కొవ్వొత్తులతో ఇన్నర్‌వీల్, డ్వాక్రా సంఘాల సభ్యుల ర్యాలీ
ప్రొద్దుటూరు టౌన్ : జమ్మూకశ్మీర్‌లో 8 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసి చంపిన మానవ మృగాలను చంపాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పుట్టపర్తి సర్కిల్ మీదుగా రాజీవ్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో టీఎన్‌ఎస్‌ఎఫ్ పట్టణాధ్యక్షుడు చేతన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్, సాయినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వినోద్, గురు సుమంత్, రెహమాన్, మల్లికార్జునరెడ్డితోపాటు టీఎన్‌టీయూసీ హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రసన్న, ఉషా, గరిశపాటి లక్ష్మీదేవి, సీఓలు రసూలమ్మ, విమల, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 రోజులపాటు అత్యంత దారుణంగా హింసించి చంపేసిన కిరాతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment