
సాక్షి,తాడేపల్లి: మరో చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరాపై ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పదం కుదరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్‌ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్‌కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పీ.మధుసూదన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం దీనిపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు. కాగా తాజా అంగీకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ సాకారం కానుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు ముమ్మరం చేసినట్లు సమాచారం.