ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్‌ఎండీసీ
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు రంగం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ ముడి ఇనుము ధరలను 20% మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెలలో మిగతా రోజులకు ఈ రేటు వర్తిస్తుందని తెలిపింది. అధిక గ్రేడ్ ఐరన్ ఓర్ ధరను (లంప్స్) టన్నుకు రూ. 200 మేర, ఫైన్స్ రేటును రూ. 500 మేర తగ్గించినట్లు పేర్కొంది. దీంతో లంప్స్ ధర రూ. 3,050 గాను, ఫైన్స్ రేటు రూ. 1,960గాను ఉంటుందని ఎన్‌ఎండీసీ వివరిం చింది. ఏప్రిల్ 18 నుంచి నెలాఖరు దాకా ఈ రేట్లు వర్తిస్తాయని తెలిపింది.