సాక్షి, కాకినాడ: లాక్‌డౌన్‌ను ప్రజలు కచ్చితంగా పాటించాలని పుదుచ్చేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చేపడుతున్న చర్యలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకే ఉన్న లాక్‌డౌన్‌ను కేంద్రం కొన్ని రోజులు పొడిగించే అవకాశముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు.
(లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..)
కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం కంటే ముందుగానే తమ పుదుచ్చేరి సీఎం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పుదుచ్చేరి పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. కేరళలో ఉన్న మాహీలో మాత్రమే పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. ఆ కేసు కూడా వైద్యం అందడంతో నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు.
(మందు బాబులను ఆగమాగం చేస్తోంది...)
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి యానాంలో లక్ష మందికి మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. యానాంలో ఉన్న 22 రేషన్‌షాపులు, ఐదు కోపరేటివ్ లిక్కర్ షాపులను మూసివేశామని తెలిపారు. ప్రజలకు రేషన్‌తో పాటు నిత్యావసరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆ సరుకులను హోల్‌సేల్ ధరలకే హోం డెలివరీ చేస్తామన్నారు.
(కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!)
Comments
Please login to add a commentAdd a comment