వరకూ ఒడిదుడుకులు... చైనా టెలికం దిగ్గజం హువాయ్‌పై అమెరికా ఆంక్షలు విధించడం... చైనా– అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, లాభాల్లో ముగిశాయి. ఇటీవలి తొమ్మిది రోజుల పతనం కారణంగా బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యాహ్నం 2 గంటల వరకూ స్తబ్దుగా కొనసాగింది. చివరి గంటన్నరలో షార్ట్ కవరింగ్‌కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 63 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 404 పాయింట్ల వరకూ పెరిగింది. మొత్తం మీద రోజంతా 467 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఎన్నికల ఫలితాలు వెలువడే ఈ నెల 23 వరకూ స్టాక్మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ► టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజేస్‌ల బ్రాండెడ్ ఫుడ్ వ్యాపారాన్ని విలీనం చేస్తుండటంతో ఈ రెండు షేర్లు 8–10 శాతం రేంజ్లో పెరిగాయి. ► యస్‌బ్యాంక్ నష్టాలు కొనసాగాయి. ఈ షేర్ 4 శాతం పతనమై రూ.138 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ లాభపడినా, 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, యస్‌బ్యాంక్, అరవింద్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► మూడు రోజుల నష్టాల నుంచి జెట్ ఎయిర్వేస్ కోలుకుంది. 2.5 శాతం లాభంతో రూ.127 వద్ద ముగిసింది. ఎగిసిన రూపాయి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గురువారం దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆఖర్లో కోలుకోవడంతో రూపాయి పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే 31 పైసలు పెరిగి 70.03 వద్ద క్లోజయ్యింది. రూపాయి బలపడటం ఇది వరుసగా మూడో రోజు. ఈ మూడు రోజుల్లో దేశీ కరెన్సీ 48 పైసల మేర పెరిగింది. పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి లాభాలకు కొంత మేర అడ్డుకట్ట పడిందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రా బై బ్యాక్
సాక్షి, ముంబై : సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నామని టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా లిమిటెడ్ బోర్డు బైబ్యాక్‌ప్రతిపాదను ఆమోదం తెలిపింది రూ. 1956 కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు ఆమోదం లభించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గురువారం తెలిపింది. షేరుకి రూ. 950 ధర మించకుండా దాదాపు 2.06 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది 2.1 శాతం ఈక్విటీ వాటాకు సమానం. ఇందుకు రూ. 956 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత ట్రేడింగ్ రేటుకు 14.59 ప్రీమియం ధరలో బై బ్యాక్ చేపడుతున్నట్టు పేర్కొంది. బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం టెక్ మహీంద్రా 2.1 శాతం లాభాల్లో రూ.830 స్థాయి వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రూ.840 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఐఓసీ షేర్ల బైబ్యాక్ @ రూ.4,435 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.4,435 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. అంతేకాకుండా రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని ఐఓసీ గురువారం తెలిపింది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ.149 ధరకు బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బైబ్యాక్ ధర గురువారం ఐఓసీ షేర్ ముగింపు ధర (రూ.137) కంటే 9 శాతం అధికం. ఈ కంపెనీలో 54.06 శాతం వాటా ఉన్న కేంద్రం ఈ షేర్ల బైబ్యాక్‌లో పాల్గొని భారీగా నిధులు సమీకరిస్తుందని అంచనా. 67.5 శాతం మధ్యంతర డివిడెండ్ ఒక్కో షేర్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.75(67.5 శాతం)మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడానికి కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐఓసీ వెల్లడించింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,566 కోట్లని(పన్నులు కాకుండా), ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,544 కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని, దీనికి అదనంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి లభిస్తుందని పేర్కొంది. డివిడెండ్ చెల్లింపునకు సంబంధించి రికార్డ్ డేట్ ఈ నెల 25 అని, ఈనెల 31లోపు డివిడెండ్ మొత్తాన్ని వాటాదారులకు చెల్లిస్తామని వివరించింది. కోల్ ఇండియా, భెల్, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అరడజను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు షేర్ల బైబ్యాక్ ప్రణాళికలను ప్రకటించాయి. ఎన్‌హెచ్‌పీసీ, భెల్, నాల్కో, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్, కేఐఓసీఎల్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఫండ్స్ ఆస్తులు ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్లకు..
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.50 లక్షల కోట్లకు చేరుతుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అంచనా వేశారు. అధిక సంఖ్యలో పనిచేసే వారు ఉండటం, మెరుగైన ఉపాధి అవకాశాల నేపథ్యంలో వారు మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పోల్చి చూస్తే భారత్‌లో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విస్తరణ జీడీపీలో చాలా తక్కువ శాతం ఉందని, ప్రపంచ సగటు 62%గా ఉంటే, మన దగ్గర 11 శాతమే ఉందన్నారు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫి) వార్షిక సదస్సు ముంబైలో జరిగింది. ఇందులో దీపక్ పరేఖ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొదుపు అలవాట్లన్నవి సంప్రదాయ బంగారం, రియల్ ఎస్టేట్ నుంచి ఆర్థిక సాధనాల వైపు మళ్లుతున్నాయని, ఈ ధోరణి మళ్లీ మారకపోవచ్చని, ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్ చెప్పారు. ‘‘ప్రస్తుతం ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.24 లక్షల కోట్లు. ఎక్కువ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు(ఏఎంసీ) రానున్న ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులు రెట్టింపు అవుతాయని అంచనా. అంటే నిర్వహణ ఆస్తులు రూ.50 లక్షల కోట్ల స్థాయికి చేరనున్నాయి’’ అని పరేఖ్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అధికారికం చేసేందుకు చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు, అందరికీ ఆర్థిక సేవలు, ఈక్విటీలకు ఈపీఎఫ్‌వో ఫండ్స్ కేటాయింపులు పెరగడం ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకను పెంచేవేనన్నారు. 2016 మార్చికి రూ.12.3 లక్షల కోట్లుగా ఉన్న ఆస్తులు ఈ ఏడాది జూన్ నాటికి రూ.23 లక్షల కోట్లకు చేరాయి. ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ విషయంలో పారదర్శకత అవసరమని పరేఖ్ అభిప్రాయపడ్డారు. -
టీసీఎస్ మరోసారి బంపర్ ఆఫర్
ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వద్ద భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. గత ఏడాదే ఇన్వెస్టర్ల నుంచి రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసిన టీసీఎస్, ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 16,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ. 2,100 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.99 శాతం అంటే రూ.16 వేల కోట్ల షేర్ బైబ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపినట్టు టీసీఎస్ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35కు బోర్డు మీటింగ్ ముగిసిన అనంతరం కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.2100 చెల్లించనుంది. ఇది నేటి స్టాక్ ప్రారంభ ధర రూ.1800కు 17 శాతం ప్రీమియం. ‘ముందుగా ప్రకటించిన మాదిరిగా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నేడు సమావేశమయ్యారు. 7,61,90,476 వరకు ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఆ మొత్తం రూ.16 వేల కోట్ల వరకు ఉంటుంది. అంటే మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.99 శాతం. ఒక్కో షేరుకు రూ.2100 చెల్లించనున్నాం’ అని టీసీఎస్ నేడు మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. . గత ఏడాది బైబ్యాక్ చేసిన తరవాత కంపెనీ బోనస్ ఇష్యూ కూడా ఇచ్చింది. షేర్ బైబ్యాక్ ప్రకటించగానే.. టీసీఎస్ షేర్లు భారీగా ర్యాలీ చేపట్టాయి. సుమారు 3 శాతం మేర పైకి ఎగిసి, 52 పాయింట్ల లాభంలో రూ.1840.90 వద్ద ముగిశాయి. -
రూ. 2,500 కోట్ల సమీకరణలో జీఎంఆర్ ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనుంది. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉన్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా జీఎంఆర్ కొన్ని ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితమే విద్యుత్ విభాగానికి సంబంధించి 30 శాతం వాటాలను మలేషియాకి చెందిన టెనగా నేషనల్‌కి విక్రయించింది. హైదరాబాద్ విమానాశ్రయంలోనూ వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
వాటాదారులకు పీఎఫ్సీ 1:1 ‘బోనస్’
న్యూఢిల్లీ: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. వాటాదారుల వద్ద ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు మరో ఒక్క షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది. అంతేకాకుండా అధీకృత షేర్ మూల ధనాన్ని రూ.2,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచుకోవడానికి కూడా బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా విద్యుత్, సంబంధిత రంగాల ప్రాజెక్ట్‌లకు పీఎఫ్సీ నిధులు అందిస్తోంది. బోనస్ వార్తల నేపథ్యంలో పీఎఫ్సీ షేర్ బీఎస్ఈలో 4.6 శాతం లాభంతో రూ.210 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 6.1 శాతం లాభపడి రూ.213ను తాకింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా ఉన్న రిజర్వ్‌లను ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు జారీ చేయడానికి వినియోగించుకోవాలన్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎఫ్సీ ఈ బోనస్ షేర్లను అందిస్తోంది. -
రిస్కూ ఉంది.. రాబడీ ఉంది...
ఉమెన్ ఫైనాన్స్ / ఈక్విటీ డెరివేటివ్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టదలచుకునే వారికి వివిధ రకాల కంపెనీలే కాకుండా, ఆ కంపెనీల ఈక్విటీ షేరు ధర ఆధారంగా పని చేసే డెరివేటివ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈక్విటీ డెరివేటివ్స్ అంటారు. వీటిలో మళ్లీ రెండురకాల కాంట్రాక్ట్స్ అయిన ఫ్యూచర్, ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొనుగోళ్లు, అమ్మకాలు జరపాలంటే తప్పనిసరిగా ఏదైనా ఈక్విటీ డెరివేటివ్ బ్రోకర్ వద్ద ఖాతాని ప్రారంభించాలి. అయితే ఇవి చాలా రిస్క్‌తో కూడినవి. కనుక వీటిలో పెట్టుబడి పెట్టబోయే ముందు అవగాహన కలిగి ఉండడం ఉత్తమం. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఎల్లప్పుడూ మూడు రకాల కాల వ్యవధితో కూడిన కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. {పతి నెల చివరి గురువారం ఆ నెల కాంట్రాక్టు క్లోజ్ అవుతుంది. ఆ మరుసటి రోజు 3 నెలల కాలవ్యవధిలో మరొక కొత్త కాంట్రాక్టు మొదలవుతుంది.అన్ని ఈక్విటీ షూర్లు ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఉండవు, ఏయే షేర్లు ఈక్విటీ డెరివేటివ్స్తో ఉండాలనేది ‘సెబి’ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్చేంజ్ వారి చేత నిర్ణయమౌతాయి. ఒక్కొక్క కాంట్రాక్టు విలువ కనీసం 5 లక్షల రూపాయలు ఉంటుంది. దీని ఆధారంగా మార్కెట్ లాట్ని నిర్ణయిస్తారు. {పతి ఆరు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ లాట్‌ను వాటి రేటు ఆధారంగా మార్పులు చేస్తుంటారు. ఈక్విటీ షేర్లకు, ఈక్విటీ డెరివేటివ్స్‌కి ఉన్న తేడా ఏంటో చూద్దాం.. ఈక్విటీ షేర్లు ఒక్క షేర్ అయినా కొనవచ్చు. కానీ ఈక్విటీ డెరివేటివ్స్ని మాత్రం ఎక్స్చేంజ్ వారు ఎన్ని షేర్లనైతే ఒక లాట్‌గా నిర్ణయిస్తారో అన్ని షేర్లూ తీసుకోవాలి. ఈక్విటీ షేర్లు కొనడానికి షేరు ధర మొత్తానికి సొమ్మును చెల్లించవలసి ఉంటుంది. కానీ డెరివేటివ్స్‌లో మార్జిన్ సొమ్మును చెల్లించవ చ్చు. ఉదాహరణకు ఒక షేరు ధర 100 రూపాయలు అనుకుంటే 10,000 రూపాయలతో 100 షేర్లు కొనవచ్చు. అదే షేరు ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్ మార్జిన్ 25 శాతం ఉందనుకుంటే, అదే 100 షేర్లను 2,500 రూపాయలకు పొందవచ్చు. ఈ మార్జిన్ శాతాన్ని ఎక్స్చేంజ్ వారే నిర్ణయిస్తారు. ఈక్విటీ షేరుకు కాల వ్యవధి ఏమీ ఉండదు. ఎంతకాలమైనా డీమ్యాట్ ఖాతాలో ఉంచుకోవచ్చు. కానీ ఈక్విటీ డెరివేటివ్స్‌లో మాత్రం కాంట్రాక్టు ముగిసే తేదీ నిర్ణయించి ఉంటుంది. ఆ తేదీన తప్పనిసరిగా క్లోజ్ చెయ్యాలి. లేదా ఆటోమేటిక్‌గా ఎక్సేంజ్ వారే క్లోజ్ చేసేస్తారు. ఒక కంపెనీ షేరు ధర తగ్గుతుందని ఊహించినవారు ఫ్యూచర్స్‌లో ఆ షేర్ లాట్ని అమ్మవచ్చు. కానీ అదే షేర్లనైతే అమ్మడానికి వీలు కాదు. ముందే కొని ఉంటేనే అమ్మగలం. మార్జిన్ శాతం పెరిగితే ఆ పెరిగిన సొమ్మును మళ్లీ చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ చెల్లించకపోతే పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. ఫైనాన్షియల్ డెరివేటివ్స్‌లో స్టాక్ ఆధారిత డెరివేటివ్స్ మాత్రమే కాకుండా ఇండెక్స్ ఆధారిత డెరివేటివ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డెరివేటివ్స్‌లో కాంట్రాక్టు ధర ఆ షేరు ధర కన్నా ఎక్కువగా ఉంటుంది. కాంట్రాక్టు వ్యవధి దగ్గర పడుతున్న కొద్దీ షేరు ధరకు మ్యాచ్ అవుతూ ఉంటుంది. ప్రతి రోజూ ఆ కాంట్రాక్టు క్లోజింగ్ ధరకు ‘మార్క్ టు మార్కెట్’ చేస్తారు. లాభం వస్తే ఖాతాకు జమ చేస్తారు. నష్టం వస్తే ఆ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించి రిస్క్‌ను భరించగలిగే శక్తి ఉన్నప్పుడు ఏ కంపెనీదైతే షేరును మీరు డెరివేటివ్స్‌లో తీసుకోదలచుకున్నారో ఆ కంపెనీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే వీటిలో పెట్టుబడి పెట్టాలి. లేకపోతే అసలుకే ఎసరు రావచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ఇండిగో ఐపీఓ నేటి నుంచి టేకాఫ్
* ఈ నెల 29 వరకూ * ప్రైస్‌బాండ్ రూ.700-765 న్యూఢిల్లీ: దేశీయ విమానయాన కంపెనీ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఐపీఓ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. రూ.3,018 కోట్ల ఈ ఐపీఓ గురువారం(ఈ నెల29న) ముగుస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత భారత మార్కెట్లో ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓకు రూ.700-765 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. రూ.1,272.2 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా, రూ.1,746 కోట్ల విలువైన ముగ్గురు ప్రమోటర్ల (రాకేశ్ గంగ్వాల్, శోభా గంగ్వాల్, చిన్కెర్పు ఫ్యామిలీ ట్రస్ట్)వాటా షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా జారీ చేస్తారు. బార్క్లేస్ బ్యాంక్ పీఎల్సీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియాలు ఈ ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఇండిగో 98 విమానాలతో సర్వీసులను నిర్వహిస్తోంది. వీటిలో 75 విమానాలను ఆపరేటింగ్ లీజ్ విధానంలో తీసుకున్నవే. ఈ విధానంలో వ్యయాలు తక్కువగా ఉంటాయని అంచనా. -
మ్యాట్రిమోనిడాట్కామ్ ఐపీఓ!
- రూ.600-700 కోట్లు సమీకరణ ప్రణాళిక - సెబీకి పత్రాలు... న్యూఢిల్లీ: భారత్‌మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ)కు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఈ సంస్థ బుధవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.600-700 కోట్ల నిధులు సమీకరించనున్నదని సమాచారం. . ఈ ఐపీఓలో భాగంగా రూ.350 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 16.6 లక్షల షేర్లను జారీ చేయనున్నదని ఈ పత్రాల్లో మ్యాట్రిమోనిడాట్కామ్ పేర్కొంది. ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డాయిస్ ఈక్విటీస్ ఇండియాలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15) చివరి నాటికల్లా మ్యాట్రిమోనీడాట్‌కామ్ సంస్థ రూ.243 కోట్ల ఆదాయాన్ని రూ.18 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ఈ సంస్థ వద్ద 26.5 లక్షల వధూవరుల ప్రొఫైల్స్ ఉన్నాయి. నిధుల సమీకరణ విస్తరణ కార్యకలాపాలకు వినియోగించాలన్నది ప్రణాళిక. ఇంత భారీ స్థాయి లో ఐపీఓకు వస్తోన్న 2వ ఇంటర్నెట్ కంపెనీ ఇది. ఇంతకు ముందు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్ 2013లో రూ.950 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించింది.