పవన్ ముసుగు తీస్తామంటూ వార్నింగ్! | Malladi Krishna Rao questions Pawan Kalyan on TDP Manifesto | Sakshi
Sakshi News home page

పవన్ ముసుగు తీస్తామంటూ వార్నింగ్!

Published Sun, Dec 10 2017 8:22 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Malladi Krishna Rao questions Pawan Kalyan on TDP Manifesto - Sakshi

సాక్షి, కాకినాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను పవన్ కల్యాణ్ చదవలేదా.. అయితే ఆ మేనిఫెస్టో ఓసారి చదివి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించాలంటూ పవన్‌కు కాంగ్రెస్ నేత మల్లాది చురకలంటించారు. లేదంటే పవన్ ముసుగును తీసే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు.

చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాలను చదివి అవగాహన పెంచుకుంటే పవన్‌కు ప్రశ్నించడం తెలుస్తుందన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని ఈ సందర్భంగా మల్లాది సూచించారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, గవర్నర్ నరసింహన్‌ను, అదేవిధంగా సీఎం చంద్రబాబును బీసీ కోర్ కమిటీ కలుస్తుందని యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement