వారిద్దరిపై బలవంతపు చర్యలొద్దు.. | High Court Orders To Police Real Estate Sridhar Case In Hyderabad | Sakshi
Sakshi News home page

వారిద్దరిపై బలవంతపు చర్యలొద్దు..

Published Thu, Nov 18 2021 10:08 AM | Last Updated on Thu, Nov 18 2021 10:08 AM

High Court Orders To Police Real Estate Sridhar Case In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రియల్టర్‌ శ్రీధర్‌రావు, ఆయన భార్య సంధ్యలపై అరెస్టు లాంటి బలవంతమైన చర్యలు చేపట్టరాదని హైకోర్టు నార్సింగి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

నార్సింగి పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వీరిద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement