సాక్షి, హైదరాబాద్: రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. నిందితులు మల్లేష్, సుదాకర్, కృష్ణంరాజు, శ్రీధర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. సంగారెడ్డి జైలు నుంచి నలుగురు నిందితులను కేపీహెచ్‌పీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. త్రిలోక్‌నాథ్ బాబా కాల్ డేటా పరిశీలించి, గురూజీతో సన్నిహితంగా మెదులుతున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.
ఇటీవల కొన్ని సెటిల్‌మెంట్స్‌లో లావాదేవీల విషయంలో త్రిలోక్‌నాథ్, విజయ్ భాస్కర్ రెడడ్డికి గొడవలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజ్, కాల్ సీడీఆర్ ఆధారంగా ఇతరుల పాత్రపై విచారణ చేపట్టారు. గుప్తనిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment