TDP manifesto
-
ఎన్నికలకు ముందు బాబు షూరిటీ.. ఎన్నికల తరువాత మోసం గ్యారెంటీ
-
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్‌కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్‌కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
AP: మద్యం మాఫియా వీరంగం
సాక్షి నెట్వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ తమ చేతుల్లోనే ఉండాలని అధికార కూటమి పార్టీల నేతలు హుకుం జారీ చేస్తున్నారు. తమకు ఉచితంగా 20 శాతం వాటా ఇవ్వాలని, లేదా లాభాల్లో 30–35 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తెగేసి చెబుతున్నారు. ఇందుకు కాదు.. కూడదన్న చోట విధ్వంసం సృష్టిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మద్యం మాఫియా రెచి్చపోయింది. తమ సిండికేట్‌లో చేరలేదన్న కారణంతో ధర్మవరం పట్టణ వైఎస్సార్సీపీ నాయకుడు బాలిరెడ్డికి చెందిన మద్యం దుకాణాన్ని కూటమి పారీ్టల నాయకులు, కార్యకర్తలు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.రాత్రి మద్యం స్టాక్‌ను షాపులో దించుకుని తాళం వేసుకుని వెళ్లిపోయాడు. తమ సిండికేట్‌లో చేరాలని అప్పటికే కూటమి పార్టీల నాయకులు బాలిరెడ్డిని బెదిరించారు. అధిక ధరలకు మద్యం విక్రయించే ప్రశ్నే లేదని, సిండికేట్‌లో చేరబోమని ఆయన తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు అర్ధరాత్రి.. దుకాణం తాళాలు పగలగొట్టి.. లోపల నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను, కంప్యూటర్, ఫరీ్నచర్‌ను ఇనుప రాడ్లతో ధ్వంసం చేశారు. మరికొన్ని మద్యం కేస్‌లను తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై బాలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులంతా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులని తెలిసింది.తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూటమి నేతల బెదిరింపులు.. షాపులు దక్కించుకున్న వారికి స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోవటంతో కేవలం 127 షాపులు మాత్రమే బుధవారం ప్రారంభానికి నోచుకున్నాయి. 204 దుకాణాలు ప్రారంభం కాలేదు. పలమనేరు, పూతలపట్టు, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి పరిధిలో టీడీపీ, జనసేన నేతల అరాచకాల కారణంగా షాపులు దక్కించుకున్న వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ‘మేము అడిగినంత వాటా ఇవ్వాల్సిందే. కాదూ కూడదు అంటే.. జరిగే నష్టానికి మాకు సంబంధం ఉండదని’ అని కూటమి నాయకులు హుకుం జారీ చేశారు. అప్పుడే ‘బెల్ట్’ దందా టీడీపీ మద్యం మాఫియా తొలి రోజే రాష్ట్రంలో బెల్ట్ దుకాణాల దందాకు తెరతీసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాలు బుధవారం తెరచుకోగానే.. వాటికి అనుబంధంగా బెల్డ్ దుకాణాలకు తలుపులు బార్లా తీశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ దుకాణాలు వెనువెంటనే ఏర్పాటు చేయడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం మద్యం దుకాణాలతోపాటే పలు చోట్ల బెల్ట్ దుకాణాల్లో అమ్మకాలు మొదలు పెట్టడం గమనార్హం.విజయవాడ తొమ్మిదో డివిజన్లోని చేపల మారెŠక్ట్ ప్రాంతంలో బుధవారం ఉదయమే ఓ బెల్ట్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. విపరీతమైన రద్దీతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ బెల్డ్ దుకాణాన్ని తాత్కాలికంగా మూయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇదే రీతిలో బెల్ట్ దుకాణాల దందా జోరందుకుంది. సర్కారుపై జనం కన్నెర్రపలు చోట్ల గుడి, బడి, గృహాల మధ్యే దుకాణాలు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానికుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గుడి, బడి, గృహాల మధ్యే దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం పట్ల స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం ఎక్కడికక్కడ దుకాణాల ఏర్పాటును మహిళలు, విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉంటున్న తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని, తమ మాట కాదని ఏర్పాటు చేస్తే అందరం ఆత్మహత్యలు చేసుకుంటామని చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట ఆది ఆంద్రవాడ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు. బుధవారం ‘వద్దు వద్దు.. వైన్‌షాపు వద్దు’ అంటూ జోరువానలో నిరసనకు దిగారు. తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో, బాపట్లలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాత గుంటూరు మణి హోటల్ సెంటర్లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తమ విద్యా సంస్థ వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ బుధవారం విద్యార్థులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నివాసానికి చేరుకుని విద్యా సంస్థ పక్కన మద్యం షాపు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, ఆచంట మండలం వల్లూరులో, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం రోడ్డులోని వినాయక స్వామి గుడి వద్ద స్థానికులు, రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ⇒ ఇళ్ల మద్య దుకాణం వద్దంటూ చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో స్థానికులు నిరసన తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కొలుకుల రోడ్డులో, కృష్ణా జిల్లా ఘంటసాల సత్రం సెంటర్లో, గన్నవరంలోని కోనాయి చెరువు సమీపంలోని శ్రీ కాశీ విశాలాక్షి ఆలయం వద్ద, ఎనీ్టఆర్ జిల్లా వెల్వడం–చిననందిగామ రహదారిలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను మహిళలు అడ్డుకున్నారు. ⇒ కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయం పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని స్థానిక మహిళలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథికి, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. హొళగుందలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ⇒ విశాఖలోని 8వ వార్డు ఎండాడ దరి సుభా‹Ùనగర్, మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ సమీపంలోని వికలాంగుల కాలనీలో నివాసాల చెంత వైన్ షాపు ఏర్పాటు సహించబోమంటూ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి.. ఆ పక్కనే నిరి్మంచిన ఇంటిని వైన్ షాపు కోసం అద్దెకు ఇచ్చారంటూ ఆక్షేపించారు. – సాక్షి నెట్వర్క్ -
సూపర్ సిక్స్ కొట్టబోయి చంద్రబాబు డకౌట్
-
హామీలు అమలు చేయలేం.. నన్ను క్షమించండి
-
పింఛన్ హామీ తప్పెన్
దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం. – జూన్ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు. ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు. దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు. -
చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి
-
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్
-
పక్క పార్టీల పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు..!
-
చంద్రబాబుకు బ్యాడ్ టైమ్..
-
చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్.. బిగ్ జోక్ అంటూ..
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫుల్ ఫైరయ్యారు. చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని గుర్తు చేశారు. కాగా, మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు. వాలంటీర్ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడిపై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు?. రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్. బాబు వస్తే జాబ్ అంటూ గతంలో మోసం చేశావు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదు. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్ అండగా నిలిచారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. 3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేయగలిగినవే చెప్పారు.. చేసి చూపించారు. చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ చెప్పారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు జడ్డీ చేసిన వ్యాఖ్యలు అందరూ గమనించాలి. తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని జడ్జి చెప్పారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’ -
ఆయనకసలు మేనిఫెస్టోకున్న పవిత్రత తెలుసా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఒక మినీ మానిఫెస్టోని ప్రకటించారు. అందులో కొన్ని చిత్రమైన సంగతులు ఉన్నాయి. పరస్పర వైరుధ్య విషయాలు ఉన్నాయి. ఇతర పార్టీలను కాపీ కొట్టిన వైనం ఇట్టే తెలిసిపోతుంది. అందులోనూ వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అమలు చేస్తున్న స్కీములను, అలాగే, ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొన్ని స్కీములను కాపీకొట్టిన విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సీఎం జగన్‌ను ద్వేషిస్తూనే ఆయన స్కీములను తాము కూడా అమలు చేస్తామని చంద్రబాబు పరోక్షంగా చెప్పడంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందని ఒప్పుకున్నట్టు అయ్యింది. ఎన్నికల ప్రణాళిక ఏడాది ముందుగా ప్రకటించడం తప్పుకాదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రయత్నాలు తాను చేసుకుంటుంది. కానీ, ఆ ప్రణాళికకు ఒక పవిత్రత ఉందని, దానిని భగద్గీత మాదిరి అమలు చేస్తామని చెప్పే ధైర్యం ఉండాలి. గతంలో తమ పార్టీ ఇచ్చిన మానిఫెస్టోల గురించి చెప్పి, వాటిలో ఎన్ని అమలు చేశాం, ఎన్ని చేయలేదు? దానికి కారణాలు ఏమిటి? అన్నవాటి గురించి చెప్పగలగాలి. ఏదో ప్రజల చెవిలో పూలు పెట్టవచ్చులే అన్నట్లుగా ఎన్నికల ప్రణాళికలను ప్రకటించి, అధికారంలోకి వచ్చాక వాటిని చెత్తబుట్టలో గిరాటేసినట్లు వెబ్ సైట్ నుంచి తొలగించవచ్చనుకుంటే ఆ రోజులు పోయాయని చెప్పాలి. ఇప్పుడు ప్రతిదీ రికార్డు అవుతోంది. క్షణాలలో అసలు నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రకటించిన ప్రణాళికలోని అంశాల గురించి చూద్దాం. అందులో ఒక కీలకమైన విషయం ఏమిటంటే పేదలందరిని ధనికులుగా చేస్తామని.. దానికేదో ఫోర్ పీ అని పేరు పెట్టారు. అది వారి ఇష్టం. ఇక్కడ వచ్చే సందేహం ఏమిటంటే అందరిని ధనికులు చేసేస్తామని ప్రకటించిన తర్వాత సంబంధిత స్కీము ఏదో అమలు చేస్తే సరిపోయేదానికి మళ్లీ పలు ఇతర హామీలను ఎందుకు ఇస్తున్నట్లు?. ఇక్కడే ఒకదానికి మరొకదానికి పొంతన కనిపించడం లేదు. ఒకవైపు మహిళలు, యువకులు, రైతులకు పలు తాయిలాలను ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మరో వైపు అసలు పేదలే లేకుండా అందరిని ధనికులను చేసే మంత్రం ఏదో తమ వద్ద ఉందని అంటున్నారు. వీటిలో ఏది నమ్మాలి?. గత కొద్ది రోజులుగా పేదలను కోటీశ్వరులను చేస్తానని అనేవారు.. దానిని మార్చి ధనికులు అన్న పదం వాడినట్లు ఉన్నారు. అది ఎలా సాధ్యమో చెప్పలేకపోయారు. కానీ, ఒక బలహీన వాదన పెట్టారు. ధనికులుగా ఉన్నవారు పేదలను దత్తత తీసుకోవాలట. దాంతో పేదలు ధనికులైపోతారట. గతంలో కనుక మీరంతా ఇటుకలు ఇవ్వండి.. రాజధాని కడతా అన్నట్లుగా ఉంది. ఎన్నికల తర్వాత నిజంగానే అధికారం వస్తే అప్పుడు ఏమి చెప్పవచ్చు. ఎవరూ పేదలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి తానేం చేయను అంటూ ప్రజలను బురిడి కొట్టించవచ్చన్నమాట. ఇతర వాగ్దానాలను పరిశీలిద్దాం. బడికి వెళ్లే పిల్లలకు ఏడాదికి పదిహేనువేల చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అంటే సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్న అమ్మ ఒడి స్కీమ్‌ను కాపీ కొట్టడం అన్నమాట. ఇంతకాలం అమ్మ ఒడి, నాన్న బుడ్డి అంటూ అవహేళన చేసిన చంద్రబాబు ఏ ముఖంతో దానిని ప్రకటిస్తారని అడిగితే సమాధానం దొరుకుతుందా?. అయితే, సీఎం జగన్ ప్రతి కుటుంబంలో చదువకునే ఒక్కరికే దీనిని ఇస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నా, ఎంతమంది ఉన్నా అమలు చేస్తానని తెలియచేశారు. అది నిజంగా సాధ్యం అవుతుందా?. సీఎం జగన్ ఈ స్కీమ్‌కు ఏడాదికి సుమారు 6500 కోట్లు ఖర్చు చేస్తుంటే, చంద్రబాబు డబుల్, త్రిబుల్ ఖర్చు చేయాలన్నమాట. అసలు ఏ స్కీమ్‌కు ఎంత వ్యయం అవుతుందో చంద్రబాబు వంటి సీనియర్ చెప్పాలి కదా!. ఊరికే ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా!. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లనుంచి 59 ఏళ్లవరకు ఉన్న మహిళలందరికి నెలకు 1500 రూపాయలు ఇస్తారట. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాగ్దానమే చేసింది. అక్కడ వాళ్లు రెండువేల రూపాయలు ఇస్తామని అన్నారు. దానిని చంద్రబాబు కాపీ కొట్టారు. ఏడాదికి 18 వేల రూపాయలు ఇస్తామని ఆయన తెలియచేశారు. ఈ స్కీమ్ అమలు చేయాలంటే 36 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని బీజేపీ నేత ఒకరు లెక్కగట్టారు. నిజానికి సీఎం జగన్ బలహీనవర్గాలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల మహిళలు స్వయం ఉపాధి నిమిత్తం ఏడాదికి 10వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అది వారికి కొంత ఉపయుక్తంగా ఉంటోంది. వివిధ కార్పొరేట్ సంస్థలతో టై అప్ చేసి వారి వ్యాపారాలకు, తయారుచేసే ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సహకరిస్తున్నారు. చంద్రబాబు అలాకాకుండా నెలనెలా 1500 ఇస్తామంటున్నారు.అది ఎటూ కాకుండా పోతుందన్నమాట. పైగా అందరికి ఇస్తామన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అలా ఇవ్వాలంటే ఎన్నివేల కోట్లు అవసరమో చెప్పరు. అధికారం వస్తే అర్హులు అన్న పదం వాడి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారన్నమాట. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీని ఆయన వెల్లడించారు. దీన్ని కర్నాటకలో బీజేపీ మేనిఫెస్టో నుంచి తీసుకున్నారు. ఆయన గతంలో దీపం పథకం పెట్టారట. దానిని జగన్ ఆర్పేశారట. ఇంతకన్నా నీచపు ఆరోపణ ఉంటుందా? ఆ స్కీమ్ వచ్చినప్పుడు సీఎం జగన్ రాజకీయాలలోనే లేరు. సిలిండర్ల ధర 1200కి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వ సంస్థలైతే, ప్రధాని మోదీని అనే దమ్ము లేక, ఇలా సందర్భం లేకుండా సీఎం జగన్‌పై మాట్లాడటం ఆయనకే చెల్లింది. నిజానికి దీపం పథకం అన్నది వాజ్ పేయ్ ప్రభుత్వం నుంచి వచ్చింది. దేనినైనా తన ఖాతాలో వేసుకోగల నేర్పరి కనుక తనదే ఆ స్కీమ్ అంటున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఫ్రీ అట. ఢిల్లీలో ఆప్ ఈ స్కీమ్‌ను పెట్టింది. దానిని కర్నాటక కాంగ్రెస్ కాపీ కొడితే, దీనిని చంద్రబాబు కాపీ కొట్టారన్నమాట. ఢిల్లీ అంటే ఒకే నగరం కనుక కొంత సాధ్యపడవచ్చు. కానీ, కర్నాటక, ఏపీలో అలా ఫ్రీ ట్రావెల్ ఇస్తామని అంటే ఆర్టీసీ పరిస్థితి ఏమవుతుంది. ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? ఎంత అని ఇస్తుంది. ఇది ఒక ఫాల్స్‌గా మారే అవకాశమే కనిపిస్తుంది. కర్నాటకలో ఈ స్కీమ్ అమలులో అనేక షరతులు పెట్టేశారు. దానిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కుటుంబ నియంత్రణ కూడా చంద్రబాబే కనిపెట్టారట. ఎప్పుడో 1960, 1970 దశకాల్లో కేంద్రం ఆరంభిస్తే, అది తానే ప్రోత్సహించానని, అది తప్పు అయిందని చంద్రబాబు అంటున్నారు. ఊళ్లో వాళ్లందరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతున్న ఆయన తన కుమారుడికి కూడా చెప్పారో? లేదో?. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించేస్తారట. ఈలోగా ప్రతి యువకుడికి మూడువేల రూపాయల భృతి ఇస్తారట. 2014 మేనిఫెస్టోలో కూడా ఈ వాగ్దానం చేసి ఎందుకు అమలు చేయలేదు?. ఇప్పుడు చేస్తామంటే ఎవరైనా విశ్వసిస్తారా?. రైతులకు ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తామని మరో హామీ ఇస్తున్నారు. గతంలో 89 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి 15 వేల కోట్లు కూడా చేయలేని పరిస్థితిపై ఎందుకు వివరణ ఇవ్వరు?. పైగా రుణమాఫీ చేసేశామని అసత్య ప్రచారం చేసుకుంటుంటారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తామని అంటున్నారు. అంటే దాని అర్ధం తాను అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో ఆ పని చేయలేకపోయానని, వైఫల్యం అని ఒప్పుకున్నట్లే కదా!. బీసీలకు రక్షణ చట్టం అని మరొకటి చెప్పారు. చిత్రం ఏమిటంటే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని వాదించిన తెలుగుదేశం అధినేత ఇప్పుడు కులాల గురించి, మతాల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చెప్పుతో కొట్టాలని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను,కొందరు పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ఎన్నిసార్లు మత ప్రస్తావన చేశారో చంద్రబాబుకు గుర్తు లేదేమో!. తొలి మేనిఫెస్టో ఈ విధంగా పరస్పర విరుద్దంగా, ప్రజలను మోసం చేయడం ఎలా అన్న దిశగా సాగినట్లు ఉంది తప్ప చిత్తశుద్దితో లేదు. ఇంతకాలం జగన్ సంక్షేమ స్కీములతో రాష్ట్రం నాశనం అయిపోయిందని, శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టవీ5 వంటి మీడియాకు ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ హామీలు వేయి స్వరాల వీణల్లా వినిపిస్తున్నాయేమో. జగన్ బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించిన చంద్రబాబు తాను అంతకంటే ఎక్కువ నొక్కుతానని అంటున్నారు. ఎల్లో మీడియా ఇంతకాలం అబద్దాలు ప్రచారం చేసిందని చంద్రబాబు ఇచ్చిన హామీలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం జగన్‌ను రాష్ట్ర మహిళలు ఆదరిస్తున్నారని, మరోసారి పట్టంకట్టబోతున్నారని అర్ధం చేసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అదే రాగం అలపించడానికి యత్నిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్నవాటి కోసం మళ్లీ చంద్రబాబును నమ్మి మోసపోవడం ఎందుకు అని జనం అనుకోరా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
మేనిఫెస్టో తిప్పలు
-
చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్..
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైరయ్యారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని కాకాణి అన్నారు. కాగా, మంత్రా కాకాణి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను మేము భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాము. టీడీపీ నేతలు మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు హయం అంతా కరువుకాటకాలే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను వీధిలోకి లాగిన వ్యక్తి చంద్రబాబు. తన పబ్లిసిటీ కోసం 8 మందిని బలితీసుకున్నారు. కందుకూరు ఘటనలో బాబు నిర్వాకంపై బీబీసీ న్యూస్‌లో చెప్పారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. అసలు రాజ్యాంగంపై చంద్రబాబుకు నమ్మకం ఉందా?. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధికారమే పరమావధిగా టీడీపీ హామీలు
పాలకోడేరు: అధికారమే పరమావధిగా టీడీపీ ఎన్నికల హామి ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి బి.బలరాంతో కలిసి మండలంలో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎంపీగా నాగబాబును కూడా గెలిపించాలని కోరారు. శృంగవృక్షం, గొరగనమూడి, పెన్నాడ, విస్సాకోడేరు, కుముదవల్లి, పాలకోడేరు, మోగల్లు మీదుగా రోడ్ షో నిర్వహించారు. గాధం నానాజీ, రవిచంద్ర, పి.బ్రహ్మానందం, పి.ప్రతాప్‌రాజు, జక్కంశెట్టి సత్యనారాయణ, జె.హరిషా దుర్గ, చేబోలు సత్యనారాయణ, పాలా వెంకటస్వామి పాల్గొన్నారు. కాపు సోదరులంతా వైఎస్సార్ సీపీ వైపే ఉండాలి వీరవాసరం: కాపు సోదరులంతా వైఎస్సార్సీపీ వైపే ఖచ్చితంగా ఉండాలని వైఎస్సార్ కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సవరం కిశోర్ కోరారు. వీరవాసరం మండలం దూసనపూడిలో సోమవారం వైఎస్సార్ కాపు సేన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల కోసం కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కాపు సంఘీయులంతా జగనన్నకు మద్దతు ప్రకటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలపించాలని కోరారు. భీమరంలో గ్రంధి శ్రీనివాస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సవరం బాలకృపావరం, తానం పాపారావు, ఓడూరి గణపతి, చిన నారాయణరావు, ఓడూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో టీడీపీ మేనిఫెస్టో విడుదల
-
టీడీపీ మేనిఫెస్టో ఆలస్యం.. అందుకేనా?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను విడుదల చేసే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దోబూచులాడుతున్నారు. ముసాయిదా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనా విడుదల చేయకుండా నాలుగు రోజుల నుంచి వాయిదా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని చూసుకుని మార్పులు చేసి తమ మేనిఫెస్టోను విడుదల చేయాలని చూస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. అంటే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను కాపీ కొట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. యనమల రామకృష్ణుడు అధ్యక్షతన నెల రోజులక్రితం చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టో కమిటీని నియమించారు. మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు పెట్టాలో యనమల నిర్ణయించి.. దానిని మళ్లీ చంద్రబాబు సూచనల ప్రకారం మార్పులు చేసి 74 పేజీలతో ముసాయిదాను సిద్ధం చేశారు. 4 రోజుల క్రితమే దాన్ని బాబు విడుదల చేస్తారని టీడీపీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేసేవరకూ తమ మేనిఫెస్టో విడుదల చేయకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే హామీలు, అంశాలుంటే నష్టపోతామని, కాబట్టి అది వచ్చాక దాన్నిబట్టి తమ మేనిఫెస్టోలో మార్పులు చేశాకే విడుదల చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టడం తెలిసిందే. వృద్ధాప్య ఫించన్‌ను రూ. 2 వేలు చేస్తామని జగన్ ప్రకటిస్తే దాన్ని ఎన్నికలకు 3 నెలలు ముందుగా హడావుడిగా అమలులోకి తెచ్చారు. రైతు భరోసా, ప్రతి కులానికి కార్పొరేషన్, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాపీ కొట్టారు. తాజాగా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అధికారంలోకి రాగానే కేంద్రానికి లేఖ రాస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినట్లు లీకులివ్వడం గమనార్హం. కాగా పార్టీ వైఖరి ప్రకారం రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేయకుండా ప్రత్యర్థి మేనిఫెస్టో కోసం ఎదురు చూడడమేంటని టీడీపీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
13 సీట్లు.. రూ.లక్ష కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.లక్ష కోట్లు.. మన రాష్ట్ర బడ్జెట్‌కు అదనంగా అక్షరాలా మరో లక్ష కోట్ల రూపాయలన్నమాట. ఏంటీ లక్ష కోట్ల కథ అనుకుంటున్నారా?. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు పార్టీ టీడీపీ పక్షాన ఈ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే కావాల్సిన నిధుల లెక్క ఇది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులకు పెట్టాల్సిన ఖర్చు, ప్రభుత్వ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులు పోను రూ.లక్ష కోట్లను ఎక్కడి నుంచి తెస్తాం.. అనే అంచనా కూడా లేకుండా టీడీపీ మేనిఫెస్టోలో ఎడాపెడా హామీలిచ్చేశారు పచ్చ పార్టీ నేతలు. ఇన్ని హామీలిచ్చి, ఇంత డబ్బు ఖర్చు చేస్తామని చెప్పిన ఈ పార్టీ పోటీచేస్తున్న స్థానాలెన్నో తెలుసా... 13 మాత్రమే. 13 స్థానాల్లో పోటీచేసి ఏకంగా లక్ష కోట్లకు టెండర్ పెట్టిన తెలంగాణ టీడీపీ.. ప్రజలకు హామీలు ఇచ్చి మాట తప్పడం వెన్నతో పెట్టిన విద్యగా పేరున్న తమ అధినేత చంద్రబాబు బాటలోనే నడుస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఎడాపెడా హామీలు... టీడీపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అమలు సాధ్యమా? కాదా? అనే అంశాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా హామీలిచ్చినట్లు అర్థమవుతోంది. ఆ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీకే రూ.50 వేల కోట్లు అవసరం. రాష్ట్రంలోని 54.5 లక్షల మంది రైతులకు సంబంధించి 2018–19 సంవత్సరానికి గాను ఖరీఫ్‌లో రూ.30 వేల కోట్లు, రబీలో రూ.19 వేల కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది అంతుపట్టని పరిస్థితి. మిగిలిన ప్రధాన హామీల్లో ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లు, విద్యారంగానికి అదనంగా రూ.5 వేల కోట్ల కేటాయింపు, గర్భిణులకు పౌష్టికాహారం, వైద్య సాయం కోసం రూ.15 వేలు, వైద్య రంగానికి అదనంగా మరో రూ.10 వేల కోట్లు కలిపితే అది భారీ మొత్తం కానుంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, కుటుంబంలోని ప్రతి మనిషికి నెలకు 7 కిలోల చొప్పున కిలో రూపాయి బియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, వివాహ సాయం కింద రూ.1.5 లక్షలు, ధరల స్థిరీకరణ కోసం రూ.10 వేల కోట్లు కలిపితే రూ.లక్ష కోట్లు దాటనుంది. ఇదంతా రాష్ట్ర బడ్జెట్లో సాధారణంగా అయ్యే ఖర్చు కన్నా అదనంగా పెట్టాల్సిందేనని, మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు ఆలోచించాలని, లేదంటే ఈ లక్ష కోట్లకు ఆదాయపు లెక్కలను కూడా చూపించాల్సి ఉందని ఓ ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రలో ‘టోపీ’... ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఓటర్లను ఆకట్టుకుని ఆ తర్వాత టోపీ పెట్టడం బాబుకు అలవాటేనని చరిత్ర చెబుతోంది. 2014 ఎన్నికల సందర్భంగా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన తుంగలో తొక్కారు. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ ప్రజలకు సుమారు 600 హామీలిచ్చారు చంద్రబాబు. అందులో మెజార్టీ హామీలు నెరవేరనే లేదు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ (ఇన్సెంటివ్ ఇచ్చాడు), అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మిస్తానని అమలు చేయలేకపోయారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎన్నికలకు ఐదారు నెలల ముందు అమలు చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ఇంటింటికీ మంచినీరు, బీసీ కులాలను ఒక గ్రూపు నుంచి మరో గ్రూపునకు మారుస్తానని, కొన్ని బీసీ కులాలను ఎస్సీల్లో, కొందరిని ఎస్టీల్లో చేరుస్తానని, కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తానని, ఇంటింటికీ ఉద్యోగం, బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న మహిళల బంగారం ఇంటికి తెప్పిస్తానని, పోలవరంతో సహా అనేక ప్రాజెక్టులు పూర్తిచేస్తానని కాలపరిమితితో కూడిన హామీ ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు... తెలంగాణలో కూడా ఓటర్లను మభ్యపెట్టేందుకు పలు హామీలను మేనిఫెస్టోలో పెట్టడం గమనార్హం. -
పథకాలు ‘డొల్ల’..
సాక్షి, అమరావతి: శిక్షణ ద్వారా యువతకు భారీఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. లక్షల్లో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ప్రభుత్వం ఎంతో ఘనంగా చేస్తున్న ప్రచారం అంతా ఉత్తి డొల్ల తప్ప అందులో ఏమాత్రం వాస్తవంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేటతెల్లమైంది. అలాగే, రాష్ట్రంలో అన్ని జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించేశామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని కూడా తేలింది. అంతేకాదు.. మహిళలపై నేరాలు ఏటేటా పెరిగిపోతున్నాయని సర్కారు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. (నిరుద్యోగులకు రిక్తహస్తం) ఈ సందర్భంగా ప్రణాళికా శాఖ రూపొందించిన నివేదికలో 17 ప్రభుత్వ పథకాల అమలులో ప్రచార ఆర్భాటం తప్ప మరేంలేదని స్పష్టమైంది. యువతకు శిక్షణ పేరుతో కోట్ల రూపాయల కమీషన్లు ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు కట్టబెడుతున్నారని.. కానీ, అలా శిక్షణ పొందిన వారికి ఉద్యోగాల కల్పన అంతంతమాత్రంగానే ఉందని ప్రణాళిక శాఖ తన నివేదికలో వివరించింది. 1,21,280 మందికి శిక్షణ పేరుతో ఆయా సంస్థలకు రూ.145.53 కోట్లు చెల్లించేశారు. అయితే, ఇందులో ఉపాధి చూపించింది కేవలం 15,237 మంది కేనని, ఇది కేవలం 21.54 శాతమేనని నివేదికలో పేర్కొన్నారు. ఆదరణ పేరుతో హడావిడి చేసిన సీఎం చంద్రబాబు ఆచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. డి–కేటగిరిలో 0 నుంచి 40 శాతం అమలు పథకాలను చేర్చారు. ఈ కేటగిరిలో 17 పథకాలున్నాయి. దీంతో పాటు యునిసెఫ్ నిర్వహించిన సర్వేలో 93 శాతం హౌస్ హోల్డ్స్కు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. వీరిందరూ బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. మరోవైపు.. బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలు 12,918కు గాను 1,505 పంచాయతీల్లో.. 110 మున్సిపాల్టీలకు గాను 15 మున్సిపాల్టీల్లో మాత్రమే లక్ష్యం సాధించినట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. అంటే ఇన్ని రోజులు ఉపాధి హామీ నిధులతో వేల కోట్ల రూపాయలను వ్యయంచేస్తూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేశామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నదంతా బూటకమని తేలిపోయింది. అలాగే, అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలుగా చేస్తున్నామని చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవంలేదని ప్రణాళికా శాఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఏ ఏటికాయేడు పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలేదని కూడా ఆ నివేదిక తేల్చిచెప్పింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 8,855 మంది మహిళలపై నేరాలు జరగ్గా ఈ ఏడాది అదే కాలంలో 9,221 మహిళలపై నేరాలు జరగడం గమనార్హం. అత్యధికంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ తరువాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. (నీటి మీద రాతలు.. టీడీపీ హామీలు) ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల్లోనూ అంతే.. అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి జాగాలు ఇచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలూ బూటకమేనని ప్రణాళికా శాఖ నివేదిక తేల్చిచెప్పింది. అర్హులందరికీ ఇవన్నీ ఇచ్చేస్తే దాదాపు కోటి మంది పేదలు ఇంకా దరఖాస్తులు ఎందుకు చేసుకున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం పది శాఖలకు చెందిన పథకాల కోసం ఏకంగా 99,08,297 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. రేషన్ కార్డులుగానీ, పింఛన్లుగానీ అర్హులైన వారందరికీ ఇవ్వకుండా ఖాళీ అయిన చోటే కొత్తవారికి మంజూరు చేస్తున్నారు. దీంతో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇళ్తు, ఇంటి జాగా, పెన్షన్లు, రేషన్ కార్డులు, మంచినీటి సరఫరా, రహదారులు, వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఏకంగా 99,08,297 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ఏకంగా 32,11,595 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరో 20.81 లక్షల మందికి మంజూరు చేయాలని తేల్చి వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరోవైపు.. ఆర్టీజీఎస్ పేరుతో రకరకాల ఆంక్షలు విధించి పేదలకు పథకాలు అందకుండా వారిపై అనర్హుల పేరుతో వేటువేస్తున్నారు. ప్రాసెస్ చేయలేదని, మ్యాప్ కావడం లేదంటూ మరికొన్ని లక్షల దరఖాస్తులను మూలన పడేస్తున్నారు. -
ముస్లిం యువకుల అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్
-
మేనిఫెస్టోలో పెట్టినవి అడిగితే.. అరెస్ట్‌లు చేస్తారా?
సాక్షి, గుంటూరు : ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని నమ్మబలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన 'నారా హమారా.. టీడీపీ హమారా' సభలో న్యాయం కోసం నినదించిన యువకులను అరెస్ట్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని యువకులు గుర్తు చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఒక ట్వీట్ పెట్టారు. 'గుంటూరు మీటింగ్‌కు రమ్మని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిచింది మీరే కదా ? అక్కడకు వచ్చిన వారు మీరిచ్చిన హామీలనే నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యయుతంగా అడిగితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపట్ల పాశవికంగా వ్యవహరిస్తారా? వాళ్లు చేసిన తప్పేంటి ? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడని అడగడం తప్పా? మదర్సా విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు, స్కూలు యూనిఫామ్స్ ఎక్కడిచ్చారని ప్రశ్నించడం పాపమా? స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ లేని విధంగా ముస్లింలకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని లేవనెత్తుతూ మీరు చేసిన అన్యాయాన్ని గుర్తు చేయడం నేరమా? 30 గంటలపాటూ ఎక్కడ ఉంచారో కూడా తెలియనీయకుండా వారిని నిర్భంధించి, హింసించి తర్వాత కేసులు బనాయించి జైల్లో పెట్టడం న్యాయమేనా? ఈ రాష్ట్రంలో మానవహక్కులు లేవా? మానవత్వం ఉందా మీకు? ముఖ్యమంత్రిగారూ.. తక్షణమే ఆ యువకులపై పెట్టిన తప్పుడు కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను' అని ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభకు నంద్యాల పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మహబూబ్ బాషా, అబిద్, అక్తర్ సల్మాన్ జిగ్రియా, ముర్తుజావలి, మహమ్మద్ ఇలియాస్, సౌదిజిబేర్, మహమ్మద్ జిబేర్, ముజాహిద్ వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ముస్లింలకు న్యాయం చేయాలని కోరుతూ వారు ప్లకార్డులు చూపించడంతో 8 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు సైతం లాక్కొని.. యోగక్షేమాలు కూడా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేశారు. -
భృతి.. భ్రమే..!
టీడీపీ సర్కార్ నిరుద్యోగభృతిని గాలికొదిలేసింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి. ఈ ఏడాది చివర్లో.. లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. నిరుద్యోగ భృతి హామీ అమలుకు అడుగులు వేసింది. అయితే కొర్రీలు పెట్టడం గమనార్హం ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపుతోంది. 2014 ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఆశతో టీడీపీకి ఓటేశారు. అధికారం చేపట్టాక మొండిచేయి చూపింది. అదే హామీని మళ్లీ అమలు చేస్తామని చెబుతుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రూ.2వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సవాలక్ష కొర్రీలు పెట్టడమే కాకుండా రూ.1000కి కుదించడం.. 35 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇస్తామని చెబుతుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. గ్రామాల్లో ప్రజాసాధికార సర్వేల్లో పేర్లు నమోదై ఉండాలని షరతులు విధించడంతో యువత నుంచి నిరాశ వ్యక్తమవుతోంది. ఆశ..అడియాస.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 25 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు సుమారు 15 వేల మందిపైనే ఉన్నారు. వీరంతా భృతి అందుతుందని ఆశించి భంగపడినవారే. భర్తీకానీ పోస్టులు... వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా... వాటిని భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు డీఎస్సీ పేరిట రెండు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఇప్పుడు బీఈడి అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హులని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగావకాశాలు కల్పించకుండా అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చుతున్న సీఎం చంద్రబాబు నయవంచనకు గురి చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సబ్సిడీ రుణాలు, పథకాలను కూడా తమ అనుచరలకే ఇప్పించుకుంటూ వేలమంది నిరుద్యోగులు పొట్టకొడుతున్నారని అంటున్నారు. భృతిని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ నాయకుల సమక్షంలో కొందరికే ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. నాలుగున్నరేళ్లకు గుర్తొచ్చిందా..? అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి కింద రూ.2వేలు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్లు ఏమీ పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీకి భయం పుట్టింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అది చెప్పి కూడా రెండు నెలలు అయింది. ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ 600 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. – మూలె హర్షవర్థన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత, ఎర్రగుంట్ల మండలం -
కబళించిన నిరుద్యోగ భూతం
కర్నూలు: తాము అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. టీడీపీ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా హామీ ఇచ్చారు. అధికారంలో రాగానే హామీలకు పాతరేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడం తన బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల నిరుద్యోగ యువత ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉన్నత చదువులు చదివినా కొలువు దొరక్క, బతికేందుకూ ఏ ఆసరా లేక, కుటుంబాలకు భారంగా మారలేక మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం రాలేదన్న బెంగతో కర్నూలు జిల్లా కల్లూరులో ఓ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. కల్లూరులోని పీవీ నరసింహారావునగర్లో నివాసం ఉంటున్న పెద్ద చెన్నయ్య కుమారుడు క్రాంతి కుమార్ (23) డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపించకపోవడంతో లా కోర్సు చేయాలని భావించాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం ఎలుకల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రాంతి కుమార్ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఉద్యోగం రాక, తల్లిదండ్రులపై ఆధారపడి జీవించడం ఇష్టం లేకనే బాధితుడు ఎలుకల మందు తాగినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు నాలుగో పట్టణ ఎస్ఐ శేషయ్య తెలిపారు. -
పవన్ ముసుగు తీస్తామంటూ వార్నింగ్!
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను పవన్ కల్యాణ్ చదవలేదా.. అయితే ఆ మేనిఫెస్టో ఓసారి చదివి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించాలంటూ పవన్‌కు కాంగ్రెస్ నేత మల్లాది చురకలంటించారు. లేదంటే పవన్ ముసుగును తీసే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాలను చదివి అవగాహన పెంచుకుంటే పవన్‌కు ప్రశ్నించడం తెలుస్తుందన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని ఈ సందర్భంగా మల్లాది సూచించారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, గవర్నర్ నరసింహన్‌ను, అదేవిధంగా సీఎం చంద్రబాబును బీసీ కోర్ కమిటీ కలుస్తుందని యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు చెప్పారు. -
హోదాలో ఏమీ లేకపోతే 15 ఏళ్లు ఎందుకడిగారు?
చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే రోజా సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేకపోతే 15 ఏళ్ల పాటు కావాలని ఎందుకు కోరారు? టీడీపీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.రోజా సీఎం చంద్రబాబును ప్రశ్నిం చారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురూ ఒట్టు పెట్టుకుని హోదా ఇస్తామని చెప్పి భగవంతుడికే పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోతే అసెంబ్లీ లో రెండుసార్లు తీర్మానాలు ఎందుకు చేశా రు? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 2014 జూన్ 20న జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్‌కు రాసిచ్చిన ప్రసంగంలో రాష్ట్రానికి పదేళ్లు కాదు, 15ఏళ్లు హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరడమైనది అని ఎందుకు పేర్కొన్నారు? ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను అనుసరించి 15 సంవత్సరాల కాలా నికి పారిశ్రామిక పోత్సాహకాలు, రాయితీలు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు గవర్నర్ చదివిన ప్రసంగంలోనే ఎందుకు పొందుపర్చారు? అని రోజా ప్రశ్నిస్తూ నాటి ప్రసంగం ప్రతిలోని వివరాల్ని చదివి వినిపించారు. హోదాతో లాభం ఏమిటంటున్న బాబు తన పార్టీ నేతలైన సుజనా చౌదరి, గల్లా జయదేవ్, జీవీఎస్ ఆర్ ఆంజనేయులు, సీఎం రమేష్‌ను అడిగితే ఆ ప్రయోజనాలేమిటో చెబుతారన్నారు. వీరంతా హోదాగల రాష్ట్రాల్లో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారో అడగాలన్నారు. -
గర్జిస్తున్న హోదా గళాలు
ప్రత్యేక హోదా మన హక్కు.. రాష్ట్రవ్యాప్తంగా ఎలుగెత్తి నినదిస్తున్న ప్రజానీకం... - కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సీఎం అర్ధరాత్రి స్వాగతించడం దారుణం - పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే - దగాపై రగులుతున్న యువత సాక్షి, అమరావతి: అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రామనాథాన్నిఒక పుస్తకాల షాపు ముందున్న బోర్డు ఆకర్షించింది. ‘మా షాపులో దొరకని పుస్తకం అంటూ ఉండదు’ అన్న బోర్డును చూసి.. అంత సీన్ ఉందా! లేని పుస్తకం అడిగి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా షాపు దగ్గరికెళ్లి ‘ఏమోయ్... ప్రపంచంలోనే అత్యధికంగా అబద్ధాలు చెప్పిన పుస్తకం మీ దగ్గర ఉందా?’ అని అడిగాడు. షాపు యజమాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామనాథం చేతిలో ఓ పుస్తకం పెట్టాడు. ఆ పుస్తకం చూసి రామనాథానికి మూర్ఛ వచ్చినంత పనయ్యింది. ఇంతకీ ఆ పుస్తకం ఏమిటంటారా... ‘తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టో’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశమిది. ‘‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’’... ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి వినిపిస్తున్న నినాదం. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికే విలువ లేకుండాపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముందని నేటి యువత ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం రేపిన విభజన గాయం కంటే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న ద్రోహం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని యువతరం వాపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తమను వెన్నుపోటు పొడిచాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విభజన సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. కాదు కాదు పదేళ్లు కావాలన్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు వెంకయ్యనాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాక నాలుక మడతేయడం చూసి రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని వల్లెవేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివారు. వెంకయ్య నాయుడు పదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. అది సరిపోదు 15 ఏళ్లు కావాల్సిందేనంటూ ఏకంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో పోటీకి దిగారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్నికల ప్రచార సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీకి విన్నవించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ మాట మార్చేశారు. హోదాతో వచ్చేదేమీ ఉండదని తేల్చిచెప్పేశారు. కేంద్రం ఏది ఇస్తే అదే తీసుకోవాలంటూ ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి స్వాగతించారు. రాష్ట్రంపై ఢిల్లీ పెత్తనం ఏమిటంటూ తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మోకరిల్లుతున్న తీరును చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. కొత్త పరిశ్రమల జాడేది? రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. ఈ రెండున్నరేళ్లలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా సర్కారు నిర్వాకంతో ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం నుంచి హెచ్ఎస్బీసీ వెళ్లిపోయింది. మన్నవరంలో బీహెచ్ఈఎల్ యూనిట్ మూటాముల్లె సర్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే యూనిట్లు పెట్టడానికి ముందుకొచ్చి భూములు తీసుకున్న కొన్ని సంస్థలయితే ఇక్కడి అవినీతిని తట్టుకోలేక భూములు వెనక్కి ఇచ్చేస్తున్నాయి. ఇక సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరిట ప్రభుత్వం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. రూ.4.67 లక్షల కోట్ల విలువైన 331 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల పది లక్షల ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టింది. సదస్సు జరిగి 10 నెలలు ముగిసినా ఒక్క ప్రాజెక్టు కూడా పునాదిరాయి స్థాయిని దాటలేదు. వచ్చే ఏడాది రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభించారు. పెట్టుబడుల కోసమంటూ ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి 16కు పైగా విదేశీ పర్యటనలు చేశారు. కనీసం ఈ విమాన ప్రయాణ ఖర్చులకు సమానమైన ఒక ప్రాజెక్టు కూడా ఇంతవరకూ రాలేదని ప్రభు త్వ ఉన్నతాధికారులే ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దేశ విదేశాల నుంచే పారిశ్రామికవేత్తలే భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి తరలివస్తారని పేర్కొంటున్నారు. బాబు వచ్చాడు జాబులు పోయాయి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఇవ్వని హామీ అంటూ లేదు. ‘‘రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ’’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు. తీరా అధికారం చేపట్టాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు రగిలిపోతున్నారు. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారు. గడిచిన రెండున్నరేళ్లలో సుమారు 80,000 ఉద్యోగాలు పోయినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 2013 డిసెంబర్ 31 నాటికి 5.67 లక్షలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2016 జనవరి నాటికి 4.88 లక్షలకు తగ్గిపోయింది. విభజన సమయంలో కమలనాథన్ కమిటీ లెక్కగట్టిన 1.42 లక్షల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోగా అప్పటికే ఉన్న 80,000 కొలువులను తగ్గించేసింది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలు నీటి మీద రాతలుగానే మారాయి. రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా కనీసం ఒక్కరికైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపానపోలేదు. జనం పోరుబాట ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఆరాటపడుతున్నారు. తమ హక్కును సాధించుకోవడం కోసం ఎందాకైనా పోరాడుతామంటున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదం రాష్ట్రం నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిచెప్పి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. గతంలో విజయవంతమైన ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి నడుం బిగించారు. ప్యాకేజీ పేరిట నాటకం ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో పోరాటం ఉధృతం చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త డ్రామాకు తెర తీశాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సంస్థలనే చూపిస్తూ ప్రత్యేక హోదా కంటే అధిక లాభాలు ఇచ్చే ప్యాకేజీ ప్రకటించామంటూ అర్ధరాత్రి ఒక ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కేంద్రం కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టు గానీ, అధికంగా ఒక్క రూపాయి నిధులు గానీ లేవు. అయినా సీఎం బాబు వెంటనే ఇదో అద్భుతమైన ప్యాకేజీ అంటూ స్వాగతించారు. హోదాతో లాభాలెన్నెన్నో... ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు అనేక రాయితీలు లభిస్తాయి. ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకాల్లో రాయితీలకుతోడు తక్కువ వడ్డీకే రుణాలు, రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందుతాయి. పరిశ్రమలు ఏర్పాటైతే యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పరుగెత్తాల్సిన అగత్యం ఉండదు. ఎన్నో లాభాలున్న ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్యాకేజీతో సరిపెట్టుకోవాలంటున్న చంద్రబాబుపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. -
మాట తప్పితే మళ్లీ పోరాటం
కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ రావులపాలెం : ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం మాట తప్పితే మళ్లీ ఉద్యమం తప్పదని కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ హెచ్చరించారు. తుని ఘటన నేపథ్యంలో అరెస్టు అయి 14 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఆయన బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. తొలుత కిర్లంపూడి వెళ్లి, అక్కడి నుంచి స్వగ్రామమైన గోపాలపురం చేరుకున్నారు. ఆలమూరు మండలం మీదుగా ఆయన ఊరేగింపుగా రావులపాలెం చేరుకున్నారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్లో ఆయనకు రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం అధ్యక్షుడు నందం వీరవెంకట సత్యనారాయణ, గోపాలపురం ఉప సర్పంచ్ అధికార నాగేశ్వరరావు, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కాపు సామాజిక వర్గీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామకృష్ణ తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టబోమని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని ఆనాడు చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారని గుర్తుచేశారు. నేడు అమాయకులను అరెస్టులు చేయడంతో ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలసి దీక్ష చేపట్టారన్నారు. కాపుల ఉద్యమంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఏ ఒక్క వర్గానికి నష్టం జరగకుండా ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఏ వర్గానికి నష్టం కలిగేలా ఉన్నా తమకు రిజర్వేషన్లే వద్దని పేర్కొన్నారు. తమ ఉద్యమం ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. అన్ని పార్టీలు, కులాలతో పాటే ఉద్యమంలో ముందుకు సాగుతామన్నారు. కాపు సామాజిక వర్గీయులు ఇదే చైతన్యాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పారు. ర్యాలీలో పీసీసీ జాయింట్ సెక్రటరీ పొనుగుపాటి శ్రీనివాస్, నాయకులు బండారు బాబీ, సాధనాల సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు జవ్వాది రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సుజలాం విఫలాం..!
ఎన్టీఆర్ సుజలకు ఒక్క రూపాయీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం 150 భారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పది రోజుల క్రితం ప్రకటన వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిందే రూ. 59 కోట్లు అయినా నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఆ పథకానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఘనంగా చెప్పుకున్నారు. అధికారం చేపట్టినపుడు పెట్టిన ఐదు సంతకాల్లో ఆ పథకాన్నీ చేర్చారు. పేరు ఘనంగా పెట్టి పబ్లిసిటీ చేసుకున్నా ఆ పథకానికి మాత్రం నిధులు ఇవ్వడంలేదు. అదే ఎన్టీఆర్ సుజల పథకం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించడం పథకం లక్ష్యం. అయితే ఈ పథకం ద్వారా అన్ని గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ఏడాదికి రూ. 150 నుంచి రూ. 200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. 2014-15లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. గత బడ్జెట్లో మాత్రం రూ. 11 కోట్లు కేటాయించారు. వాటిల్లోనూ పైసా ఖర్చు పెట్టలేదు. అయితే, ఈ ఏడాది మార్చి చివర నాటికి ఆ రూ. 11 కోట్లలో రూ. 69 లక్షలు ఖర్చు పెడతామంటూ రివైజ్డు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్లో అయితే పైసా కూడా కేటాయించలేదు. దాతలిచ్చిన నిధులే రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 821 గ్రామాల్లో 826 మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో వాటిలో దాదాపు సగం మూత పడేదశకొచ్చాయి. మరోపక్క ఎన్టీఆర్ సుజల పథకంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గ్రామానికో మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు బదులు 15 గ్రామాలకొకటి చొప్పన భారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్లాంట్‌కు కోటిన్నర వరకు ఖర్చు పెట్టి మూడేళ్లలో రాష్ట్రంలో 1,000 భారీ మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. ప్లాంటు ఏర్పాటుకయ్యే ఖర్చులో దాతలుగానీ, దానిని నిర్వహించడానికి గాను ముందుకొచ్చే వారు 74 శాతం నిధులు భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 26 శాతం ఆర్థిక సహాయం చేస్తుందని కొత్త విధానంలో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వచ్చే ఏడాది ఒక్కొక్క ప్లాంటుకు రూ. 39 లక్షల చొప్పున 150 భారీ మంచినీటి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయినా బడ్జెట్లో మాత్రం పైసా కూడ కేటాయింపులు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రస్ఫుటమవుతోంది. -
నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతే
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతేనని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కోసం ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నసీం జైదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఎప్పటివరకు పెరుగుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని, ఇంకో 50 మందిని సర్దుబాటు చేయగలమని చెబుతూ ఇటీవల సీఎం చంద్రబాబు ఇతర పార్టీల నుంచి చాలా మందిని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ద్వారా స్పష్టత తీసుకుందామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిశాం. ఎన్నికల సంఘానికి కేంద్రం నుంచి సూచనలు ఏమైనా వచ్చాయేమోనని కలిశాం. వారు ఇదివరకే అటార్నీ జనరల్ అభిప్రాయం కూడా తీసుకున్నారని అనుకుంటున్నాను. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన వీలుపడదని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఎందుకిలా చెబుతున్నారో తెలియదు. ఇతర పార్టీల నుంచి, వైఎస్సార్సీపీ నుంచి కొందరిని తీసుకుందామనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది’’ అని మేకపాటి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల ఆందోళన వెనక వైఎస్సార్సీపీ ఉందన్న విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రస్తావించగా... ‘‘మంచి జరిగితే తమది, లేదంటే వైఎస్సార్సీపీదని నిందలు వేయడం పరిపాటిగా మారింది. ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయాలని అడిగారు’’ అని తెలిపారు. -
'అందుకే తునిలో ఉద్రిక్త పరిస్థితులు'
హైదరాబాద్/తుని: టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో చేర్చాల్సిందేనని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వద్ద అన్ని గణంకాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చడానికి 18 నెలలు ఎందుకు ? అని సూటిగా ప్రశ్నించారు. ఎవరినైనా మోసం చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ అంశంలో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అంశంలో యువతను మోసం చేశారని ఆరోపించారు. తమను బీసీల్లో చేర్చకపోవడంపై కాపుల్లో అలజడి, అశాంతి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తునిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు
విజయనగరంఫోర్ట్: ప్రజల ఆశలపై ముఖ్యమంత్రిచంద్రబాబు నీళ్లు చల్లారని డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం పట్టణంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ అంశాన్నీ నేర్చవేర్చలేదన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతురుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ నమ్మించి వంచించారన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ఆంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మొదలిశ్రీనివాస రావు, బి.భానుమూర్తి, కోట్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో అన్ని వర్గాలకు అవస్థలు బొబ్బిలి: తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందని ప్రజలు ఓటేసి గెలిపించిన చంద్రబాబు ఏడాదిగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ విప్ శంబంగి వెంకటచినప్పలనాయుడు విమర్శించారు. చంద్రబాబు ఏడాది పాలనలో వాగ్దానాలను అమలు చేయనందుకు నిరసనగా మేనిఫెస్టో ప్రతులను ఆళ్వారువీధిలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట సోమవారం దహనం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శంబంగి మాట్లాడుతూ ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికి పోవడమేనా? అవినీతి రహిత పాలన అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ద్వారా ఈ వ్యవహారాన్ని చంద్రబాబే నడిపారన్నారు. ఏడాదిగా రైతులు, డ్వాక్రా మహిళలను నట్టేట ముంచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతులు బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం దృష్టి సారించిన పాపాన పోలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో చెరుకు రైతులకు టన్నుకు రూ.60 కొనుగోలు పన్ను తిరిగి అందిస్తే ఈ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి జన్మభూమిలో రేషనుకార్డులకు దరఖాస్తులు తీసుకోవమే తప్ప ఒక్క కార్డు ఇప్పటికి ఇవ్వలేదన్నారు. ఆన్లైన్ పాలనంటే నిరంతరం దరఖాస్తులు స్వీకరించడమేనా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ముగడ వెంకటరమణ, పాలవలస సూర్యనారాయణ, రామ్మూర్తి, త్రినాథ, శ్రీనివాసరావు, రామారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ మేనిఫెస్టో కాపీలు దహనం
బొబ్బిలి (విజయనగరం): ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ విఫలమైందని నిరసిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోలను విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో కాంగ్రెస్ నేతలు సోమవారం దహనం చేశారు. విజయనగరం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ హామీని టీడీపీ నేర్చవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసగా ఆ పార్టీ ఎన్నిల మేనిఫెస్టో 365 ప్రతులను దహనం చేశారు. బొబ్బిలిలో జరిగిన కార్యక్రమంలో మాజీ విప్ శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ ఏడాది పాలనలో టీడీపీ అన్ని వర్గాల వారినీ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. -
ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ
-
ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ
* ‘రణభేరి’లో పీసీసీ చీఫ్ రఘువీరా ధ్వజం * హామీలపై 8వ తేదీలోగా జవాబు చెప్పాలని డిమాండ్ రాజమండ్రి సిటీ: ఏడాది పాలనలో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రప్రజలను మోసగించాయని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీల ఏడాది పాలనపై తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శనివారమిక్కడి సుబ్రహ్మణ్య మైదానంలో కాంగ్రెస్ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని రఘువీరారెడ్డి నగారా మోగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 2018 నాటికి పోలవరం పూర్తి వంటి 600 వాగ్దానాలను ఎప్పటిలోగా అమలు చేస్తారో ఈనెల 8లోగా చెప్పాలని రఘువీరా కోరారు. లేనిపక్షంలో 9 నుంచి గడపగడపకూ వెళ్లి పాలకుల నిజస్వరూపాన్ని ఎండగడతామన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చట్టం చేయాల్సిన పనిలేదని, ఏచట్టం చేయకుండానే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ సర్కారు ప్రకటించిందని ఆయన అన్నారు. మోసం, దగాకోరు వాగ్దానాలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లిచ్చి.. గుజరాత్‌కు రూ.60 వేలకోట్లు మంజూరు చేయడమే మోదీ పాలనంటూ దుయ్యబట్టారు. రిలయన్స్ సంస్థకోసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేంద్ర మాజీమంత్రులు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలంలతోపాటు కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు. 8న టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేయండి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏడాది నయవంచక పాలనకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీలను దహనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో వైఫల్యాలతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించడంలో విఫలమైన తీరును ఎక్కడికక్కడ ప్రజలకు వివరించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 8న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ యువజన, ఎన్ఎస్యూఐ, వివిధ అనుబంధ విభాగాల వారితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
హామీలు హాంఫట్
- 600 వాగ్దానాలు తుంగలోకి... - ఇదీ చంద్రబాబు ఘనత - రఘువీరా ఎద్దేవా అల్లిపురం(విశాఖ): తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్న 600 హామీలను అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలు సంయుక్తంగా బుధవారం దసపల్లా హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇదే చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిన ఘనత అని, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానానికి రూ.5 కోట్లు ఎర చూపి నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. హుద్‌హుద్ తుఫానులో కోట్లాది రూపాయల వసూలు చేసి హాంఫట్ చేశారన్నారు. పట్టెసీమ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు అందుకున్నారన్నారు. వీటన్నింటిని దగానాడుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. దేశం ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ 8 వతేదీ వరకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తుందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన 10 లక్షల 25 వేల సంతకాలతో కూడిన పుస్తకాలను ఆయనకు అంద జేశారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంతకుమార్, పి.బాలరాజు, డి.వి.రామమెహన్, బచ్చు మహేశ్వరరావు, కొండా మురళి, తులసీరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పేడాడ రమణకుమారి, కొండా రాజీవ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నాటి మాటల్ని.. కానివ్వకండి..నీటిమూటలు
మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చండి విలీన మండలాల సమస్యల్ని పరిష్కరించండి చంద్రబాబును కోరిన జిల్లా తెలుగుదేశం అన్నవరం మినీమహానాడులో పలు తీర్మానాలు అన్నవరం:జిల్లాకు సంబంధించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అన్ని హామీలను పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరుతూ జిల్లా తెలుగుదేశం మినీమహానాడులో తీర్మానించారు. అన్నవరం శివారు వల్లభ ఎస్టేట్‌లో ఆవరణలో ఆదివారం జరిగిన మినీ మహానాడుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. చినరాజప్ప ప్రసంగిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను ఆంధ్రలో కలపడం వెనుక చంద్రబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అందుకే ఈ రబీ లో నీటి ఎద్దడి ఏర్పడినా సీలేరు, శబరి నుంచి నీరు తెచ్చుకుని పండించుకున్నామన్నారు. విలీన మండలాల ప్రజలకు గల పెక్కు సమస్యలను పరిష్కరించాలని సీఎం ను కోరుతూ తీర్మానించారు. కాకినాడలో నిర్మించతలపెట్టిన పెట్రోలియం ప్రాజెక్ట్‌కు వెంటనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలని, రాజమండ్రిలో రూ.80 కోట్లతో నిర్మించనున్న టూరిజం ప్రాజెక్ట్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ తీర్మానించారు. సుబ్బారెడ్డి ప్రాజెక్ట్, చంద్రబాబు సాగర్, ఏలేరు, తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాల్వల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ తీర్మానించారు. రైతు రుణమాఫీ అమలు చేసినందుకు సీఎంను అభినందించారు. అధికారుల గుణగణాలు పరిశీలించండి.. ఎవరైనా అధికారి బదిలీకి సిఫార్స్ చేసేముందు నీతిమంతుడో, కాదో తెలుసుకుని సిఫార్స్ చేయాలని దేవినేని ప్రజాప్రతినిధులకు సూచించారు. అవినీతిపరులకు సిఫార్స్‌చేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. 2013-2015 మధ్య మృతి చెందిన జిల్లా టీడీపీ నాయకులకు సంతాపం ప్రకటించే తీర్మానంతో బాటు ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతలు, సాగు నీటి సమస్య, సంక్షేమం, మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు, పారిశ్రామిక ప్రగతి, ఈ గవర్నెన్స్, గిరిజన, మహిళా సంక్షేమం తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడే జిల్లాలో పార్టీకి సుప్రీం జిల్లా ఇన్చార్జి, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు జిల్లాలో పార్టీకి సుప్రీం అని, మంత్రులైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైనా ఆయన సూచనల మేరకు నడవాల్సిందేని అన్నారు. ‘పదేళ్లు అధికారానికి దూరమై ఎన్నో బాధలు పడ్డాం. ఇంక అలాంటి పరిస్థితి రానీయవద్దు. కార్యకర్తలు, నాయకులు అంతా కలిసికట్టుగా సాగుదాం’ అన్నారు. ‘ఇకపై పార్టీ సమావేశాలు మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా జరగాలి. జెడ్పీ సమావేశానికి ముందు పార్టీ జిల్లా మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇన్చార్జి మంత్రిగా నే ను కూడా వస్తా. జెడ్పీ సమావేశం కూడా 8 గంటలు జరగాలి. అన్నీ చర్చించాలి’ అన్నారు. ఎన్నికలప్పుడు జిల్లా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని నీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మినీ మహానాడు తీర్మానాలపై 27, 28, 29 తేదీల్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. -
మాఫీలో..మతలబు
►పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు ►మండిపడుతున్న డ్వాక్రా మహిళలు ►మాఫీ ఎవరు ప్రకటించమన్నారు..? ►అధికారులను నిలదీసిన మహిళలు సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొదలుకొని.. గోడలపై రాతల పూతల వరకు ఒకటే ప్రచారం.. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే.. డ్వాక్రా మహిళల రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తారంటూ ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు నేడు జనంలోకి రావాలంటేనే జంకుతున్నారు. మొన్న రైతులకు రుణమాఫీ పేరుతో కేవలం వడ్డీకి కూడా సరిపోనంత సొమ్మును అందించి చేతులు దులుపుకున్న బాబు.. ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి పేరుతో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తం లాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం డ్వాక్రా మహిళల్లో ఆగ్రహావేశానికి గురిచేసింది. ప్రస్తుతానికి మాఫీ చేయలేనని.. ఒకేసారి రూ.10వేలు ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు.. లోటు బడ్జెట్ పేరుతో ఈసారికి రూ.3వేలు మాత్రమే ఇచ్చి.. తర్వాత కంతుల ప్రకారం మిగతా సొమ్మును చెల్లిస్తామని పేర్కొనడం కూడా మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జమచేసే రూ.3వేలు కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తం మీద వచ్చే సొమ్మునంతా పొదుపులాగే అకౌంట్లల్లో ఉంచుకొని వడ్డీని మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై తీవ్రస్థాయిలో మహిళలు మండిపడుతున్నారు. రుణమాఫీ ప్రకటించడమెందుకు.. ఇప్పుడు జారుకోవడమెందుకంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయాల్సిందే... : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రుణమాఫీ చేసి తీరాల్సిందేనంటూ డ్వాక్రా మహిళలు నినదిస్తున్నారు. బుధవారం మండలస్థాయిల్లో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశాలన్నింటిలోనూ తీవ్రస్థాయిలో మండిపడిన మహిళలు గురువారం నియోజకవర్గస్థాయిలో జరిగిన డ్వాక్రా మహిళల సదస్సుల్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపాలెంలో సదస్సు సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డ్వాక్రా మహిళలంతా నినాదాలు చేశారు. పేరుకు మాఫీ చేస్తున్నారని మహిళలను మోసం చేయడం అన్యాయమంటూ వారు దుమ్మెత్తిపోశారు. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, వేంపల్లె, వేముల, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, రాజంపేట, మైదుకూరు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల మహిళలు అధికారులను నిలదీస్తున్నారు. అకౌంటులోనే పెట్టుకోవాలని నిబంధన పెట్టడం ఏమిటి.. : ఎన్నికలలో డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం మూడు వేలు చేసినారు. అది కూడా సంఘం అకౌంట్లో వేసుకోవాలని తీసుకోకూడదని నిబంధన పెట్టడం దారుణం. ఇంత మాత్రానికి రుణ మాఫీ అని చెప్పడం ఎందుకు. అంతా మాఫీ చేస్తామని చెప్పి కేవలం మూడు వేలేనా... ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఇప్పడు ఏడాది తర్వాత కేవలం మూడు వేలు రుణమాఫీ చేసినట్లు సంఘాల అకౌంటులో గ్రూపునకు రూ.30వేలు వేశారు. ఈ డబ్బును సంఘం నిధిలో జమా చేయాలని నిబంధన పెట్టారు. ఇదేనా చంద్రబాబు రుణమాఫీ. - వి.లక్ష్మిదేవి(శ్రీ తేజ గ్రూపు లీడర్) ఎర్రగుంట్ల మాఫీ చేయాలి.. : డ్వాక్రా మహిళలకు ఇచ్చే మొత్తం పూర్తిగా మాఫీ చేయాలి. రూ.10 వేలు మూడు విడతలుగా కాకుండా ఒక్కసారే ఇవ్వాలి. - కొండమ్మ(డ్వాక్రా సంఘ సభ్యురాలు) రాజుపాళెం డ్వాక్రా మహిళలను మభ్యపెడుతున్నాడు : డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు రుణం మాఫీ చేస్తామని చెప్పి మభ్యపెడుతున్నారు. రూ.10 వేలు ఇచ్చి తిరిగి మళ్లీ కట్టమని చెప్పడం ఏమిటి. - ప్రభావతమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు , రాజుపాళెం -
చెత్తబుట్టలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో
నంద్యాల : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సింగపూర్, జపాన్ పర్యటనలను కొనసాగిస్తున్నారని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి విమర్శించారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అయితే సహచర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ కార్మికులను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని భూమా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో రెండు దఫాలుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచిన విషయాన్ని భూమా గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని బాబు ఆలోచించిన విషయాన్ని భూమా వారికి గుర్తు చేశారు. రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. సమావేశంలో జేఏసీనేత ఖాన్ మాట్లాడుతూ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఇప్పటికే అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భూమా అండగా నిలువాలని కోరారు. -
టీడీపీ మేనిఫెస్టోనే బోగస్
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వాకాడు : తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక బోగస్‌ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజాకంటక ప్రభుత్వంపై ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారన్నారు. వాకాడులోని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో బుధవారం రాత్రి ఆ పార్టీ అనుబంధ మండల కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డికి ప్రసన్నకుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రసన్న విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి నాయకులు, కార్యకర్తలే కొండంత బలమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల తరపునపోరాటం చేస్తామన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తరువాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా చంద్రబాబు ఇచ్ని వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. అధికారానికి కొంచెం దూరంలోనే వైఎస్సార్సీపీ నిలిచినప్పటికీ ప్రజల ఆదరణ ఇప్పుడు మరింతగా పెరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి అనుబంధ సంస్థల కమిటీలను నియమిస్తున్నామన్నారు. పార్టీని ఇంకా పటిష్ట పరిచి జిల్లాలో తిరుగులేని శక్తిగా చేస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రకటించారు. అనుబంధ కమిటీ అధ్యక్షులంతా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. రెండు నెలలకు ఒకసారి సమావేశం జరిపి అజెండాను రూపొందించుకుని ప్రజల తరపున పోరాడాలని సూచించారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనుబంధ సంస్థల కమిటీలు పూర్తయ్యాయన్నారు. అనుబంధ సంస్థల కమిటీ సభ్యులందరూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పటిష్టానికి మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. కొత్త రాజధాని కోసం పంటలు పండే భూములు లాగేసుకుని రైతులకు అన్యాయం చేస్తే ఆగోష్ఠ చంద్రబాబుకు తగులుతుందన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏర్పాటు చేయబోయే కొత్త రాజధాని చుట్టూ చంద్రబాబు అనుచరులకు రూ.కోట్లు సంపాదించి పెట్టాలన్నదే చంద్రబాబు ఆలోచనని విమర్శించారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేశామాని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. జిల్లాలో సరైన సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సముచిత నిర్ణయమన్నారు. వచ్చే నెల 5న కలెక్టరేట్ ఎదుటజరగనున్న ధర్నాను విజయ వంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సాసీపీ మండల అధ్యక్షుడు నేదురుమల్లి ఉదయశేఖర్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, కొండారెడ్డి నందగోపాలరెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి, పిట్టు నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీలా, కడూరు భాస్కర్, అజిత్‌కుమార్‌రెడ్డి, రవీంద్రనాయుడు, తుమ్మల మోహనాయుడు, దుష్యంతయ్యశెట్టి, రవిశేఖర్‌రెడ్డి, తీపలపూడి చెంగయ్య, ఎంబేటి సురేష్, నాగేంద్రరెడ్డి, జనార్దన్‌రెడ్డి, కోటేశ్వరరెడ్డి, పల్లంపర్తి గోపాలరెడ్డి, కాశీపురం శ్రీనివాసులు, కాటంరెడ్డి రామలింగారెడ్డి పాల్గొన్నారు. -
మాట మార్చారు.. మోసం చేశారు
విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏకంగా హామీలనే మార్చేసిన సీఎం చంద్రబాబు వ్యవసాయ రుణాలు అనలేదని, పంట రుణాలు రద్దు చేస్తామనే హామీనిచ్చానని బుకాయింపు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ టీవీల్లో విస్తృతంగా ప్రకటనలు, భారీ హోర్డింగ్‌లు, కరపత్రాలతో ప్రచారం ఆరునెలలైనా ఒక్క రైతుకూ ఒక్క రూపాయి రుణమూ మాఫీ కాని వైనం సాక్షి, హైదరాబాద్: ఆరునెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారన్నది పాతసామెత... ఆరునెలల కాలం గడిస్తే హామీలు, వాటి అర్థాలు కూడా మారతాయన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా సామెత. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీలిచ్చిన చంద్రబాబు ఆరునెలల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఏ పార్టీ వేదికగా హామీ ఇచ్చారో అదే పార్టీ వేదికగా మాట మార్చారు. స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కూడా మార్చి చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు మార్చి 31 వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేశారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వాటిలో స్పష్టమైన హామీ ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను మేనిఫెస్టోలో సుదీర్ఘ ప్రస్తావన చేస్తూనే వ్యవసాయ రుణాల మాఫీ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రుణాలను మాఫీ చేసే ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ముందు ప్రతీ సభలోనూ ఊదరగొట్టారు. ఇదే విషయాన్ని భారీ హోర్డింగ్‌లు, టీవీల్లో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేశారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారాన్ని విడిపిస్తామని, త్వరలోనే బంగారం మీ ఇంటికొస్తుందని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే అంశంపై టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున కరపత్రాలు పంచారు. వాటిని నమ్మిన ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకంతోనే చంద్రబాబు ‘తొండి’ మొదలైంది. అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీపైనే తొలిసంతకం చేస్తానని ఊర్లన్నీ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ రోజు వచ్చేసరికి రుణమాఫీ అమలు విధివిధానాలు నిర్ణయించేందుకు కోటయ్య కమిటీని ఏర్పాటుచేస్తూ సంతకం చేసి సరిపుచ్చారు. ఆ తర్వాత రుణమాఫీ జరిగిపోయిందంటూ సన్మానాలు చేయించుకున్నారు. రైతుల ఖాతాలను తగ్గించడానికి రకరకాల సాకులతో ఆరునెలలుగా రుణమాఫీ కసరత్తును సాగదీస్తూనే ఉన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క రైతుకూ ఒక్క రూపాయి రుణమూ మాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత బుధవారం విజయవాడలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు ఏకంగా హామీలనే మార్చేశారు. వ్యవసాయ రుణాలు అని మేనిఫెస్టోలో, ఊరూరా సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు... పంటపైన తీసుకున్న రుణాలు రద్దు చేస్తామనే తాను హామీనిచ్చానని పార్టీ సమావేశంలో మాట మార్చారు. అప్పట్లో రుణాలన్నీ మాఫీ చేస్తాన్న చంద్రబాబు... ఇప్పుడేమో ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా లక్షన్నర మాత్రమే రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పానని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఈ హామీలపై ఎలాంటి షరతులు, ఆంక్షలు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఇప్పుడు వ్యవసాయ రుణాలకు బదులు పంట రుణాలను రద్దు చేస్తామంటూ అసలు హామీనే పక్కదారి పట్టించడం పట్ల పార్టీ నేతల్లోనే విస్మయం వ్యక్తమైంది. డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. డ్వాక్రా రుణాలను మాఫీ చేసేది లేదని, మూల ధనంగా ప్రతి సంఘానికి లక్ష రూపాయలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట మార్చటం తెలిసిందే. మహిళలు ఎక్కడంటే అక్కడ డబ్బులు అప్పులు తీసుకోవడంవల్లే తిరిగి చెల్లించే శక్తిలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారంటూ సీఎం తరచూ వ్యాఖ్యానించడంపట్ల మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందేమంటే హావ్యవసాయ రుణాల మాఫీ. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి. సౌర విద్యుత్ కోసం 75 శాతం సబ్సిడీ. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్ట నివారణకు రైతువారిగా ఇన్సూరెన్స్. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. దెబ్బతిన్న రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించి భవిష్యత్తుపట్ల భరోసా నింపేందుకే తెలుగుదేశం పార్టీ రుణ మాఫీ ప్రకటించింది. హాతెలుగుదేశం పార్టీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేస్తాం. రుణ మాఫీ వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం మాత్రమే. -
షరతుల్లేకుండా రుణాలు మాఫీ చేయాలి
రాయదుర్గం : ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రైతులకు చెందిన అన్ని రకాల రుణాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే మాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేయకుండా తక్షణం ఆదేశాలు జారీ చేయాలన్నారు. శనివారం సాయంత్రం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్ చేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, దానిపై కమిటీ వేయడానికి దస్త్రాలపై సంతకం పెట్టి, మొదటి సంతకంతోనే రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. రుణ మాఫీ హామీ ఇవ్వడం వల్లే రైతులు టీడీపీకి అధికారం కట్టబెట్టారని, ఇపుడేమో కమిటీల పేరుతో కాలయాపన చేసి దగా చేయాలని ప్రయత్నిస్తే, రైతుల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ ఆందోళన చేయడానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, వెంటనే పంట రుణాలతో పాటు, బంగారు నగలు తాకట్టు పెట్టి పొందిన రుణాలు, వ్యవసాయం కోసం తీసుకున్న ట్రాక్టర్ల రుణాలను కూడా మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కూడా బ్యాంకులకు ఎలాంటి రుణాలను చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. అలాగే రైతుల ఖాతాల్లో ఉన్న పొదుపు లేదా డిపాజిట్ల సొమ్మును బ్యాంకర్లు రుణాలకు జమ చేసుకోకుండా బ్యాంకుల్లో ఉన్న నగదును డ్రా చేసుకోవాలని సూచించారు. సబ్సిడీ ధరతో వెంటనే విత్తన వేరుశనగ, ఎరువులు అందించాలని, డ్వాక్రా రుణాలు సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు. పింఛన్లను ఏ నిబంధనలూ లేకుండా అందించాలన్నారు. టీడీపీ తన మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, అన్ని వర్గాల ప్రజల తరఫున పోరాటాలు చేస్తామన్నారు. -
టీడీపీ మేనిఫెస్టోను అమలు చేస్తాం
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసేందుకు తమ నాయకుడు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే రైతుల రుణమాఫీపై సంతకం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అమరరాజ కంపెనీ తరఫున 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తనను గెలిపించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడారు. సమావేశంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, నాయకులు కందుకూరి వీరయ్య, గల్లా పద్మ, రావిపాటి సాయికృష్ణ, వేమూరి సూర్యం, షేక్ లాల్‌వజీర్, యాగంటి దుర్గారావు, ఎలుకా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కొలువులన్నీ కోతలే..
* అధికారం కోసం అరచేతిలో వైకుంఠం చూపుతున్న బాబు * ఇంటికో ఉద్యోగమంటూ మేనిఫెస్టోలో మాయమాటలు * అంటే దాదాపు 3.5 కోట్ల కొలువులు... ఎలా సాధ్యం బాబూ? * ఉద్యోగుల తొలగింపే అజెండాగా తొమ్మిదిన్నరేళ్ల పాలన * ఖాళీల భర్తీకి చెల్లుచీటీ... నిరుద్యోగులకు నిత్య నరకం * అలాంటి ఘనుడు కోట్లాది కొలువులిస్తానంటే నమ్మేదెవరు? 1995-2004 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా బాబు భర్తీ చేసిన ఉద్యోగాలివీ... 1998 గ్రూప్-1 83 పోస్టులు (బ్యాక్లాగ్) 1998 ఎంపీడీవో 235 పోస్టులు 1999 గ్రూప్-2 104 పోస్టులు 2001 జూనియర్ లెక్చరర్స్ 360 మొత్తం 782 1999 గ్రూప్-2లో 1,500కు పైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీలుంటే కేవలం 245 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ వాటిలోనూ 141 సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఉపసంహరించారు. మల్లు విశ్వనాథ్‌రెడ్డి: ఎన్నికల వేళ చంద్రబాబు గుప్పించే ఆచరణసాధ్యం కాని హామీలను చూస్తే అచ్చం కొయ్య తుపాకీ చేతపట్టుకుని నోటికొచ్చినట్టల్లా గొప్పలు పోయే పిట్టల దొరే గుర్తొస్తాడు. తేడా అల్లా ఒక్కటే. పిట్టల దొర గప్పాలన్నీ ఉదర పోషణార్థమైతే రెండు కళ్ల బాబు పేరు గొప్ప హామీల లక్ష్యమేమో తలకిందులుగా తపస్సు చేసైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడం! 2009 ఎన్నికల్లో ‘నగదు బదిలీ’ అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన బాబు ఈసారి దాన్ని అటకెక్కించి, దాని బాబు లాంటి ‘ఇంటికో ఉద్యోగం’ నినాదాన్ని తలకెత్తుకున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 2.1 కోట్లు. వాస్తవానికి 3.5 కోట్ల కుటుంబాలుంటాయి. మరి అన్ని కోట్ల ఉద్యోగాలిచ్చేందుకు బాబు చేతిలో మంత్రదండమేదైనా ఉందా? తన పాలన పొడవునా ఉద్యోగులను విచ్చలవిడిగా తొలగించడం, ఖాళీల భర్తీ మాటే ఎత్తకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమే పనిగా పెట్టుకున్న ఈ ప్రపంచ బ్యాంకు తాబేదారు ఇప్పుడు ఇంటికో ఉద్యోగమిస్తానంటే నవ్వాలా, ఏడవాలా...? అదో భయానక గతం బాబు ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా బలైంది ఉద్యోగులే! ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పద్ధతినే చంద్రబాబు భాషలో సంస్కరణలు అంటారని సామాజిక కార్యకర్తలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు కూడా. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురు పోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలనే వీలైనంతగా తొలగించిన బాబు ఇప్పుడు కొత్త ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతామని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందమే కుదుర్చుకున్న ఘనుడు బాబు! ఉద్యోగుల కుదింపుకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! 1998లో 747 మంది కార్మికులను, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారు. పైగా, ‘రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమే మహా ఎక్కువ. మళ్లీ డీఏ కూడానా? ఇచ్చేది లేదు’ అంటూ అధికారంలో ఉండగా తెగేసి చెప్పిన చరిత్ర చంద్రబాబుది. వైద్యులూ కాంట్రాక్టు కార్మికులే ఇదీ బాబు మార్కు వైద్యం: వైద్యో నారాయణో హరీ అన్నారు. అలాంటి వైద్య వృత్తిని కూడా కాంట్రాక్టు పని స్థాయికి దిగజార్చిన ఘనుడు చంద్రబాబు. ప్రభుత్వానికి మూలస్తంభమైన ఉద్యోగ వ్యవస్థనే నీరుగార్చి ‘కాంట్రాక్టు’ వ్యవస్థకు బీజం వేసిన బాబంటే ఉద్యోగులు ఇప్పటికీ హడలిపోతుంటారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆరోగ్య వ్యవస్థలో కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకున్నారు. ఈ జాఢ్యానికి ఆరోగ్య శాఖ నుంచే శ్రీకారం చుట్టారు. 1994 నుంచీ నియామకాల్లేక ప్రభుత్వాసుపత్రులన్నీ అల్లాడుతున్నా, వాటిలో రాష్ట్రవ్యాప్తంగా 3,000 దాకా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా బాబు పట్టించుకోలేదు. వారిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నా రు. ప్రభుత్వోద్యోగంలో చేరాలనుకున్న ఎందరో వైద్యులు ఈ కాంట్రాక్టు పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించినా లాభం లేకపోయింది. తర్వాత్తర్వాత ఈ కాంట్రాక్టు పద్ధతిని పారా మెడికల్ సిబ్బందికీ విస్తరించారు బాబు. అది కూడా 2003లో, ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉన్నాయనగా వేలాది పారామెడికల్ కాంట్రాక్టు పోస్టులను నియమించేందుకు పూనుకున్నారు. బాబు పుణ్యాన మొదలైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ జాఢ్యం ఆ తర్వాత ఇతర శాఖల్లోకీ ప్రవేశించి రెగ్యులర్ నియామకాలను మింగేసింది. ఆస్పత్రులను నిర్వీర్యం చేసిన బాబు ప్రభుత్వాసుపత్రుల వ్యవస్థ బాబు పాలనలో నిర్వీర్యమైంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వాసుపత్రుల్లో సేవలకు రోగులు దూరమయ్యారు. ప్రజలు బాబును తిరస్కరించినా ఆయన తెచ్చిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం మాత్రం ఇప్పటికీ పోలేదు. బాబు విధానాల కారణంగా ఎన్నో పెద్దాసుపత్రులు అనాథలుగా మారాయి. వేలాదిమంది నిరుద్యోగులు ప్రభుత్వోద్యోగాలు పొందే అవకాశాలను కోల్పోయారు. రాబోయే ప్రభుత్వాలైనా పెద్దాసుపత్రుల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిని తొలగించి వాటిని బలోపేతం చెయ్యాలి. - డాక్టర్ బి.రమేశ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి - అసలు రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయో టీడీపీకి తెలుసా? కుటుంబానికో ఉద్యోగమం టూ ఊదరగొడుతున్నారే తప్ప ఎన్ని ఉద్యోగాలి స్తారో స్పష్టంగా చెప్పరేం? అలా సంఖ్య చెబితే అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యమో కూడా చెప్పా ల్సి వస్తుంది. కాబట్టే ఎటూ తేల్చకుండా తెలివి గా తప్పించుకుంటున్నారన్నది నిజం కాదా? - ‘ఒక వంటగది వాడుతున్న వారంతా ఒక కుటుంబం’ అనే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని అని జనాభా లెక్కల సేకరణ విభాగం 2011లో చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.1 కోట్ల కుటుంబాలున్నాయి. వాస్తవానికి వాటి సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది. మరి బాబు ఎక్కడి నుంచి ఉద్యోగాలిస్తారు? - {పభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపి కూడా రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలే. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ, సేవ రంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల్లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలంటే ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు దగ్గర సిద్ధంగా ఉందా? ఉద్యోగాల కల్పనకు మ్యాజిక్‌లు పని చేయవు. పారిశ్రామికీకరణ జరగాలి. అందుకు ఏం చేస్తారో చెప్పకుండా ‘ఉద్యోగాలిస్తాం’ అని మాత్రమే అంటున్నారంటే ప్రజలను మోసం చేయడానికేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ వైఎస్ బాట... ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టారు. నిరుద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు. దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. - 1999 గ్రూప్-2 నోటిఫికేషన్లో ఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర దించారు. తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు! ‘కార్పొరేట్’కే దన్ను ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు విజయపథంలో దూసుకుపోతున్న రోజలవి. కానీ బాబు అధికార పగ్గాలు చేపట్టగానే ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఎయిడెడ్ కాలేజీల్లో పోస్టుల నియామకం మీద నిషేధం విధిస్తూ ఏకంగా జీవో (నంబర్ 37) జారీ చేశారు. దాంతో కొన్నేళ్లలోనే ఎయిడెడ్ కాలేజీలు నిర్వీర్యమైపోయాయి. ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ కాలేజీలు తెర మీదికొచ్చాయి. భారీ ఫీజులతో విద్యను విలాస వస్తువుగా మార్చేశాయి. అలా చదువును కూడా కొనుక్కోవాల్సిన దుస్థిథి కల్పించిన ఘనుడు బాబు! -
నమ్మించి గొంతు కోసేలా ఉంది
టీడీపీ మేనిఫెస్టోపై హరీష్‌రావు ధ్వజం సంగారెడ్డి: టీడీపీ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. పోలవరం డిజైన్ మార్పు, ఉద్యోగుల స్థానికతపై ఈ మేనిఫెస్టోలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు ఎందుకని, దీనిపై టీడీపీ ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఎర్రబెల్లి, మోత్కుపల్లిల ఫొటో లు కనీసం మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి కూడా పనికి రావా? అని నిలదీశారు. ఎన్టీఆర్ అమలుచేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి, వీధికో బెల్టుషాపు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు బెల్టు దుకాణాలు రద్దు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పొత్తుల కోసం బాబు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారన్నారు.