ఎన్‌ఎండీసీలో జాబ్స్‌; 304 ఖాళీలు | NMDC Recruitment 2021: Field Attendant, Maintenance Assistant Jobs | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీలో 304 ఖాళీలు

Published Wed, Mar 17 2021 2:52 PM | Last Updated on Wed, Mar 17 2021 2:54 PM

NMDC Recruitment 2021: Field Attendant, Maintenance Assistant Jobs - Sakshi

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 304

» పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ)–81, బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ)–09.

» ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌–35, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–30. అర్హత: మిడిల్‌ పాస్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

» మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌) (ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –76, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–72. అర్హత: వెల్డింగ్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్‌/మోటార్‌ మెకానిక్‌/డీజిల్‌ మెకానిక్‌/ఆటో ఎలక్ట్రీషియన్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

» మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –49,బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–32. అర్హత: ఎలక్ట్రికల్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

» బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్‌ ట్రేడులో మెట్రిక్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్‌ మేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

» ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.
» వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

» పరీక్షా విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్‌(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్‌ బాక్స్‌ నెం.1383, పోస్ట్‌ ఆఫీస్, హుమాయూన్‌ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్‌–500028 చిరునామాకు పంపించాలి.

»  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
»  దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021
»  వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/Careers/Default.aspx

ఎన్‌ఎండీసీలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement