ఎన్‌ఎండీసీపై ధరల తగ్గుదల ప్రభావం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ తొలి త్రైమాసిక నికర లాభం 47 శాతం క్షీణించింది. అంతకుముందు ఏడాది రూ. 1,915 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ. 1,010 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 48 శాతం క్షీణించి రూ. 3,476 కోట్ల నుంచి రూ. 1,806 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి ఇనుము ధరలు తగ్గడం ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.