Lamps
-
పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..
దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ పిల్లలు ఎంతో హడావుడి చేస్తుంటారు. దీపావళి వేళ ఎటుచూసినా దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు చిన్న పిల్లల చేత పెద్దలు దివిటీలు కొట్టిస్తారు. దీనివెనుక ఒక పరమార్థం ఉంది.దీపావళి రోజున పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దివిటీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. గోగు కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిని కట్టి, దానిని దీపంతో వెలిగిస్తారు. పిల్లలకు ఆ కర్రలను ఇచ్చి, పెద్దలు తమ సమక్షంలో ఆ దివిటీలను కొట్టిస్తారు. ఈ సమయంలో వాటిని గాలిలో గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పిల్లల చేత పాలు పాడిస్తూ ఈ వేడుక చేస్తారు.ఈ దివిటీలు కొట్టించే కార్యక్రమం ముగిశాక పిల్లల కాళ్లు చేతులు కడిగి స్వీట్స్ తినిపిస్తారు. అనంతరం పిల్లల చేత టపాసులు కాల్పిస్తారు. ఈ దివిటీలు కొట్టించడం వెనుకనున్న అంతరార్థం విషయానికొస్తే.. దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ గృహాలను చూస్తారట. వారికి ఆహ్వనం పలుకుతున్న రీతిలో దివిటీలను కాలుస్తారని పండితులు చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి ఏర్పడిన సంప్రదాయం అని పెద్దలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
అయోధ్య: ఆ మట్టి ప్రమిదలను ఏం చేస్తారంటే..
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిన్న(బుధవారం) అత్యంత వేడుకగా దీపోత్సవం జరిగింది. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి యోగి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.దీపావళి సందర్భంగా గత ఎనిమిదేళ్లుగా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేళ నగరం వినూత్న కాంతులతో నిండిపోతుంది. అయితే దీపోత్సవం సందర్భంగా దీపాలు వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలను ఏమి చేస్తారు? ఈ ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది.గత ఎనిమిది ఏళ్లుగా అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగిస్తున్నారు. తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో లక్షకు పైగా దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఏటా ఈ సంఖ్యను పెంచుతూ నిన్న జరిగిన ఎనిమిదో దీపోత్సవంలో 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని వరల్డ్ రికార్డ్స్ బృందం లెక్కించి సర్టిఫికేట్ జారీ చేయనుంది.ఈ లెక్కింపు అనంతరం అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ దీపాల ప్రమిదిలను అక్కడి నుంచి తొలగించనున్నారు. అవధ్ యూనివర్సిటీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ చతుర్వేది మీడియాతో మాట్లాడుతూ దీపోత్సవం అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ బృందం అన్ని ఘాట్లను శుభ్రం చేసి,ఆ ప్రమిదలనన్నింటినీ సేకరించి, ఒక చోటచేర్చి, ఆ తర్వాత పారవేస్తుందని తెలిపారు. ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
అయోధ్యలో కన్నుల పండుగగా దీపోత్సవం (ఫొటోలు)
-
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పండుగ ఇది. దీపావళి పండుగ ఆనందం, ఐక్యతలకు చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్‌లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి ఉత్సవ సమయాన ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ముగ్గులతో గృహాలను, బహిరంగ ప్రదేశాలను అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దుబాయ్‌లో కూడా కనిపిస్తుంది. దుబాయ్‌వాసులు దీపావళి రోజున తమ ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. వ్యాపార సంస్థలను విద్యుత్ లాంతర్లతో అలంకరిస్తారు. ఈ దీపాల వెలుగులు దుబాయ్ అంతటా కనిపిస్తాయి. దుబాయ్‌లో దీపావళి షాపింగ్ ఉత్సాహం కొన్ని వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. దుబాయ్‌లోని మార్కెట్లు, మాల్స్ కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, కుర్తా-పైజామాలు మార్కెట్లలో విరివిగా కనిపిస్తాయి. దీపావళి వేడుకలలో అంతర్భాగమైన తీపి వంటకాలను, రుచికరమైన స్నాక్స్‌ను విరివిగా విక్రయిస్తుంటారు. దీపావళి నాడు దుబాయ్‌లో బాణాసంచా వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని పలు రెస్టారెంట్లు ప్రత్యేక దీపావళి వంటకాల మెనూలను అందిస్తాయి. అక్కడి భారతీయులు, పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాల రుచులను ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇది కూడా చదవండి: చైనా దురహంకారంపై అమెరికా, భారత్ ఉక్కుపాదం! -
కుండల తయారీలో కామర్స్ గ్రాడ్యుయేట్.. దీపావళి ప్రమిదలు చేయడంలో బిజీ!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ ఆ కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఆ కుటుంబం కొన్ని వారాలుగా మట్టి ప్రమిదలను తయారు చేయడంలో బిజీగా ఉంది. శ్రీనగర్‌లోని నిషాత్ ప్రాంతానికి చెందిన ఉమర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమిదలను తయారు చేస్తున్నారు. ఈ దీపాలను విభిన్నమైన, ప్రత్యేకమైన శైలిలో ఉమర్ తయారు చేస్తున్నారు. ఉమర్ కుటుంబ సభ్యులు కశ్మీర్ లోయలోని సాంప్రదాయ మట్టి కళను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది దీపావళికి ఉమర్ 15 వేల దీపాలను తయారు చేశారు. ఈసారి ఉమర్ తమకు 20 వేలకు పైగా దీపాలకు ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నారు. ఉమర్ ఇప్పటికే 4 వేలకు పైగా దీపాలను సిద్ధం చేశారు. ఇవి వివిధ రకాలు, వివిధ పరిమాణాలలో ఉన్నాయి. ఉమర్ కామర్స్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో కలిసి కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. ఉమర్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా తమకు ఉపాధి రూపంలో భారీ కానుక లభిస్తుందని తెలిపారు. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే.. -
వందల ఏళ్లుగా భూగర్భంలో ‘సేఫ్టీ ల్యాంప్’.. అసలు దీని కథేంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు. పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది. ఎలా పని చేస్తుందంటే.. ‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు. మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది. వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్చార్జి ఉంటారు. రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం.. బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి. -
తారా దీపం
చీకటిని అంతం చేసేది వెలుగు. కోవిడ్–19తో ప్రపంచాన్ని ఒకలాంటి చీకటి ఆవహించింది. మన దేశంలో ఈ చీకటిని పోగొట్టడానికి ‘దీపం వెలిగిద్దాం’ అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల దీపాలు వెలిగాయి. సినిమా స్టార్స్ కూడా దీపాలు వెలిగించి ‘‘మేము సైతం’’ అన్నారు. ఆ వెలుగులు చూద్దాం. వెంకటేష్, నాగార్జున, అమల, అఖిల్, మహేశ్ బాబు పాయల్ రాజ్‌పుత్, విష్ణు, గోపీచంద్, శ్రీయ పూజా హెగ్డే, రాశీ ఖన్నా, రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక అర్జున్, ఐశ్వర్య, సాయి కుమార్, సురేఖ -
రండి.. దీపాలు వెలిగిద్దాం
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఓ వేదికపై వాజ్‌పేయి తన కవితను చదువుతూ కనిపించారు. వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలి కరోనా వైరస్ బాధితులకు, వారికి వైద్య సేవలందించే డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, సాధారణ ప్రజలకు సరిపడా నిత్యావసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మాస్కులు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన 11 సాధికార బృందాలతో, సంబంధిత అధికారులతో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా టెస్టింగ్, క్రిటికల్ కేర్ ట్రైనింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం ఫోన్లో ట్రంప్–మోదీ సంభాషణ ప్రాణాంతక కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. వారిద్దరూ శనివారం ఫోన్ ద్వారా పరస్పరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై తమ మధ్య విస్తృతమైన చర్చ జరిగిందని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. -
మానవ మృగాలను శిక్షించాలి
ప్రొద్దుటూరు టౌన్ : జమ్మూకశ్మీర్‌లో 8 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసి చంపిన మానవ మృగాలను చంపాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పుట్టపర్తి సర్కిల్ మీదుగా రాజీవ్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో టీఎన్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు చేతన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్, సాయినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వినోద్, గురు సుమంత్, రెహమాన్, మల్లికార్జునరెడ్డితోపాటు టీఎన్టీయూసీ హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రసన్న, ఉషా, గరిశపాటి లక్ష్మీదేవి, సీఓలు రసూలమ్మ, విమల, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 రోజులపాటు అత్యంత దారుణంగా హింసించి చంపేసిన కిరాతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. -
ఆలయాల్లో ధూప దీపాలకు ఇకపై రూ.5వేలు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం తక్కువగా ఉండే ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు సజావుగా జరిగేందుకు దేవాదాయ శాఖ ఒక్కో ఆలయానికీ ఇచ్చే సాయాన్ని రూ. 5 వేలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతి నెలా ఒక్కో ఆలయానికి రెండున్నర వేల రూపాయలు సాయం అందజేస్తుండగా.. అందులో రూ. 1500 ఆలయ అర్చకుని గౌరవ వేతనంగా, వెయ్యి రూపాయలు ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కేటాయించారు. ఇక నుంచి అర్చకుని గౌరవ వేతనం మూడు వేలకు, నైవేద్యం ఖర్చు రెండు వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 23,834 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా ప్రస్తుతం కేవలం 1367 ఆలయాలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007కు ముందు ఆదాయం లేని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు కొరవడటంతో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. -
ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్ఎండీసీ
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు రంగం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్ఎండీసీ ముడి ఇనుము ధరలను 20% మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెలలో మిగతా రోజులకు ఈ రేటు వర్తిస్తుందని తెలిపింది. అధిక గ్రేడ్ ఐరన్ ఓర్ ధరను (లంప్స్) టన్నుకు రూ. 200 మేర, ఫైన్స్ రేటును రూ. 500 మేర తగ్గించినట్లు పేర్కొంది. దీంతో లంప్స్ ధర రూ. 3,050 గాను, ఫైన్స్ రేటు రూ. 1,960గాను ఉంటుందని ఎన్ఎండీసీ వివరిం చింది. ఏప్రిల్ 18 నుంచి నెలాఖరు దాకా ఈ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. -
ఆవిష్కరణం: టార్చ్‌లైట్ పూర్వరూపం లాంతరే!
నిప్పును నిరంతరం వెలిగే దీపంగా మార్చుకొని, దాన్ని ఒక కాంతిజనకంగా ఉపయోగించుకోవడం క్రీస్తు పూర్వం వేల ఏళ్ల క్రితమే మొదలైందని పరిశీలకుల భావన. గ్రీకు భాషలో వీటినే ‘లంపాస్’ అనే వారు. అవే ఇంగ్లిష్‌లో ‘ల్యాంప్’లు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో ఈ పదం వాడకంలోకి వచ్చింది. ఆ తొలినాళ్ల దీపాలే ‘టార్చ్లైట్లు’. అలాగే లాంతర్లను కూడా టార్చ్లుగానే భావించవచ్చు. నేటికీ వినియోగంలో ఉన్న లాంతర్లు 1783లో తొలిసారి ఆవిష్కృతం అయ్యాయి. అమీ ఆర్గండ్ అనే స్విస్ట్ కెమిస్ట్ వీటిని రూపొందించాడు. ఇవే చీకటిని చేధించి ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే నమ్మకమైన హ్యాండ్ ల్యాంప్స్‌గా మారాయి. తొలిరోజుల్లో జంతువుల కొవ్వుతో ఈ దీపాలను వెలిగించి, చీకటిలో ఉపయోగించే వారు. తర్వాత వంద సంవత్సరాలకు గ్యాస్, కిరోసిన్ ఇంధనంగా ఉండే లాంత ర్లను తయారు చేశారు. ఇవి ఆధునికంగా రూపాంతరం చెంది డ్రై సెల్ బ్యాటరీగా 1896లో అందుబాటులోకి వచ్చింది. అదే మనం వాడే ‘టార్చ్’. లిక్విడ్ రూపంలోని ఇంధనానికి భిన్నంగా పేస్ట్ ఎలక్ట్రోలైట్ల ద్వారా ఒక లైట్‌ను వెలిగించాలనే ఐడియా హ్యాండ్ బ్యాటరీ రూపకల్పనకు దారి తీసింది. తొలిసారి ఈ హ్యాండ్ల్యాంప్స్ను న్యూయార్క్ సిటీ పోలీసులు ఉపయోగించారు. రాత్రిపూట గస్తీ కోసం పరిశోధకులు వీటిని పోలీసులకు డొనేట్ చేశారు. ఆ విధంగా టార్చ్లైట్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఆ తర్వాత లైట్ల విషయంలోనూ, ముందువైపు ఉండే అద్దం విషయంలో అనే మార్పులు వచ్చాయి. తర్వాత ఎల్ఈడీలు, హెచ్ఐడీల రూపంలోని లైట్లతో బ్యాటరీలను రూపొందించారు. విద్యుత్ఘటాలతో, చార్జింగ్‌తో, కరెంట్‌తో పనిచేసే రకరకాల టార్చ్‌లైట్లూ వినియోగంలోకి వచ్చాయి.