
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పుదుచ్చేరి ఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యానాంకు సంబంధించిన పలు అంశాలను ఆయన చర్చించినట్టు తెలిసింది. సీఎం జగన్ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని అభినందించారు. అనంతరం వివిధ అంశాలపై సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచిన విషయం తెలిసిందే. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్)