malladi krishna rao
-
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మల్లాడి కృష్ణ రావు ప్రశంశలు
-
టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు
-
మహానేతకు నివాళి - మల్లాది కృష్ణ రావు
-
ఎమ్మెల్యేల షాక్: సంక్షోభంలో కాంగ్రెస్ సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్ మైనార్టీలో పడిపోయింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఎన్నికలపై సమీక్ష జరిపేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోకముందే మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి అప్రమత్తం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కెబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. కాగా మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది. కాగా యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక పదవులు చేపట్టారు. యానాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజల మనిషిగా పేరు పొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తరువాత ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా ప్రకటించలేదు. -
మంత్రి రాజీనామా.. ప్రమాదంలో ప్రభుత్వం
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి కృష్ణారావు తన శాసన సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. యానాంకు చెందిన ఆయన 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రతిపక్షం ఒక సభ్యుడిని తమ వైపునకు లాగేసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ‘ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు’ చెప్పి గత నెల జనవరి 7వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఆమోదించకపోవడంతో తాజాగా ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. రాజకీయంగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తానని మల్లాడి కృష్ణారావు తెలిపారు. నెల రోజులుగా కృష్ణారావు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు. అధికారికంగా కేటాయించిన కారును వినియోగించడం లేదు. తాజాగా ఆయన రాజీనామాతో సీఎం నారాయణ్‌స్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. పుదుచ్చేరి ప్రభుత్వంలో మొత్తం 33 (నామినేటెడ్‌తో కలిపి) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధనవేలు అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతిపక్షాల బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. ప్రభుత్వ బలం బార్డర్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని ప్రతిపక్షం లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 1996 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. -
మంత్రి విశ్రాంతి ప్రకటన.. ప్రజలు కన్నీటి పర్యంతం
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉద్వేగానికి లోనయ్యారు. తాను విశ్రాంతి తీసుకోదలచినట్టు ఆయన చేసిన ప్రకటనతో యానం వాసులు కన్నీటి పర్యంతం అయ్యారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. యానం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు అందరికి సుపరిచితులే. కాంగ్రెస్‌కు చెందిన ఈ నేత 25 ఏళ్లుగా యానం ప్రజలతో మమేకం అయ్యారు. వరస విజయాలతో దూసుకొచ్చిన ఆయన యానం ప్రజల కోసం పదవిని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని చాటారు. ఆ దిశగా ఇటీవల తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదన్న ప్రకటన వెలువడింది. ఇందుకు తగ్గట్టుగా ఆదివారం యానం అయ్యన్నగర్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మల్లాడి కృష్ణారావును రాజకీయాల్లో ఉండాల్సిందే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ప్రజలు కన్నీటి పర్యంతంతో విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రజలు, మద్దతుదారులు కన్నీటిపర్యంతంతో విజ్ఞప్తి చేయడంతో ఉద్వేగానికి లోనైన మల్లాడి రుమాలతో పలుమార్లు చెమరిన కళ్లను తడుచుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ తాను నిర్ణయం తీసుకున్నానని, తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని స్పష్టం చేశారు. తనకు విశ్రాంతి కావాలని, దయ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మనలో ఒకర్ని ఎంపిక చేసి, పుదుచ్చేరి అసెంబ్లీకి పంపుదామని పిలుపునిచ్చారు. ఆ ఒకరు ఎవరో ప్రజలు చెప్పాలని, యానం అభివృద్ధిని కాంక్షించే ఆ వ్యక్తికి సంపూర్ణ మద్దతుఇద్దామన్నారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని ప్రజలకు నచ్చచెప్పారు. -
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
పుదుచ్చేరి: ఎవరి బాధ్యతను వారు విస్మరించినపుడు వేరొకరి చేత ఆ బాధ్యతను గుర్తు చేయించుకోవలసిన దుస్థితి వస్తుంది. గుర్తు చేసినా వాళ్లు ఆ బాధ్యతను చేతుల్లోకి తీసుకోక పోతుంటే?! మల్లాది కృష్ణారావు గారు ఏం చేశారో చూడండి. ఆయన మన తెలుగువారు. పుదుచ్చేరిలో కీలకమైన వ్యక్తిగా పెద్ద స్థానంలో ఉన్నారు. శనివారం ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్లారు. కోవిడ్ ఇన్స్పెక్షన్. ఎక్కడంటే.. ‘ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’లో. పేషెంట్లను పలకరించారు. ఏ పడక దగ్గరకు వెళ్లినా ఒకటే కంప్లయింట్. ‘టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం లేదు సర్’ అని. ఆసుపత్రి అధికారులను పిలిపించడం, వాళ్లు పరుగున రావడం ఏం లేదు. వాళ్లు ఆయన పక్కన లేకుంటే కదా! ‘ఏమిటిది?’ అన్నట్లు వాళ్ల వైపు చూశారు కృష్ణారావు. (శశికళకు షాక్ ఇచ్చిన ఐటీ?) ఆ వెంటనే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. చట్టం అంటే.. చీపురు, నీళ్ల బకెట్, క్లీనింగ్ లిక్విడ్స్! నేరుగా అక్కడి ఒక టాయిలెట్ గదికి వెళ్లి క్లీన్ చెయ్యడం మొదలు పెట్టారు!! ‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు. ఎవరి పని వారు చెయ్యకపోతుంటే ‘ఎందుకు చెయ్యరు?’ అని నిలదీసి చేయించడం ఒక పద్దతి. అయితే ఎంత నిలదీసినా కదలని ఉచ్ఛస్థితి లోకి వచ్చేసిన వాళ్లు ఉంటారు. వాళ్ల చేత ఐక్యరాజ్యసమితి కూడా పని చేయించలేదు. ఇక కృష్ణారావు గారెంత? ఆఫ్టాల్ర్ ఆరోగ్యశాఖ మంత్రి. శుభ్రతే దైవం అంటారు. వృత్తిని దైవంలా భావించని వారి కారణంగానే దైవానికి భూమి మీద శుభ్రమైన చోటు లేకుండా పోతోంది. (మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..) -
సీఎం జగన్‌ను కలిసిన పుదుచ్చేరి మంత్రి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుదుచ్చేరి ఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యానాంకు సంబంధించిన పలు అంశాలను ఆయన చర్చించినట్టు తెలిసింది. సీఎం జగన్ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని అభినందించారు. అనంతరం వివిధ అంశాలపై సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచిన విషయం తెలిసిందే. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) -
మంత్రి అసంతృప్తి.. గవర్నర్‌పై ఫిర్యాదు
సాక్షి, యానాం : కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదంటూ పుదుచ్చేరి గవర్నర్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. తన ఆదేశాలను పట్టించుకోని యానాం అధికారుల తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆ ఏడుగురు యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా ఉంటే పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి వైదొలుగుతానని మల్లాడి ప్రకటించారు. కాగా, మూడు రోజుల క్రిందట ఇతర ప్రాంతాల నుండి ఏడుగురు స్దానికులు యానాంకు వచ్చారు. వీరిని అధికారులు సరిహద్దు వద్దే నిలువరించారు. ఈ నేపథ్యంలో ఆ ఏడుగురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలని మల్లాడి చేసిన ఆదేశాలను యానాం అధికారులు పట్టించుకోలేదు. దీంతో మంత్రి తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. చదవండి : లాక్డౌన్: గల్ఫ్ బాధితులకు శుభవార్త! -
‘లాక్డౌన్ పొడిగించే అవకాశముంది’
సాక్షి, కాకినాడ: లాక్‌డౌన్‌ను ప్రజలు కచ్చితంగా పాటించాలని పుదుచ్చేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చేపడుతున్న చర్యలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకే ఉన్న లాక్‌డౌన్‌ను కేంద్రం కొన్ని రోజులు పొడిగించే అవకాశముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. (లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..) కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం కంటే ముందుగానే తమ పుదుచ్చేరి సీఎం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పుదుచ్చేరి పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. కేరళలో ఉన్న మాహీలో మాత్రమే పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. ఆ కేసు కూడా వైద్యం అందడంతో నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. (మందు బాబులను ఆగమాగం చేస్తోంది...) కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి యానాంలో లక్ష మందికి మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. యానాంలో ఉన్న 22 రేషన్‌షాపులు, ఐదు కోపరేటివ్ లిక్కర్ షాపులను మూసివేశామని తెలిపారు. ప్రజలకు రేషన్‌తో పాటు నిత్యావసరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆ సరుకులను హోల్‌సేల్ ధరలకే హోం డెలివరీ చేస్తామన్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) -
‘ముఖ్యమంత్రి జగన్‌ను హీరోగా చూస్తున్నారు’
సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ : పుదుచ్చేరి వైద్యారోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న భావన వైఎస్ జగన్‌లో ఉందన్నారు. ‘నా రాజకీయ జీవితంలో కేబినెట్ ప్రమాణస్వీకారం చేయకుండానే పథకాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే’అని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణను కొంతమంది వ్యతిరేకించినప్పటికీ.. రాబోయే పదేళ్లలో దాని ప్రతిఫలాలను అందుకున్నప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయం సరైనదని భావిస్తారని కృష్ణారావు అన్నారు. ఆయన కాకినాడలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తండ్రిలాగానే తనయుడు.. ‘రాజధానులు ఏర్పటయ్యే మూడు ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలను సీఎం జగన్ అభివృద్ధి చేస్తారనే నమ్మకం నాకుంది. గత ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి రెండో హైదరాబాద్ అవుతుందని రైతులు భ్రమ పడుతున్నారు. 29 వేల మంది రైతులు తమ భూములను త్యాగం చేయడం ఎక్కడా చూడలేదు. అమరావతి రైతులకు ప్రతిఫలం రెట్టింపుగా ఇవ్వడం చూస్తే.. మహానేత వైఎస్సార్‌కు ఏవిధంగా రైతులపై ప్రేమ ఉండేదో సీఎం జగన్‌కు అదే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎవరైతే అమరావతి కోసం ఉద్యమించారో.. త్వరలోనే వారిలో అధిక శాతం వెనకడుగు వేస్తారు. అమరావతి మరో హైదరాబాద్ కాకుడదని నా భావన. ఏపీలో అమలవుతున్న పథకాలు చూసి తమిళనాడు... పాండిచ్చేరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ను హీరోగా చూస్తున్నారు’అని కృష్ణారావు అన్నారు. (చదవండి : పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్ పరామర్శ) -
పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, యానాం: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి కేంద్రపాలిత ప్రాంతం యానాం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కొమానపల్లిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడి నుంచి గాడిలంక చేరుకుని, హెలికాప్టర్లో యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్ వద్దకు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ రచనాసింగ్ తదితర అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి సీఎం జగన్ కారులో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు గృహానికి చేరుకున్నారు. ఆయన్ను మంత్రి కృష్ణారావు సాదరంగా ఆహ్వానించారు. కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ కాంస్య విగ్రహానికి సీఎం జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని మంత్రి మల్లాడి ఇతర మంత్రులతో సీఎం జగన్ సుమారు 1.15 గంటల పాటు భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాజీవ్ రివర్‌బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బారులు తీరిన జనం యానాం చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది జనం రోడ్డులకు ఇరువైపులా వేచి ఉన్నారు. ఆయన కారులో ప్రయాణించే సమయంలో జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఎం జగన్ సైతం కారు నుంచి వారికి రెండు చేతుల జోడించి అభివాదం చేశారు. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కూడా ప్రజలు జేజేలు పలుకుతూ అమ అభిమానాన్ని చాటుకున్నారు. విస్తృత పోలీసు బందోబస్తు సీఎం జగన్ యానాం పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే రహదారులు, మంత్రి మల్లాడి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్, యానాం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయన పర్యటించే వీధులను తమ ఆ«దీనంలోనికి తీసుకున్నారు. -
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పుదుచ్చేరి మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మండిపడ్డారు. విశాఖలో మత్సకారులపై అసహనంతో మండిపడ్డ చంద్రబాబుపై మల్లాడి విమర్శలు గుప్పించారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులపై మండిపడటానికి చంద్రబాబు ఎవరంటూ ప్రశ్నించారు. తక్షణమే మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. యాభై సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు ఫించన్లు, బ్యాన్ పిరియడ్ రిలీఫ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఇవ్వలేందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పిన బాబు.. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు చేర్చలేదో వివరణ ఇవ్వాలని మల్లాడి డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ పాలనలో నలుగురు మత్స్యకారులని గెలిపించుకొని, ఒకరికి మంత్రి పదవి, మరో ఇద్దరు మత్స్యకార మహిళలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలంటూ చురకలంటించారు. -
పవన్ ముసుగు తీస్తామంటూ వార్నింగ్!
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను పవన్ కల్యాణ్ చదవలేదా.. అయితే ఆ మేనిఫెస్టో ఓసారి చదివి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించాలంటూ పవన్‌కు కాంగ్రెస్ నేత మల్లాది చురకలంటించారు. లేదంటే పవన్ ముసుగును తీసే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాలను చదివి అవగాహన పెంచుకుంటే పవన్‌కు ప్రశ్నించడం తెలుస్తుందన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని ఈ సందర్భంగా మల్లాది సూచించారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, గవర్నర్ నరసింహన్‌ను, అదేవిధంగా సీఎం చంద్రబాబును బీసీ కోర్ కమిటీ కలుస్తుందని యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు చెప్పారు. -
చెదిరిన రంగసామి కల
పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి కల చెదిరింది. రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన ఆయనకు ఆశాభంగం ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన రంగసామికి పుదుచ్చేరి ఓటర్లు షాక్ ఇచ్చారు. తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) రెండో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 30 స్థానాల్లో కాంగ్రెస్ 15, ఏఐఎన్ఆర్సీ 8, అన్నాడీఎంకే 4, డీఎంకే 2 సీట్లు గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగానే కాంగ్రెస్, ఏఐఎన్ఆర్సీ హోరాహోరీగా తలపడినట్టు పరిస్థితి కనిపించింది. చివరికి కాంగ్రెస్-డీఎంకే కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. అధికార ఏఐఎన్ఆర్సీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఒంటరిగా పోటీ చేసిన అన్నా డీఎంకే 4 స్థానాలు దక్కించుకుంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎస్పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్‌డబ్ల్యూ) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఇందిరా నగర్ నుంచి పోటీ చేసిన సీఎం రంగసామి 3,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆరోసారి విజయం సాధించారు. అంతకుముందు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.