జస్టిస్ చాడ విజయభాస్కర్‌రెడ్డిని కలసి అభినందిస్తున్న హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రఘునాథ్, కార్యదర్శి నరేందర్. చిత్రంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలోని మొదటి కోర్టు హాల్‌లో గురువారం ఉదయం ఆయనతో సీజే జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయ మూర్తులు, న్యాయాధికారులు హాజరయ్యారు.
తొలిరోజు సీజేతో కలసి మొదటి కోర్టు హాల్‌లో విధులు నిర్వహించారు. జస్టిస్ చాడ విజయభాస్కర్‌రెడ్డి ప్రమాణంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 28కి పెరిగింది. అలాగే.. సుప్రీంకోర్టు కొలీజియం గత వారం సిఫార్సు చేసిన ఆరుగురికి ఆమోదం లభిస్తే ఈ సంఖ్య 34కు చేరనుంది. ఆ తర్వాత కూడా మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment