ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా గత ఏడాది విధులు నిర్వహించిన విజయభాస్కర్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రొద్దుటూరులో విధులు నిర్వహిస్తున్న సమయంలో సీఐపై వచ్చిన ఆరోపణలపై అనంతపురం అడిషనల్ ఎస్పీ సింగ్ ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేశారు.
ఓ మహిళను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే వేధింపులు చేస్తున్న వ్యక్తితో సీఐ కుమ్మక్కై ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించారన్న విషయం ఆ మహిళ అడిషనల్ ఎస్పీ ఎదుట కూడా చెప్పినట్లు తెలిసింది. అలాగే రూ.33లక్షల స్థలం పంచాయతీలో తలదూర్చి బాధితులను బెదిరించినట్లు కూడా సీఐపై ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై అడిషనల్ ఎస్పీ సాక్షులను విచారించారు. ఈ నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజయభాస్కరరెడ్డి కర్నూలు జిల్లా సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
సీఐ విజయభాస్కర్‌రెడ్డి సస్పెన్షన్
Published Tue, Dec 10 2013 6:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement