ర్యాలీలో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
పాలకోడేరు: అధికారమే పరమావధిగా టీడీపీ ఎన్నికల హామి ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి బి.బలరాంతో కలిసి మండలంలో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎంపీగా నాగబాబును కూడా గెలిపించాలని కోరారు. శృంగవృక్షం, గొరగనమూడి, పెన్నాడ, విస్సాకోడేరు, కుముదవల్లి, పాలకోడేరు, మోగల్లు మీదుగా రోడ్ షో నిర్వహించారు. గాధం నానాజీ, రవిచంద్ర, పి.బ్రహ్మానందం, పి.ప్రతాప్‌రాజు, జక్కంశెట్టి సత్యనారాయణ, జె.హరిషా దుర్గ, చేబోలు సత్యనారాయణ, పాలా వెంకటస్వామి పాల్గొన్నారు.
కాపు సోదరులంతా వైఎస్సార్ సీపీ వైపే ఉండాలి
వీరవాసరం: కాపు సోదరులంతా వైఎస్సార్‌సీపీ వైపే ఖచ్చితంగా ఉండాలని వైఎస్సార్ కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సవరం కిశోర్ కోరారు. వీరవాసరం మండలం దూసనపూడిలో సోమవారం వైఎస్సార్ కాపు సేన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల కోసం కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కాపు సంఘీయులంతా జగనన్నకు మద్దతు ప్రకటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలపించాలని కోరారు. భీమరంలో గ్రంధి శ్రీనివాస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సవరం బాలకృపావరం, తానం పాపారావు, ఓడూరి గణపతి, చిన నారాయణరావు, ఓడూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment