సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది.
అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌లోని కీలక అంశాలు ఇవే..
‘నాకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 161 సీఆర్సీసీ కింద సీబీఐ అధికారులు నా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్‌తో కుమ్మకయ్యారు. ఈ కేసులో కుట్ర పన్ని నన్ను ఇరికిస్తున్నారు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతోంది.
దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ తన వద్ద ఉంచుకుంది. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఈ కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సీబీఐ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నేను నిందితుడిగా లేను. 2021 సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నన్ను అనుమానితుడిగా చేర్చారు. నాపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా పాలుపంచుకుంటున్నాడని సునీత కక్ష గట్టింది. వివేకా కుమార్తె సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారు.
సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయి. వివేకా రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సీటు ఇప్పిస్తామని వివేకా హామీ ఇచ్చారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్‌చేశారు. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారు. వివేకా హత్యలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment