realter
-
కెనడాలో ప్రముఖ భారత సంతతి బిల్డర్ దారుణ హత్య
కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్ బూటా సింగ్ గిల్ హత్యకు గురయ్యాడు. సోమవారం (ఏప్రిల్ 8) దుండగులు అతడిని కాల్చి చంపారు. ఎడ్మంటన్ లోని గురునానక్ సిక్కు ప్రార్థనామందిరం అధ్యక్షుడు ఉన్నారు.సివిల్ ఇంజనీర్ సరబ్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్తితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్బెర్టా ప్రావిన్స్‌లోని మిల్‌వుడ్ రెక్ సెంటర్ సమీపంలో గిల్ వ్యాపారానికి సంబంధించిన నిర్మాణ స్థలంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గిల్ హత్య స్థానిక వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు సభ్యుడు టిమ్ ఉప్పల్, మేయర్ అమర్జీత్ సింగ్ సోహి, రేడియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మణిందర్ గిల్, గురుశరణ్ సింగ్ బటర్ లాంటి ప్రముఖులు బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని , సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రదేశంలో ముగ్గురువ్యక్తులమధ్య వాగ్వాదం జరిగిందని ఇదే కాల్పులకు దారి తీసి ఉంటుందనేది పోలీసుల అనుమానం. అంతేకాదు తనకుబెదిరింపుకాల్స్ వస్తున్నట్టు గతంలో గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుగుతోంది.కాగా ఎడ్మంటన్‌లోని ఇతర బిల్డర్లకు కూడా ప్రాణహాని ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. త కొన్ని రోజులుగా, కొత్తగా నిర్మించిన ఇళ్లకు నిప్పు పెట్టిన సంఘటనలు జరిగినట్టు సమాచారం. అంతేకాదు భారతదేశంలోని క్రిమినల్ ముఠాతో లింకున్నముఠా వాట్సాప్ కాల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని స్థానిక పోలిసు అధికారి డేవ్ పాటన్ వెల్లడించారు. ఆరుగురు యువకులను అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు తెలిపారు. -
ఎన్నారైకి రూ.3.11 కోట్ల టోకరా
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రవాస భారతీయుడిని రూ.3.11 కోట్లకు మోసం చేసిన ఇద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ లండన్‌లో నివసిస్తున్నారు. వ్యాపార పనుల కోసం ఏటా నాలుగైదుసార్లు సిటీకి వస్తుంటారు. 2013లో వచ్చిన సందర్భంలో రిజ్వాన్, మహ్మద్ షోయబ్ అనే వ్యక్తులు ఇక్బాల్‌ను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేలా ఇక్బాల్‌ను ఒప్పించారు. వీరి మాటలతో వివిధ దఫాల్లో ఇక్బాల్ డబ్బులిచ్చాడు. 2014 ఏప్రిల్ 3న షాద్‌నగర్ సమీపంలోని 2 ఎకరాల 4 గంటల స్థలాన్ని విక్రయిస్తామని చెప్పారు. రూ.44 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. నగదు ముట్టినప్పటికీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో బాధితుడు ఆరా తీయగా సదరు స్థలానికి, రిజ్వాన్, షోయబ్‌లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. రూ.3.11 కోట్ల మేర వారు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం.. -
వారిద్దరిపై బలవంతపు చర్యలొద్దు..
సాక్షి, హైదరాబాద్: రియల్టర్ శ్రీధర్‌రావు, ఆయన భార్య సంధ్యలపై అరెస్టు లాంటి బలవంతమైన చర్యలు చేపట్టరాదని హైకోర్టు నార్సింగి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. నార్సింగి పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వీరిద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేశారు. -
రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసు: రెండో రోజు కస్టడీకి నిందితులు
సాక్షి, హైదరాబాద్: రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. నిందితులు మల్లేష్, సుదాకర్, కృష్ణంరాజు, శ్రీధర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. సంగారెడ్డి జైలు నుంచి నలుగురు నిందితులను కేపీహెచ్పీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. త్రిలోక్‌నాథ్ బాబా కాల్ డేటా పరిశీలించి, గురూజీతో సన్నిహితంగా మెదులుతున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల కొన్ని సెటిల్మెంట్స్లో లావాదేవీల విషయంలో త్రిలోక్‌నాథ్, విజయ్ భాస్కర్ రెడడ్డికి గొడవలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజ్, కాల్ సీడీఆర్ ఆధారంగా ఇతరుల పాత్రపై విచారణ చేపట్టారు. గుప్తనిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
రియాల్టర్ హత్య: పరుష పదజాలమే ప్రాణం తీసిందా?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్పీ ప్రాంతానికి చెందిన రియల్టర్ విజయభాస్కర్‌రెడ్డి కిడ్నాప్, దారుణ హత్యకు సంబందించి గురూజీ విషయమై ఆయన వాడిన పరుష పదజాలమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్ కర్నూల్‌కు చెందిన మల్లేష్, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్‌బాబు, హైదరాబాద్ బోరబండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ కస్టడీలో ఉన్న నిందితుల ద్వారా అతడి కదలికలకు సంబంధించిన వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వయంగా శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాకు వచ్చి విచారణను పర్యవేక్షించారు. విజయభాస్కర్ హత్య కారణాలను అన్వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడని నిందితులు వెల్లడించారు. గురూజీకి రెండు రాష్ట్రాల్లోను భక్తులు ఉన్నారని, ఎక్కువ మంది ఆయన వద్దకు వైద్యం కోసం వచి్చన వారేనని చెప్పారు. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారని నిందితులు చెప్పినట్లు తెలిసింది. కొన్ని లావాదేవీల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. గొడవలు వద్దంటూ సర్ధిచెప్పేందుకు గత నెల 20న విజయభాస్కర్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే విజయభాస్కర్‌రెడ్డి నిందితులతో పాటు వారి కుటుంబీకులను కించపరిచేలా మాట్లాడటంతోనే కిడ్నాప్, హత్యకు దారితీసినట్లు వెల్లడించారని తెలుస్తోంది. నిందితుల కస్టడీ ముగిసిన తర్వాతే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అప్పటివరకూ ఏమీ చెప్పలేమని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
రియల్టర్ ఆత్మహత్య
గుణదల (విజయవాడ ఈస్ట్) : వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రియల్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపం ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ శ్రీకాంత్ (41) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలో పలు చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించి క్రయవిక్రయాలు చేస్తున్నాడు. అతనికి భార్య లిఖిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వ్యాపారంలో తీవ్రంగా నష్టాన్ని చవి చూశాడు. కొంత మంది పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన నగదు చెల్లించకుండా ఇబ్బందికి గురి చేశారు. కోట్లాది రూపాయల మేర ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కొంత కాలంగా మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటలకు గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు సేకరించిన పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా భవానీపురం కృష్ణానది సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడని గురువారం భవానీపురం పోలీసులకు సమాచారం అందింది. మృతుడి వద్ద డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డులు సేకరించిన పోలీసులు అతనిని శ్రీకాంత్‌గా నిర్దారించారు. దీంతో మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. అప్పులే కారణమా.. నగరంలో రియల్టర్‌గా పలు కన్స్ట్రక్షన్స్ చేస్తున్న కాట్రగడ్డ శ్రీకాంత్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడేంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగ్గొట్టి పరారయ్యారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోట్లాది రూపాయల నష్టం ఎందుకు వాటిల్లింది అనే విషయాలపై కూడా కూపీ లాటుతున్నారు. శోక సంద్రంలో కుటుంబీకులు.. గుడికని చెప్పి వెళ్లిన శ్రీకాంత్ విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన కుటుంబం రోడ్డున పడిందంటూ మృతుడి భార్య బోరుమని విలపించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
దావత్ తర్వాత ధనాధన్!
► పిస్టల్‌తో అర్ధరాత్రి గాల్లోకి కాల్చిన రియల్టర్ ► హైదరాబాద్ నార్సింగి ఠాణా పరిధిలో జరిగిన ఉదంతం హైదరాబాద్: రాజధానిలో మరోసారి తుపాకీ పేలింది. రిసార్ట్స్‌లో జరిగిన దావత్లో పాల్గొన్న రియల్టర్ అది ముగిసిన తర్వాత తన లైసెన్డ్ పిస్టల్‌కు పని చెప్పాడు. మద్యం మత్తులో అకారణంగా కాల్చడంతో రెండు రౌండ్లు గాల్లోకి దూసుకుపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. నిందితుడిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. గండిపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ విజేత భర్త ప్రశాంత్‌యాదవ్ సోమవారం రాత్రి గోల్కొండ రిసార్ట్స్‌లో స్నేహితులకు విందు ఏర్పాటు చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులైన నార్సింగి మాజీ సర్పంచ్ వెంకటేష్‌యాదవ్, పుప్పాలగూడకు చెందిన ప్రభాకర్, మణికొండకు చెందిన బి.అజయ్, బి.శ్రీనివాస్, ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని ఆహ్వానించారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ప్రభాకర్ కొన్ని రోజుల క్రితం పుప్పాలగూడ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నారు. ఈయన వద్ద కోదాడ పోలీస్ స్టేషన్ నుంచి 2014లో తీసుకున్న లైసెన్స్‌తో ఖరీదు చేసిన 32 క్యాలిబర్ పిస్టల్ ఉంది. వీరంతా కలిసి రాత్రి 11.30 వరకు రిసార్ట్స్‌లోనే గడిపారు. ఆపై రెండు కార్లలో ఇళ్లకు బయలుదేరారు. ప్రశాంత్‌యాదవ్ ఇంటి వద్దకు రాగానే అందరూ దిగి కొద్దిసేపు ఓ విషయమై చర్చించుకున్నారు. మిగిలిన వారు వెళ్లిపోగా... ప్రభాకర్‌తో పాటు మరో స్నేహితుడు అక్కడ మిగిలారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ తన పిస్టల్ తీసి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అంతా అక్కడ నుంచి జారుకోగా... కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విందులో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. మంగళవారం ప్రభాకర్ వద్ద నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయుధ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కళ్ల ముందే ఓ సహచరుడు కాల్పులు జరిపినా... ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయని మరొకరిపైనా కేసు నమోదు చేశారు. -
దొంగచాటుగా వీడియో తీసి..
విజయవాడ (మధురానగర్): ఓ మహిళను దొంగచాటుగా వీడియో తీసి లోబర్చుకోవడమే కాకుండా ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తున్న రియల్టర్ ఘటన ఇది. సింగ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన టీడీపీ సానుభూతిపరుడు. రామలింగేశ్వరపేటకు చెందిన ఓ మహిళ.. భర్తతో మనస్పర్థల కారణంగా తల్లిదండ్రులతో కలసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే మండవ రవికాంత్ కుటుంబసభ్యులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె రవికాంత్‌కు ఆరు లక్షల రూపాయలు అప్పుగా కూడా ఇచ్చింది. రవికాంత్ భార్య ఆ మహిళ ఫొటోలు, వీడియోలు తీసి భర్తకు అందజేసేది. ఆ వీడియోలను చూపించి అతను మహిళను లోబరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని వేధింపులు భరించలేక సదరు మహిళ హైదరాబాద్ వెళ్లిపోయింది. అయినా వదలకుండా ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తిరిగి విజయవాడ చేరుకుని సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవికాంత్‌పై 420, 342, 354ఏ, 354సీ, 324, 376, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఏసీపీ సత్యానందం రవికాంత్‌ను అరెస్టు చేశారు. మహిళను లోబరుచుకోవడమే కాకుండా ఆమె ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించని అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రవికాంత్ అధికార పార్టీ కార్యకర్తగా చెలామణి అవుతున్నాడు. -
నడి రోడ్డుపై పొడిచి చంపారు
-
నడి రోడ్డుపై పొడిచి చంపారు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బేగంపేటలో ఓ వ్యక్తిని నడి రోడ్డుపై నరికి చంపేశారు. రియాజ్ అనే రియల్టర్ ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. స్థల వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రియల్టర్ దారుణ హత్య
హైదరాబాద్ సిటీ: ఫలక్‌నూమా పరిధిలోని అచ్చిరెడ్డినగర్‌లో అఫ్రోజ్ అనే రియల్టర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫలక్‌నూమా పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భూ వివాదంలో లాయర్లు, రియల్టర్ అరెస్టు
గుంటూరు క్రైం: భూమి వ్యవహారంలో గుంటూరు జిల్లా పోలీసులు ఇద్దరు లాయర్లు సహా ఒక రియల్టర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు...నగరంలోని శ్యామలానగర్‌లోని భూమి విషయమై 2007 సంవత్సరం నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. భూమికి సంబంధించిన పత్రాలను దొంగతనం చేసి, వాటిని మార్చి తమను మోసగించారంటూ వి.వెంకట నరసమ్మ, జె.మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు అర్బన్ ఏఎస్పీ జె.భాస్కర్‌రావు విచారణ చేపట్టారు. విచారణలో వెల్లడైన ఆధారాల ఆధారంగా ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళలను 15 రోజుల క్రితం అరెస్టు చేశారు. తాజాగా ఈ వ్యవహారంతో సంబంధమున్న న్యాయవాదులు లక్ష్మణ్‌కుమార్, డి.శ్రీనివాసరావుతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు. -
పది లక్షలిచ్చినా.. వదలి పెట్టలేదు!