kaapu
-
'కాపు' కాయని బాబు
కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. మీలో ఒకడినై పెద్ద కాపునవుతా.. అంటూ 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. కాపులకు లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. కాపు సామాజిక వర్గంతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తర్వాత వారిని కరివేపాకులా తీసిపారేశారు. కాపులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగడంతో దిగొచ్చిన చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు ఇస్తానని చెప్పిన టీడీపీ అధినేత సగం నిధులు కూడా కేటాయించకుండా మరోసారి మోసగించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కాపులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, దెందులూరు : కాపులను నిలువునా మోసగించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై జిల్లాలోని ఆ సామాజికవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు తమను కూరలో కరివేపాకులా వాడుకుని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ప్రకటిస్తున్నారు. కాపుల ఓట్లతో 2014లో చంద్రబాబు అధికారం చేపట్టి ఏ విధంగాను వారిని ఆదుకోలేదు. ఇచ్చిన హామీలను విస్మరించారు. తీరని అన్యాయం టీడీపీ ప్రభుత్వంలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాపు నేతలు విమర్శిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆయన గద్దనెక్కిన తర్వాత పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముద్రగడ పద్మనాభంతో పాటు ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కాపు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం నడిచింది. రాజ్యాంగంలో సవరణ చేయాలంటూ.. చంద్రబాబు కాలం గడిపారు. ఉద్యమాన్ని అణచివేయడానికి శతథా ప్రయత్నించారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఈ తరుణంలో కేంద్రం ఓబీసీలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇందులో 5 శాతాన్ని కాపులకు కేటాయించి మమ అనిపించారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ఆదాయపరంగా మాత్రమే కేంద్రం కేటాయించింది. కుల ప్రాతిపాదికన ఇచ్చినట్టయితేనే కాపులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కాపు కార్పొరేషన్‌కు అరకొర నిధులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమం ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకారం నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. అయితే నాలుగేళ్లలో సగం నిధులు మాత్రమే కేటాయించి చంద్రబాబు మరోసారి కాపులను మోసం చేశారు. కాపు కార్పొరేషన్ రుణాలు కూడా జన్మభూమి కమిటీ సభ్యులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఇచ్చారు. దీంతో కొందరికి మాత్రమే రుణాలు అందాయి. అన్ని అర్హతలు ఉన్నా అత్యధిక మందికి రుణాలు అందలేదు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలనపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చంద్రబాబు మోసగించారని, ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతామని ప్రతినబూనారు. నమ్మించి మోసగించిన బాబు కాపుల అభివృద్ధికి పాటు పడి పెద్ద కాపునవుతానని చెప్పిన చంద్రబాబు మమ్మల్ని పూర్తిగా మోసగించారు. మా ఓట్లతో అధికారం చేపట్టి ఆ తర్వాత పూర్తిగా విస్మరించారు. హామీలను నెరవేర్చలేదు. ఆయనకు తగిన బుద్ధి చెబుతాం. – పోకల రాంబాబు, దెందులూరు ఓటు బ్యాంకుగా వాడుకున్న బాబు కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు గత ఎన్నికల్లో చంద్రబాబు రిజర్వేషన్ హామీలను ఇచ్చి ఓటు బ్యాంకుగానే కాపులను వాడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పక్కన బెట్టారు. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అరకొరగానే నిధులు ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మళ్లీ ఎలా నమ్మాలి? – కొండేటి గంగాధరబాబు, గోపన్నపాలెం రిజర్వేషన్ల పేరుతో మోసం 2014లో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న ఆయన అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. నమ్మించి మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కేంద్రం ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లలో కంటితుడుపు చర్యగా కేటాయించారు. అది చివరకు నిలుస్తుందో లేదో కూడా తెలియదు. – పెద్దిశెట్టి బసవయ్య, గాలాయగూడెం కాపుల ద్రోహి చంద్రబాబు కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేసిన వందలాది మంది కాపులను టీడీపీ ప్రభుత్వం అరెస్టులు చేసి కేసులు బనాయించింది. ఈ విషయలను కాపులు మరిచిపోలేదు. కాపుల ద్రోహి చంద్రబాబు. ఆయనను మళ్లీ ఎలా నమ్ముతాం? – సనపల విష్ణు, సానిగూడెం -
అధికారమే పరమావధిగా టీడీపీ హామీలు
పాలకోడేరు: అధికారమే పరమావధిగా టీడీపీ ఎన్నికల హామి ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి బి.బలరాంతో కలిసి మండలంలో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎంపీగా నాగబాబును కూడా గెలిపించాలని కోరారు. శృంగవృక్షం, గొరగనమూడి, పెన్నాడ, విస్సాకోడేరు, కుముదవల్లి, పాలకోడేరు, మోగల్లు మీదుగా రోడ్ షో నిర్వహించారు. గాధం నానాజీ, రవిచంద్ర, పి.బ్రహ్మానందం, పి.ప్రతాప్‌రాజు, జక్కంశెట్టి సత్యనారాయణ, జె.హరిషా దుర్గ, చేబోలు సత్యనారాయణ, పాలా వెంకటస్వామి పాల్గొన్నారు. కాపు సోదరులంతా వైఎస్సార్ సీపీ వైపే ఉండాలి వీరవాసరం: కాపు సోదరులంతా వైఎస్సార్సీపీ వైపే ఖచ్చితంగా ఉండాలని వైఎస్సార్ కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సవరం కిశోర్ కోరారు. వీరవాసరం మండలం దూసనపూడిలో సోమవారం వైఎస్సార్ కాపు సేన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల కోసం కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కాపు సంఘీయులంతా జగనన్నకు మద్దతు ప్రకటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలపించాలని కోరారు. భీమరంలో గ్రంధి శ్రీనివాస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సవరం బాలకృపావరం, తానం పాపారావు, ఓడూరి గణపతి, చిన నారాయణరావు, ఓడూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
కాపు కల్యాణ మంటపం స్థలం కబ్జా
సాక్షి, రామచంద్రపురం: నియోజకవర్గంలో 25 ఏళ్లుగా సొంత సామాజిక వర్గం కాపుల ఓట్లతోపదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. కాపు కల్యాణ మంటపం కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఆయన బంధువులకు కట్టబెట్టారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దామిశెట్టి గంగాపురుషోత్తం ఆరోపించారు. పట్టణంలోని వినయ్‌దుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇష్టదైవం ప్రసన్నాంజనేయస్వామి సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు. కాపులను కేవలం ఓట్ల కోసమే తప్ప కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యే ఏనాడు పాటు పడలేదన్నారు. అమలాపురంలో పశువుల వ్యాపారం చేసుకునే ఆయన 1994లో నియోజకవర్గానికి వచ్చారన్నారు. కల్యాణ మంటపం కట్టుకోవాలంటూ కాపులను ఏకం చేసిన ఆయన.. అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇండిపెండెంట్‌గా కాపుల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. తొలిసారి ఇండిపెండెంట్‌గా ఆయన గెలిచిన సమయంలో తాను తోట వద్దే ఉన్నానని, ఆ సమయంలో ద్రాక్షారామలో కాపులకు కల్యాణ మంటపం నిర్మించేందుకు దేవస్థానం భూమిని తీసుకున్నట్టు ఆయన వివరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాపులకు మాత్రం కల్యాణ మంటపాన్ని మాత్రం నిర్మించలేదని విమర్శించారు. అప్పట్లో సేకరించిన ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.70కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ విషయంలో కాపులను ఆయన నిలువునా మోసం చేశారని విమర్శించారు. తిరిగి కాపులను ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమ సమయంలో కాపులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తుంటే అప్పుడేందుకు మాట్లాడలేదని గంగాపురుషోత్తం ప్రశ్నించారు. ఇప్పుడు కాపుల ఓట్లు ఆయనకు కావాల్సి వచ్చాయన్నారు. ఇప్పటికైనా కాపులు మోసపోకుండా ఉండాలని ఆయన కోరారు. కాపులకు అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలకాలన్నారు. కాపు నాయకులు తొగరు మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు సంఘీయులు హాజరయ్యారు. -
టీడీపీలో ఆగ్రహ జ్వాలలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చివరి నిమిషం వరకూ నాన్చి నిడదవోలు, నరసాపురం సీట్లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల పట్ల పార్టీలోని అసంతృప్త వర్గం రోడ్డెక్కింది. నరసాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. కొవ్వూరులో పాయకరావుపేట నుంచి తీసుకువచ్చి వంగలపూడి అనితను రంగంలోకి దింపడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు చిం తలపూడిలో అభ్యర్థి కర్రా రాజారావు తమను కలుపుకుపోవడం లేదంటూ మాజీ మం త్రి పీతల సుజాత వర్గం సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది. పోలవరంలో సిట్టిం గ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని సీటు కేటాయించిన బొరగం శ్రీనివాస్ అసలు ఎస్టీ కాదంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలులో సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు కేటాయించడంతో వ్యతిరేక వర్గం నేత కుందుల సత్యనారాయణ అలకబూనారు. ఆయన పార్టీ మారడమా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమా అన్న విషయమై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతుండటంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. నరసాపురం సీటు విషయంలో చివరి వరకు టిక్కెట్ ఇస్తామని ఊరించి మోసం చేశారని కొత్తపల్లి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రుస్తుంబాదలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో పార్టీ నాయకత్వం చెప్పాలన్నారు. తాను మాత్రం పోటీ చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. భీమవరంలో కూడా పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వీరవాసరం మండలంలోని రాయకుదురు గ్రామంలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక వర్గం గైర్హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిది. అంజిబాబు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారని అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అంజిబాబు తన వెంట వచ్చిన నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ నామినేటెట్ పదవులు కట్టబెడుతున్నారని వారు బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు కొవ్వూరులో కూడా అసంతృప్తి సెగలు ఇంకా చల్లారలేదు. కొవ్వూరు టిక్కెట్‌కి స్థానికేతరులకు ఇచ్చి తనకు అన్యాయం చేసినందుకు నిరసనగా టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ప్రకటించారు. మెడలో ఉన్న టీడీపీ కండువాను పక్కన పడవేసి, వేసుకున్న పసుపు రంగు చొక్కా తీసేసి, నల్లగుడ్డ కప్పుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. -
హామీలు అమలు చేయకపోవడం శోచనీయం
-
నేడు ముద్రగడ దీక్ష
కర్నూలు(అర్బన్): కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న నగరంలో చేపడుతున్న సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన కర్నూలుకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనను కలిసిన నేతలతో దీక్షలపై వాకబు చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సత్యాగ్రహదీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారు. -
26న కర్నూలుకు ముద్రగడ రాక
కర్నూలు(అర్బన్): మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కర్నూలుకు రానున్నట్లు కాపు, తెలగ, బలిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర కార్యదర్శి అమరం నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ రిజర్వేషన్ల సాధనకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారన్నారు. దీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారని.. జిల్లాలోని కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారంతా హాజరు కావాలని కోరారు. -
ప్రభుత్వం పెద్దల పక్షమా
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు కర్నూలు (న్యూసిటీ): అట్టడుగున ఉన్న బుడగజంగం కులస్తులను పట్టించుకోకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రభుత్వం పెద్దల పక్షం వహించేలా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆరోపించారు. ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో బుడగ జంగాలు బుధవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహా ధర్నాకు నక్కలమిట్టతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు,, ప్రజా సంఘాల నాయకులు టి.నారాయణ, అజయ్‌కుమార్, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌నాయక్ తదితరులు మద్దతు తెలిపారు. అంతకుముందు బుడగజంగం యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బడగజంగాలు డప్పులు, తంబూరాలు వాయిస్తూ, హరికథ చెబుతూ రాజవిహార్ సర్కిల్లో నుంచి చేసి, కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడగజంగం వారికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. బుడగజంగం యువజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు టి.మనోహర్ మాట్లాడుతూ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. మాట మార్చిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నాలో బుడగ జంగం సంఘం నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రంగస్వామి, నాయకులు సురేష్‌బాబు, సోమశంకరయ్య, టి.సుధాకర్, బంగారప్ప, డి.రాముడు, పక్కీరప్ప, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏజేసీ రామస్వామికి వినతిపత్రం అందజేశారు. -
హామీలు అమలు చేయకపోవడం శోచనీయం
శ్రీకాకుళం అర్బన్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల గడువు ముగిసినా అమలు చేయకపోవడం శోచనీయమని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు అన్నారు. రాష్ట్రంలోని కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 11న రాజమండ్రిలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్ కల్యాణ మండపంలో జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాపు జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్రలలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులు బీసీ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ మాత్రం ఓసీలుగానే పరిగణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర జేఏసీ నేత నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొంతమంది ప్రతినిధులు స్థాయిని మరిచి ముద్రగడను విమర్శించడం దారుణమన్నారు. రాష్ట్ర జేఏసీ నేత తోట రాజీవ్ మాట్లాడుతూ కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు సంఘ ప్రతినిధి సురంగి మోహనరావు, రాష్ట్ర కాపు జేఏసీ నేత ఇమిడి జోగేశ్వరరావు, కాపు నేతలు మామిడి శ్రీకాంత్, కరణం శ్రీనివాసరావు, తెలగ సంఘ ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ, వడిశ బాలకృష్ణ, శవ్వాన ఉమామహేశ్వరి, శవ్వాన వెంకటేశ్వరరావు, సుంకరి క1ష్ణ, పిల్లల నీలాద్రి, సిగిరెడ్డి నాగు, డాక్టర్ ఖగేశ్వరరావు, బత్తుల లక్ష్మణరావు, బత్తుల వైకుంఠరావు, బస్వా హరినారాయణ, అత్తులూరి మురళి, బల్ల రామారావు, రొక్కం శ్రీనివాసరావు, జిల్లాలోని 38 మండలాల తెలగ సంఘ అధ్యక్షులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
11న కాపు కార్పొరేషన్ పథకాలపై అవగాహన సదస్సు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ద్వారా అందిం^è నున్న పలు పథకాలపై ఈ నెల 11న ఉదయం 11 గంటలకు డీఆర్డీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు బీసీ కార్పొరేషన్ ఈడీ బి.శ్రీహరిరావు లె లిపారు. ఈ సదస్సులో స్కిల్ డవలెప్‌మెంటు, విద్యోన్నతి పథకాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కాపు, తెలగ, ఒంటరి కులం, బలిజ కులస్తులు హజరు కావాలని కోరారు. -
'ఓట్ల కోసం కులాలనూ వాడుకుంటున్నారు'
నెల్లూరు: వర్గీకరణ విషయంలో 20ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కాపులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం అన్ని రకాల కులాలను బాబు వాడుకుంటున్నారన్నారు. బాబు ప్రమాణం చేసిన స్థలంలోనే ఏప్రిల్ 30న మాదిగల సభ ఉంటుందని స్పష్టం చేశారు. దళితులంతా మళ్లీ దళితులుగానే పుట్టాలని కోరుకుంటారన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటూ దళితుల్లో పుడతానని మహాత్మా గాంధీనే అన్నారని మందకృష్ణ పేర్కొన్నారు. దళితులను అవమానించే విధంగా బాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తాం. కేవలం కొన్ని వర్గాలకే ఓ పత్రిక కాపు కాస్తోందని ఆయన తెలిపారు. దళితుల పట్ల ఆ పత్రిక చిన్న చూపు చూస్తుందని చెప్పారు. చంద్రబాబు వద్ద ఉన్న దళిత భజనపరులు ఆత్మగౌరవం చంపుకుని మాట్లాడటం మంచిదికాదన్నారు. -
'రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసింది బాబే'
విజయవాడ: రాష్ట్రం రావణకాష్టంలా తయారుకావడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కాపులు రోడ్డెక్కారన్నారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపు రిజర్వేషన్లు ఎలా సాధ్యమౌతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. -
'నా వంగవీటి రాధ ఇతనే'
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ఇదివరకే తెలిపారు. అయితే ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను వెల్లడించారు. 'వంగవీటి రాధ చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చే వాడు' అంటూ సిగరేట్ కాల్చే ఫోటోను.. 'వంగవీటి రాధకి కాఫీ అంటే చాలా ఇష్టమని వంగవీటి రంగగారు నాతో చెప్పారు'.. అని కాఫీ తాగుతున్న ఫోటోను.. కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారని మరో ఫోటోను ట్విట్ చేశారు. Kammavaalla manasthatanni ardham chesukune thelivunnavalle arhatha vunna nijamaina kaapulani chepparu pic.twitter.com/FZ8apGoXY7 — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 Vangaveeti Radhagaariki coffee ante chaala ishtamani Vangaveeti Ranga gaaru naatho chepoaru pic.twitter.com/EZD6Uqv28D — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 -
ఇది బాధ్యతారాహిత్యం
సమస్య వచ్చిపడినప్పుడు వ్యవహరించే తీరులోనే పాలకుల సమర్ధత బయటపడుతుంది. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తునిలో ఆదివారం చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు నిరూపించాయి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చాలని...ఆ కులాల సంక్షేమానికి ఏడాదికి వేయి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో అక్కడ జరిగిన ‘కాపు ఐక్య గర్జన’ సదస్సుకు లక్షలాదిమంది తరలివచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన నేతలతోసహా వివిధ పార్టీలవారు ఆ సదస్సుకు హాజరయ్యారు. రాస్తారోకో, రైల్ రోకోలకు ముద్రగడ పిలుపునిచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి నిప్పుపెట్టడం, పోలీసు వాహనాలను దహనం చేయడం, పోలీస్స్టేషన్లపై దాడి వంటివి సంభవించాయి. ఇంతమంది గుమిగూడతారని తెలిసి కూడా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన చంద్రబాబు...రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ ఉదంతాన్ని ఉపయోగించుకోవాలని చూడటం...ప్రత్యర్థులపై బురదజల్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పరిణామాలకు దారితీసిన తన బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుకోలేదు. తమను బీసీల్లో చేర్చాలన్న కాపుల డిమాండ్ ఈనాటిది కాదు. దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు జరిగిన కాపు ఐక్య గర్జనకు బోలెడు నేపథ్యం ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాపు తదితర కులాలను బీసీల్లో చేరుస్తామని టీడీపీ స్పష్టమైన వాగ్దానం చేసింది. అధికారానికొచ్చిన ఆరునెలల్లో అందుకోసం కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు ఆ కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను నెలకొల్పి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అప్పటికి రాష్ట్రం విడిపోయిందన్న అవగాహన బాబుకుంది. అయినా ఆయన హామీలిచ్చారు. వాటిని నమ్మి కోస్తాంధ్రలో...మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపులు టీడీపీకి అండగా నిలిచారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో టీడీపీ... కేవలం 5 లక్షల ఓట్ల ఆధిక్యతతో అధికారాన్ని పొందగలిగిందంటే అది ఆ వర్గం చలవే. అందుకు కృతజ్ఞతగా వారికిచ్చిన హామీలను నిండు హృదయంతో నెరవేర్చవలసి ఉండగా ఆ కర్తవ్యాన్ని బాబు పూర్తిగా విస్మరించారు. రైతులూ, డ్వాక్రా మహిళలు, చేనేత వర్గాలవారి రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ తరహాలోనే కాపులకిచ్చిన హామీకి కూడా ఆయన ఎగనామం పెట్టారు. గద్దెనెక్కాక కాపుల గురించి, వారికిచ్చిన హామీల గురించి ఆయన మాటవరసకైనా ప్రస్తావించలేదు. ఈ క్రమంలో నిరుడు జూలైలో ముద్రగడ తొలిసారి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ‘మాకిచ్చిన హామీల సంగతి ఏమైంద’ని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరో నాలుగైదు లేఖలు రాసినా పట్టనట్టున్న బాబు జనవరి 31న తునిలో సదస్సు నిర్వహించబోతున్నట్టు ముద్రగడ ప్రకటించాక కదిలారు. కాపుల కార్పొరేషన్ ఏర్పాటుచేసి దానికి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కాపుల కోటా కోసం జస్టిస్ మంజునాథ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం ఎవరి జాగీరూ కాదు. లేఖలు వారిద్దరి ప్రైవేటు వ్యవహారం అసలే కాదు. ప్రజల సమస్యల గురించి తెలిపినప్పుడు ఆ సమస్యపై ప్రభుత్వ వైఖరేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది. కాపుల్ని బీసీల్లో చేరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని బీసీ నేతలు ఆందోళన పడుతుండగా...వారి కోటా జోలికి పోకుండా తమకు అదనంగా కేటాయించాలని కాపులు కోరుతున్నారు. అందులో సాధకబాధకాలేమిటో, తాను తీసుకోదల్చిన చర్యలేమిటో బాబు తేటతెల్లం చేసి ఉండాల్సింది. విపక్షాలతోసహా అన్ని వర్గాలనూ పిలిచి మాట్లాడవలసింది. ఆయన ఆ పని చేయలేదు. కనీసం కమిషన్ కిచ్చిన మార్గదర్శకాలేమిటో కూడా ఇంతవరకూ వెల్లడించలేదు. కాపుల కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ ఇవ్వాల్సిన రూ. 2,000 కోట్ల మాటేమిటో చెప్పలేదు. ఈ మాత్రం చేయడానికైనా ఏడాదిన్నరకుపైగా సమయం ఎందుకు తీసుకోవాల్సివచ్చిందో అసలే వివరించలేదు. కనీసం కాపు ఐక్య గర్జన సభనైనా సజావుగా నిర్వహించుకోనివ్వకుండా అనేక అడ్డంకులు కల్పించారని ముద్రగడ అంటున్నారు. ఆ సంగతలా ఉంచి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యేచోట తగిన పోలీసు బందోబస్తు ఉండాలన్న స్పృహ కూడా లేనట్టు ప్రభుత్వం ప్రవర్తించింది. ఘటన జరిగాక ఎవరెవరిపైనో నెపం వేసేవారు ముందు జాగ్రత్త చర్యలెందుకు తీసుకోలేదో... నిఘా యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. నిజానికి కాపుల సమస్య ఒక్క కోటాకు సంబంధించినదో, కార్పొరేషన్‌కు సంబంధించినదో మాత్రమే కాదు. చంద్రబాబు సర్కారు ఇంతవరకూ తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించిన దుష్ఫలితాలు వారు అనుభవిస్తున్నారు. రుణ మాఫీ మొదలుకొని గోదావరి జలాల మళ్లింపునకు ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టు వరకూ...రాజధాని భూముల స్వాధీనంవరకూ ప్రభుత్వ నిర్ణయాలవల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ వర్గం ఇబ్బందులు పడుతోంది. భూమిని నమ్ముకుని బతుకుతున్న వర్గం కనుక ఈ నిర్ణయాల ప్రభావం ఆ వర్గంపై ప్రగాఢంగా ఉంది. కాపు ఐక్య గర్జనకు భారీ సంఖ్యలో జనం తరలిరావడానికి ఇలాంటివన్నీ తోడ్పడ్డాయి. కనుక తుని ఉదంతంలో స్వీయ వైఫల్యాలనూ, తప్పుడు నిర్ణయాలనూ సమీక్షించుకోవాల్సిన బాధ్యత బాబు సర్కారుపై ఉంది. అందుకు భిన్నంగా ఎవరిపైనో బురదజల్లాలను కోవడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం అసమర్ధతే అనిపించుకుంటుందని చంద్రబాబు గుర్తించాలి. -
రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లు..
విజయవాడ: తునిలో కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో విజయవాడ- విశాఖపట్నం మధ్య నడిచే 15 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ రైల్వే కంట్రోల్ రూంలో డీఆర్ఎం అశోక్ కుమార్ పరిస్థతిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైల్వే అధికారులు పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ(0866-2575038), తుని(08854-252172)లలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా విశాఖపట్నం రైల్వే అధికారులు (0891-2744619, 2575183, 83003) హెల్ప్‌లైన్ నెంబర్లను తెలిపారు. ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులకు టికెట్ రుసుం తిరిగి చెల్లించనున్నట్లు డీఆర్ఎం అశోక్ కుమార్ తెలిపారు.