సాక్షి, యానాం : కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదంటూ పుదుచ్చేరి గవర్నర్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. తన ఆదేశాలను పట్టించుకోని యానాం అధికారుల తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆ ఏడుగురు యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా ఉంటే పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి వైదొలుగుతానని మల్లాడి ప్రకటించారు. కాగా, మూడు రోజుల క్రిందట ఇతర ప్రాంతాల నుండి ఏడుగురు స్దానికులు యానాంకు వచ్చారు. వీరిని అధికారులు సరిహద్దు వద్దే నిలువరించారు. ఈ నేపథ్యంలో ఆ ఏడుగురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలని మల్లాడి చేసిన ఆదేశాలను యానాం అధికారులు పట్టించుకోలేదు. దీంతో మంత్రి తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు.
చదవండి : లాక్‌డౌన్: గల్ఫ్ బాధితులకు శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment