
న్యూఢిల్లీ: ఎన్‌ఎమ్‌డీసీలో ప్రభుత్వ వాటా విక్రయం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో 1.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ ధరను రూ.153.5గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సోమవారం ముగింపు ధర రూ.161.85తో పోలిస్తే 5 శాతం తక్కువ. మంగళవారంనాడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, బుధవారం రిటైల్ ఇన్వెస్టర్లకు... మొత్తం రెండు రోజుల పాటు ఈ ఓఎఫ్‌ఎస్‌లో వాటా విక్రయం జరుగుతుంది.
ఎన్‌ఎమ్‌డీసీలో 1.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.750 కోట్ల నిధులు ప్రభుత్వానికి వస్తాయని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం, ప్రభుత్వ రంగ బీమా సంస్థలను, ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్‌లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.52,500 కోట్లు సమీకరించింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.72,500 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment