proddutoor
-
కాలానుగుణంగా కోలాటం : ప్రొద్దుటూరు మహిళల విజయం
‘చీరలంటే చీరలు... చీరల మీద చిలకలు/ రైకలంటే రైకలు... రైకల మీద రంగులు’‘జానపదమైనా సరే–‘అబ్బబ్బా దేవుడూ... అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు... శ్రీరామచంద్రుడు’... ఇలా ఆధాత్మికమైనా సరే–ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలం కోలాటం సంబరాల సందడిలో ఉత్సాహతరంగమై ఎగరాల్సిందే.తెలుగు వారి సాంస్కృతిక చిరునామాలలో ఒకటి... కోలాటం. కళ అనేది పుస్తకాల్లో కాదు ప్రజల మధ్య, ప్రజలతో ఉంటేనే నిత్యనూతనంగా వెలిగిపోతుంది. ఈ ఎరుకతో కోలాటానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకు కదిలారు ప్రొద్దుటూరు మహిళలు.కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు కోలాట నృత్యానికి కొత్త హంగులను జోడించి ఆ కళకు మరింత ఆదరణ వచ్చేలా కృషి చేస్తున్నారు. బండి మల్లిక ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మాస్టర్ సాయి భరత్ దగ్గర కోలాటంలో శిక్షణ తీసుకుంది. తనలాగే శిక్షణ తీసుకున్న దాదాపు నాలుగు వందలమందితో ‘సావిత్రి బాయి పూలే అభ్యుదయ మహిళా కోలాట బృందం’ ఏర్పాటు చేసింది. అందరినీ ఒకే తాటి పైకి...కోలాటం సంప్రదాయ స్ఫూర్తిని పదిలంగా కా΄ాడేలా పూలమాలలు, లెజిన్స్, భజన తాళాలు... మొదలైన వాటితో అన్నమాచార్య కీర్తనలతో నృత్యప్రదర్శనలు చేస్తూ కోలాటానికి కొత్త శోభను తీసుకువస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోలాటం నేర్చుకున్న వారు ఎవరికి వారు బృందాలుగా వుండడంతో వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి కొత్తగా ఏదైనా సాధించాలనే ఆలోచన మల్లికకు వచ్చింది.వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి దశావతార కోలాటంపశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో 222 మంది మహిళలు కోలాటంతో దశావతార జానపద నృత్య ప్రదర్శన చేశారు. ‘గోవిందుడేలరాడే.. గోపాలుడేలరాడే.. మా అయ్య ఏలరాడే..’ అనే పాటతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన తో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు సాధించారు. కాలంతో పాటు ప్రవహించాలి...ప్రొద్దుటూరుకు మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్, తిరుచానూరు, శ్రీకాళహస్తి, ఒంటిమిట్ట, అరుణాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తిరుమల తిరుపతి ఆలయాల బ్రహ్మోత్సవాలలో తమ కోలాటంతో కనుల పండగ చేస్తున్నారు బృందం సభ్యులు.‘కాలేజీలో పనిచేస్తూనే సాయంత్రం వేళల్లో, సెలవుల్లో కోలాటం నేర్చుకున్నాను. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపకరించే కళ ఇది. ్ర΄ాచీన జానపద కళలకు జీవం పోయాలనే లక్ష్యంతో కోలాటం ఆడుతున్నాం. ఈ కళ నిలువ నీరులా ఉండకూడదు. కాలంతోపాటు ప్రవహించాలి. ప్రతి తరం సొంతం చేసుకోవాలి’ అంటుంది ‘గౌతమి ఇంజినీరింగ్ కాలేజీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భూమిరెడ్డి నాగమణి.ఇక అయోధ్య రాముడి దగ్గరికి... ‘దశావతారం’ కోలాట నృత్య ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రదర్శనల కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోకుండా సొంత ఖర్చులతో దేవస్థానాలలో ప్రదర్శనలు చేస్తున్నాం. బయట ఎక్కడా ప్రదర్శనలు చేయం. అయోధ్యలో కోలాటం ప్రదర్శన చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ తరం పిల్లలు కూడా కోలాటానికి దగ్గర కావాలి. ఏ కళా దానికి అదే దూరం కాదు. సంప్రదాయ కళలకు చేరువ కావడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కరిద్దరు కాకుండా కళాకారులందరూ ఐక్యంగా కృషి చేస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో నిరూపించాం. – బండి మల్లిక అరుణాచల కొండల్లో... అలుపెరగని కోలాటంబండి మల్లిక నేతృత్వంలో తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణ సందర్భంగా ‘సావిత్రి బాయి పూలే కోలాట బృందం’లోని 111 మంది మహిళా కళాకారులు 14 కిలోమీటర్లు కోలాటాన్ని ప్రదర్శించారు. కోలాట కర్రలతో అన్నమయ్య, శివనామస్మరణ కీర్తనలకు లయబద్ధంగా నృత్యం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన కోలాట నృత్యం మరుసటి రోజు ఉదయం 3.40 గంటల వరకు కొనసాగింది. ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు గిరి నృత్య ప్రదక్షిణలో అలసిపోకుండా కోలాటం పూర్తి చేసిన వీరి ప్రతిభ ఉత్తర అమెరికాలోని ‘తానా బుక్ ఆఫ్ రికార్డు’ లో నమోదైంది. ‘భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లోనూ చోటు సాధించారు. – మోపూరు బాలకృష్ణారెడ్డి సాక్షి ప్రతినిధి, కడపఫొటోలు: షేక్ మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు. -
మానవ మృగాలను శిక్షించాలి
ప్రొద్దుటూరు టౌన్ : జమ్మూకశ్మీర్‌లో 8 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసి చంపిన మానవ మృగాలను చంపాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పుట్టపర్తి సర్కిల్ మీదుగా రాజీవ్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో టీఎన్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు చేతన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్, సాయినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వినోద్, గురు సుమంత్, రెహమాన్, మల్లికార్జునరెడ్డితోపాటు టీఎన్టీయూసీ హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రసన్న, ఉషా, గరిశపాటి లక్ష్మీదేవి, సీఓలు రసూలమ్మ, విమల, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 రోజులపాటు అత్యంత దారుణంగా హింసించి చంపేసిన కిరాతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం
-
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
సీఐ విజయభాస్కర్‌రెడ్డి సస్పెన్షన్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా గత ఏడాది విధులు నిర్వహించిన విజయభాస్కర్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రొద్దుటూరులో విధులు నిర్వహిస్తున్న సమయంలో సీఐపై వచ్చిన ఆరోపణలపై అనంతపురం అడిషనల్ ఎస్పీ సింగ్ ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేశారు. ఓ మహిళను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే వేధింపులు చేస్తున్న వ్యక్తితో సీఐ కుమ్మక్కై ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించారన్న విషయం ఆ మహిళ అడిషనల్ ఎస్పీ ఎదుట కూడా చెప్పినట్లు తెలిసింది. అలాగే రూ.33లక్షల స్థలం పంచాయతీలో తలదూర్చి బాధితులను బెదిరించినట్లు కూడా సీఐపై ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై అడిషనల్ ఎస్పీ సాక్షులను విచారించారు. ఈ నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజయభాస్కరరెడ్డి కర్నూలు జిల్లా సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. -
మోడీ అభివృద్ధిపై గ్లోబెల్ ప్రచారం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సీఎం నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలను మాత్రమే అభివృద్ధి చేశాడని, దానిని ఆ పార్టీ గ్లోబెల్స్ ప్రచారం చేసుకుని లబ్ధి పొందుతోందని తెహల్కా, ఔట్లుక్ మాజీ ఎడిటర్, హార్డ్ న్యూస్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అమిత్‌సేన్ గుప్త తెలిపారు. మానవ హక్కుల సంఘం దివంగత నేత కే.బాలగోపాల్ రాసిన ‘ముస్లిం ఐడెంటిటీ - హిందుత్వ రాజకీయాలు’ అనే పుస్తకాన్ని స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆదివారం ఆవిష్కరించారు. మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, ఇలాగే దేశాన్ని అభివృద్ధి చేస్తారని బీజేపీ ప్రచారం చే యడం సరైంది కాదని చెప్పారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ ముస్లిం ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయాలు అనే పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. ప్రముఖ కవి ఖాదర్‌మొహిద్దీన్, మానవహక్కుల వేది క జిల్లా కన్వీనర్ జయశ్రీ, తెలుగు అధ్యాపకుడు ఎన్నెస్ ఖలందర్ పాల్గొన్నారు. కడప కల్చరల్: ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కడప కోటవీధిలోని షహమీరియా షాదీఖానాలో మతోన్మాద వ్యతిరేక సదస్సు నిర్వహించారు. దేశంలో విధ్వంసాలు జరిగినపుడు ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని, మీడియా పదేపదే ఈ ఘటనలను చూపడంతో సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అమిత్సేన్గుప్త అన్నారు. పౌరహక్కుల వేదిక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, షహమీరియా పీఠాధిపతి సయ్యద్‌షా అహ్మద్‌పీర్ షహమీరి మాట్లాడారు. ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మగ్బూల్‌బాషా, జిల్లా అధ్యక్షుడు ఎస్.మస్తాన్‌వలీ, జిల్లా కమిటీ ప్రతినిధులు, పౌరహక్కుల వేదిక జిల్లా ప్రతినిధులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎలా బతకాలి..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: అరకొర దిగుబడితో వరి రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేసినా కనీసం రెండు పుట్లు కూడా ధాన్యం పండక పోవడంతో అప్పులపాలవుతున్నారు. ఇలాగైతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో వందల ఎకరాల్లో వరి(జగిత్యాల) సాగు చేస్తున్నారు. కొందరు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు 4-5 పుట్లు పండితే కానీ రైతుకు పెట్టుబడి రాదు. ఎకరాకు రూ.20 వేల ఖర్చుపెట్టినా ఎర్ర తెగులు ఆశించడంతో 15 రోజులకోసారి 5 సార్లు మందులు కొట్టాల్సి వస్తోంది. దీంతో ఖర్చు మరింత పెరిగింది. రైతు కుటుంబ సభ్యులే పనులు చేసుకుంటున్నా కూలీల అవసరం తప్పడంలేదు. మందులు కొట్టేందుకు, నాట్లు వేసేందుకు రోజుకు రూ.150 ఇవ్వాల్సి వ స్తోందని వాపోతున్నారు. మరోవైపు పంట దిగుబడి బాగా వచ్చిందనుకుంటే వడ్లల్లో బియ్యం గింజలు లేక పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 14 బస్తాల దిగుబడి రావడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి రైతులకు ఏర్పడింది. అయినా ఏ అధికారి కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోలేకపోయిందని అన్నదాతలుఆరోపిస్తున్నారు. పుట్టి వడ్లను గత ఏడాది రూ.6,800లకు విక్రయించగా ఈ ఏడాది ధర మరింత పడిపోయిందని వాపోతున్నారు. పొలాలను పరిశీలించిన అగ్రికల్చరల్ జాయింట్ డైరక్టర్ జయచంద్ర రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. గిట్టుబాటు ధర లేదు..పంట దిగుబడి లేదు ఏడేళ్లుగా మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నా భర్త సుబ్బరాయుడు, నేను, కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేస్తున్నాం. ఎకరాకు రూ.22వేలుపైగానే ఖర్చయింది. ఈ ఏడాది ఎర్రతెగులు సోకడంతో నాలుగైదు సార్లు మందులు కొట్టాల్సి వచ్చింది. ఎకరాకు 5 పుట్లు పండితే ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఖర్చులు పోను కూళ్లు గిట్టుబాటు అవుతాయి. కౌలు చెల్లించడం కూడా ప్రస్తుత పరిస్థితిలో భారమైంది. ఎకరాకు 1040 కిలోల వడ్లు దిగుబడి వచ్చాయి. ఈ లెక్కన కనీసం రెండు పుట్లు కూడా దిగుబడి రాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. -
వేధిస్తున్న మహిళా వైద్యుల కొరత
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జిల్లా ఆస్పత్రి పేదలకు దూరమవుతోంది. కాన్పుల కోసం ఇక్కడ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ తగిన డాక్టర్లు లేకపోవడంతో నిరుపయోగంగా మారుతోంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రతి కేసును కడప రిమ్స్‌కు పంపిస్తున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి వుంది. స్థానిక ప్రజలతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం,దువ్వూరు, మైదుకూరు, కమలాపురం మండలాలకు చెందిన వారు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. గతంలో ఇక్కడ ఐదు మంది మహిళా వైద్యులు ఉండేవారు. పగలు ఓపితో పాటు 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండేవారు. అంతేగాక కాన్పుల వార్డులో ప్రతి రోజూ ఒక డాక్టర్ విధులు నిర్వహించేవారు. గర్భిణీలతో పాటు బాలింతలకు మెరుగైన వైద్యం లభించేది. అయితే ముగ్గురు సెలవులో ఉండగా ఒక డాక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో భాగ్యమ్మ అనే డాక్టర్ మాత్రమే నాలుగైదు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఒకరే డాక్టర్ కావడంతో పగలు ఓపీతో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆస్పత్రికి వచ్చే కాన్పుల కేసులను చూడటానికి డాక్టర్ లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సులే దిక్కు.. ఆస్పత్రిలోని కాన్పుల విభాగంలో రాత్రి సమయాల్లో డాక్టర్లు లేకపోవడంతో నర్సులే దిక్కవుతున్నారు. మొదటి సారి సాధారణ ప్రసవం జరిగి తిరిగి రెండో కాన్పు కోసం వచ్చిన మహిళలను మాత్రం ఇక్కడి నర్సులు చేర్పించుకుంటున్నారు. మొదటి కాన్పు కోసం వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తతో కడప రిమ్స్‌కు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. డాక్టర్ లేరని చెప్పకుండా బీపీ ఎక్కువగా ఉందనో, బిడ్డ ఉమ్మునీరు తాగిందని చెప్పుతుండటంతో ఆందోళన చెంది వేరే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఆస్పత్రిలో మహిళా డాక్టర్ల కొరత ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ఒకరిద్దరైనా వస్తారనే ఆశాభావం ఉంది. అప్పటి వరకు ఉన్న డాక్టర్తోనే సర్దుకుని పోవాల్సిందే. - ఎస్.ఎన్.మూర్తి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బంగారు తల్లికి బాలారిష్టాలు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మే నెల నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇంతవరకూ ఈ పథకం పై తనకే అవగాహన లేదని ఇటీవల ఓ ఎంపీడీఓ స్వయంగా అన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని అమలు చేశారు. 2005 మే నెలలో బాలికా సంరక్షణపథకం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీని స్థానంలో ఈ ఏడాది మే 1 నుంచి బంగారు తల్లి పథకాన్ని అమలు చేశారు. కొన్ని విమర్శల నేపథ్యంలో జూన్ 19వ తేదీన ఈ పథకంకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. దీంతో పథకం అమలులో జాప్యం జరిగింది తొలుత చాలా మందికి ఈ పథకంపై అవగాహన కొరవడటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కూడా దీనిపై పడింది. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బాండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సంబంధిత జిల్లా అధికారులు గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. అయితే దరఖాస్తు పత్రంలో గ్రామ సంఘం ప్రతినిధితోపాటు ఏఎన్ఎం, వైద్యాధికారులు సంతకాలు చేయాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదలు సైతం ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది పనితీరుపై వారు పెదవి విరుస్తున్నారు. ‘మీరు మా వద్ద టీకాలు వేయించుకోలేదని.. మీ సమాచారం మా వద్ద లేదని తాము సంతకాలు చేయలేమని’ చాలా చోట్ల ఏఎన్ఎంలు, డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదుచేయించుకున్నవారికి ఏఎన్ఎంలు క్రమం తప్పకుండా టీకాలు వేసి గర్భవతులపేర్లను నమోదు చేసుకుంటారు. ప్రైవేటు వైద్యుల వద్ద చూపించుకోవడంతో వారెవరో తమకు తెలియదని సంతకాలు చేయడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. మండల సమాఖ్య అధికారులకు శనివారం జిల్లా స్థాయిలో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రైవేట్ వైద్యుల చేతనైనా సరే సంతకాలు చేయించాలని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే దరఖాస్తులో రేషన్ కార్డు జిరాక్స్‌ను తప్పక జత చేయాల్సి ఉంది. చాలా మందికి పెళ్లి అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డుకు దరఖాస్తుచేసినా మళ్లీ వచ్చే రచ్చబండలో కానీ ఇవ్వడం లేదు. 2011 నవంబర్‌లో రచ్చబండ జరగగా మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అలాగే బంగారుతల్లి పథకంకు సంబంధించిన సమాచారంపై అవగాహన లేక చాలా మంది అరకొరగా దరఖాస్తులను భర్తీ చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు వీటిని తిప్పిపంపుతున్నారు. అన్ని వివరాలను పూర్తి చేస్తేనే మీకు అర్హత లభిస్తుందంటున్నారు. పథకం ఒక ఆడపిల్లకే వర్తిస్తుందా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుట్టినా వర్తిస్తుందా, కవలలు పుడితే పరిస్థితి ఏమిటి వంటి విషయాలపై ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. ఆపరేషన్ చేయించుకున్నవారికే పథకం వర్తిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పుట్టిన ఆడపిల్ల చదువుకోకపోతే ఈ పథకం వర్తించదు. అంగన్వాడీ కేంద్రం మొదలు ఇంటర్మీడియట్ వరకు చదివి పాస్ అయితే రూ.55వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష కలిపి మొత్తం రూ.1.55లక్షలు 21 ఏళ్లు వచ్చేనాటికి అందజేస్తారు. నగదు బదిలీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 155321తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా అధికారులు పూర్తి స్థాయిలో ఈ పథకంపై ప్రచారం చేయాల్సి ఉంది.