
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫుల్ ఫైరయ్యారు. చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని గుర్తు చేశారు.
కాగా, మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు. వాలంటీర్ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడిపై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు?.
రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్. బాబు వస్తే జాబ్ అంటూ గతంలో మోసం చేశావు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదు. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్ అండగా నిలిచారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. 3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేయగలిగినవే చెప్పారు.. చేసి చూపించారు. చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ చెప్పారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు జడ్డీ చేసిన వ్యాఖ్యలు అందరూ గమనించాలి. తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని జడ్జి చెప్పారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’
Comments
Please login to add a commentAdd a comment