
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా ఎన్.వాణి నియామకాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాణిని డీఎంఈగా నియమించడాన్ని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. సర్వీసులో తనకంటే జూనియర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇన్‌ఛార్జి ప్రాతిపదికన కాకుండా అదనపు బాధ్యతలు లేదా శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టు భర్తీ చేయాలని తెలిపింది. నిబంధనల మేరకు కొత్త డీఎంఈను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చదవండి: విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలో పాలిసెట్ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment