vijaya bhaskar reddy
-
ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతు పురాణం
సాక్షి, టాస్‌్కపోర్సు: అధికార దర్పంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. తమ ఆగడాలను అడ్డుకున్న వారిపై విరుచుకుప డుతున్నారు. తాజాగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఓ టీడీపీ నాయకుడు ఇష్టారీతిన బూతులు తిడుతూ బెదిరించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లె గ్రామంలో జరిగింది. ఇటీవల రేషన్ డీలర్షిప్ దక్కించుకున్న టీడీపీ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రేషన్ బియ్యం బస్తాలు దించుతుండగా విద్యార్థులకు ఇబ్బంది అంటూ ఓ ఉపాధ్యాయుడు అడ్డు చెప్పారు. దీంతో టీడీపీ నేత బూతులతో చెలరేగిపోయాడు. ‘ఎవడు ఎంఈవో.. చెçప్పుతో కొడతా.. ఏం పీకుతావ్ రా ఎర్రి.. (బూతు)? లోఫర్ నా కొడకా.. మాకు ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా? 164 సీట్లొచ్చాయి. స్టోర్ బియ్యం బడిలో ఎలా దించుతావని మమ్మల్నే ప్రశ్నిస్తావా? ఇక్కడ ఉండలేకపోతే ... (బూతు)’ అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు బిత్తరపోయాడు. సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే ఇలా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడంతో ఆ ఉపాధ్యాయుడు మిన్నకుండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ నాయకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత జరిగినా విద్యాశాఖ అధికారులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ స్పందించక పోవడం విచారకరం. -
హైకోర్టు జడ్జిగా సీవీ భాస్కర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలోని మొదటి కోర్టు హాల్లో గురువారం ఉదయం ఆయనతో సీజే జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయ మూర్తులు, న్యాయాధికారులు హాజరయ్యారు. తొలిరోజు సీజేతో కలసి మొదటి కోర్టు హాల్లో విధులు నిర్వహించారు. జస్టిస్ చాడ విజయభాస్కర్‌రెడ్డి ప్రమాణంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 28కి పెరిగింది. అలాగే.. సుప్రీంకోర్టు కొలీజియం గత వారం సిఫార్సు చేసిన ఆరుగురికి ఆమోదం లభిస్తే ఈ సంఖ్య 34కు చేరనుంది. ఆ తర్వాత కూడా మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. -
రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసు: రెండో రోజు కస్టడీకి నిందితులు
సాక్షి, హైదరాబాద్: రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. నిందితులు మల్లేష్, సుదాకర్, కృష్ణంరాజు, శ్రీధర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. సంగారెడ్డి జైలు నుంచి నలుగురు నిందితులను కేపీహెచ్పీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. త్రిలోక్‌నాథ్ బాబా కాల్ డేటా పరిశీలించి, గురూజీతో సన్నిహితంగా మెదులుతున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల కొన్ని సెటిల్మెంట్స్లో లావాదేవీల విషయంలో త్రిలోక్‌నాథ్, విజయ్ భాస్కర్ రెడడ్డికి గొడవలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజ్, కాల్ సీడీఆర్ ఆధారంగా ఇతరుల పాత్రపై విచారణ చేపట్టారు. గుప్తనిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
రియాల్టర్ హత్య: పరుష పదజాలమే ప్రాణం తీసిందా?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్పీ ప్రాంతానికి చెందిన రియల్టర్ విజయభాస్కర్‌రెడ్డి కిడ్నాప్, దారుణ హత్యకు సంబందించి గురూజీ విషయమై ఆయన వాడిన పరుష పదజాలమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్ కర్నూల్‌కు చెందిన మల్లేష్, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్‌బాబు, హైదరాబాద్ బోరబండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ కస్టడీలో ఉన్న నిందితుల ద్వారా అతడి కదలికలకు సంబంధించిన వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వయంగా శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాకు వచ్చి విచారణను పర్యవేక్షించారు. విజయభాస్కర్ హత్య కారణాలను అన్వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడని నిందితులు వెల్లడించారు. గురూజీకి రెండు రాష్ట్రాల్లోను భక్తులు ఉన్నారని, ఎక్కువ మంది ఆయన వద్దకు వైద్యం కోసం వచి్చన వారేనని చెప్పారు. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారని నిందితులు చెప్పినట్లు తెలిసింది. కొన్ని లావాదేవీల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. గొడవలు వద్దంటూ సర్ధిచెప్పేందుకు గత నెల 20న విజయభాస్కర్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే విజయభాస్కర్‌రెడ్డి నిందితులతో పాటు వారి కుటుంబీకులను కించపరిచేలా మాట్లాడటంతోనే కిడ్నాప్, హత్యకు దారితీసినట్లు వెల్లడించారని తెలుస్తోంది. నిందితుల కస్టడీ ముగిసిన తర్వాతే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అప్పటివరకూ ఏమీ చెప్పలేమని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
కౌశల్ ఆర్మీని విస్తరిస్తా..
సాక్షి బెంగళూరు: భవిష్యత్తులో కౌశల్ ఆర్మీని మరింతగా విస్తరిస్తానని బిగ్‌బాస్ తెలుగు సీజన్–2 విజేత కౌశల్ మండ స్పష్టం చేశారు. కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కౌశల్ బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు మారతహళ్లిలోని తులసి థియేటర్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్–2 విజేత అయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్క ఆర్మీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సమాజ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలా సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అనంతరం ఐటీపీఎల్‌లో ఉన్న బిర్యానీ జోన్‌కు వెళ్లి అభిమానులతో కలసి భోజనం చేశారు. బిర్యానీజోన్ యజమానులు విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలు కౌశల్‌కు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇక్కడి బిర్యానీ రుచికి ఫిదా అయిన కౌశల్, తెలుగువారి ప్రత్యేక డిష్ అయిన బిరియానిని బెంగళూరు వాసులకు అందజేస్తున్న విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలను అభినందించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పెద్దవడుగూరు/ అనంతపురం న్యూసిటీ: క్రిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్ అప్పేచర్ల చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో రాజీ కావాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్త చిక్కెం విజయభాస్కర్‌రెడ్డి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుమందు తాగడం కలకలం రేపింది. బాధితుని బంధువులు తెలిపిన మేరకు.. జేసీ సోదరుల వెన్నంటి ఉండే చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి 2015లో వైఎస్సార్సీపీలో చేరాడు. అదే ఏడాది మార్చి 31న దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన అనుచరులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. గ్రామంలో ఏ సంఘటన జరిగినా వైఎస్సార్సీపీ కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేసేవారు. చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో రాజీకి రావాలని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీవ్రం చేసి.. వ్యతిరేకించే వారిని గొడవల్లో ఇరికించి అక్రమ కేసులు బనాయించేవారు. పోలీసుల ఓవరాక్షన్ అక్టోబర్ 31న అప్పేచర్ల గ్రామం 521 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో గల చింత తోపు కొలతలు వేయడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వీరి ద్విచక్రవాహనాల టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు పంక్చర్ చేసి, ప్లగ్గులు ఎత్తుకెళ్లారు. బాధితులు పొలం అనుభవదారులపై అనుమానం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిక్కెం విజయభాస్కర్‌రెడ్డితోపాటు మరికొంతమందిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ పేరిట.. మరోసారి ‘రాజీ’ కోసం వేధించడంతో చిక్కెం విజయభాస్కర్‌రెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న చిక్కెం విజయభాస్కర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పరామర్శించారు. చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య విషయంలో సీఐ, ఎస్ఐలు పదే పదే రాజీకావాలని చిక్కెం విజయభాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు. గ్రామాన్ని వదిలిపోతారా లేక రాజీ అవుతారా అంటూ బెదిరిస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదన్నారు. పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. బాధితుడిని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, పార్టీ నగరాధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, నేతలు చుక్కలూరు దిలీప్‌రెడ్డి, కసునూరు రఘునాథరెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యం
పలమనేరు అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం వైఎస్ఆర్సీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపే తన లక్ష్యమని ఆ పార్టీలో చేరిన పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి సృష్టంచేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో మంగళవారం వైఎస్ఆర్సీపీలో చేరాక తొలిసారిగా పలమనేరుకు విచ్చేసిన విజయభాస్కర్‌రెడ్డికి స్థానిక కోఆర్డినేటర్లతో కలసి పార్టీ నాయకులు, ఆయన అభిమానులు, కార్యకర్తలు బుధవారం పట్టణంలో భారీ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘జగన్ నాయకత్వం వర్థిల్లాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలి’ అనే నినాదాలతో హోరెత్తించారు. మార్కెట్ కమిటీ ఆవరణలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పలమనేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా వారి గెలుపుకోసం కృషిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో నాటి వైఎస్ సంక్షేమపాలన రావాలంటే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ గెలుపును తన భుజాలపై వేసుకుంటానన్నారు. స్థానిక కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులకు ఎన్నటికీ రుణపడి ఉంటానన్నారు. పెద్దపంజాణి మండలంలో పార్టీ కేడర్‌ను మరింత బలోపేతం చేసి నియోజకవర్గంలోనే తన మండలాన్ని వైఎస్ఆర్సీపీకి కంచుకోటలా తయారుచేస్తామన్నారు. అనంతరం కోఆర్డినేటర్లు రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్ మాట్లాడుతూ విజయభాస్కర్ రెడ్డి పార్టీలో చేరికతో తమకు రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి వెంకటేష్‌గౌడ, జిల్లా కార్యదర్శి చెంగారెడ్డి, పలమనే రు, బైరెడ్డిపల్లె, గంగవరం మండల కన్వీనర్లు బాలాజీ నాయుడు, కేశవులు, మోహన్‌రెడ్డి, బాగారెడ్డి తదితరులు ప్రసంగించారు. నియోజకవర్గ నేతలంతా కలసి విజయభాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన విజయభాస్కర్ రెడ్డి
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన విజయభాస్కర్ రెడ్డి
హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. ప్రజల వెంట నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పలువురు నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ స్వభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఇక, మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ కూడా వైఎస్సార్సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. -
సారీ సూర్యా..ఓకే దిగ్గీ
ఒక్క సారీతో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కోపం తగ్గిపోయిందట. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభావేదికపైకి వెళ్లనీయకుండా సూర్యప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తననే అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలిగి అక్కడి నుంచి నేరుగా కర్నూలుకు వెళ్లిపోయారు ఆయన. పార్టీకి చెందిన ముఖ్యనేతలు పొరపాటు జరిగిందని బుజ్జగిస్తున్నా పట్టించుకోకుండా వారిపై తిట్ల పురాణం పఠిస్తూ ఆయన వర్గీయులతో సహా వెళ్లి కర్నూలు కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేశారు. అసలే కాంగ్రెస్ పార్టీ బతకలేని పరిస్థితుల్లో సూర్యప్రకాశ్‌రెడ్డి లాంటి నాయకుడు పార్టీని వీడితే కష్టమని అధిష్టానం భావించింది. విజయవాడలో శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్(దిగ్గీ రాజా) నేతల సమక్షంలోనే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి క్షమాపణ కోరారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో సూర్యప్రకాశ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలపై కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. దిగ్విజయ్ సింగ్ ఆయనకు సారీ చెప్పడంతో ఇక అసంతప్తి, కోపతాపాలన్నీ కూడా సర్దుకున్నట్లేనని పార్టీలో చర్చించుకుంటున్నారు. -
మన మినిస్టర్స్..
ఆదిలాబాద్ : నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి ప్రభుత్వాల్లో చిలుకూరి రాంచంద్రారెడ్డి మార్కెటింగ్, చిన్న నీటి పారుదల శాఖల మంత్రిగా పనిచేశారు. రాంచంద్రారెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పడాల భూమన్న కూడా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. నిర్మల్ : జిల్లా రాజకీయ కేంద్రంగా నిర్మల్‌కు పేరుంది. ఇక్కడి నాయకులు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిం చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవులు చేపట్టారు. పి.నర్సారెడ్డి 1964లో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించడమే కాకుండా రెండుసార్లు మంత్రి పదవులను సైతం చేపట్టారు. నర్సారెడ్డి రాష్ట్ర భారీ నీటి పారుదల, రెవె న్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారి మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఈ కాలంలో ఆయన సమాచార శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో, 1998లో జరిగిన మధ్యంతర, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొంది మరోసారి హ్యాట్రిక్ సాధించా రు. ఈ మూడు పర్యాయాలు రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ, కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అయిండ్ల భీంరెడి ్డకి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. మంచిర్యాల : లక్సెట్టిపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న మంచిర్యాల 2009లో పునర్విభజన అనంతరం మంచిర్యాల నియోజకవర్గంగా మారింది. 1967, 1972 ఎన్నికల్లో జేవీ నర్సింగారావ్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. జీవీ సుధాకర్ రావు 1985-1989 మధ్యకాలంలో స్వతంత్రంగా, 1989లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జీవీ సుధాకర్‌రావ్ రాష్ట్రంలో నీటి పారుదల శాఖ, రవాణా, చక్కెర శాఖ మంత్రి పదవులను పొందారు. చెన్నూర్ : 1967లో నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోదాటి రాజమల్లు ఆర్యోగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ నుంచి గెలుపొందిన బోడ జనార్దన్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదే కార్మిక శాఖను 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన గడ్డం వినోద్ చేపట్టారు. ముథోల్ : నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత గడ్డెన్నది. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం పొందిన గడ్డెన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కోట్ల విజయ భాస్కరరెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు. బోథ్ : లంబాడా వర్గం తొలి ఎమ్మెల్యే అమర్‌సింగ్ తిలావత్. 1978 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. టీడీపీ తరఫున గేడాం రామారావు 1985లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు నగేష్ కూడా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, జీసీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నుంచి రెండో ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్నాక భీంరావు రాష్ట్రంలోనే తొలి గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. నిజాం సర్కార్‌తో పోరాడిన స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే కావడం గర్వకారణం. సిర్పూర్ : కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన కేవీ కేశవులు 1972, 78 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో చేనేత మంత్రిగా పనిచేశారు. 1983, 85లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేవీ నారాయణరావు 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా వ్యవహరించారు. -
సీఐ విజయభాస్కర్‌రెడ్డి సస్పెన్షన్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా గత ఏడాది విధులు నిర్వహించిన విజయభాస్కర్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రొద్దుటూరులో విధులు నిర్వహిస్తున్న సమయంలో సీఐపై వచ్చిన ఆరోపణలపై అనంతపురం అడిషనల్ ఎస్పీ సింగ్ ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేశారు. ఓ మహిళను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే వేధింపులు చేస్తున్న వ్యక్తితో సీఐ కుమ్మక్కై ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించారన్న విషయం ఆ మహిళ అడిషనల్ ఎస్పీ ఎదుట కూడా చెప్పినట్లు తెలిసింది. అలాగే రూ.33లక్షల స్థలం పంచాయతీలో తలదూర్చి బాధితులను బెదిరించినట్లు కూడా సీఐపై ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై అడిషనల్ ఎస్పీ సాక్షులను విచారించారు. ఈ నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజయభాస్కరరెడ్డి కర్నూలు జిల్లా సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు.