నేడు ముద్రగడ దీక్ష | today mudragaga protest | Sakshi
Sakshi News home page

నేడు ముద్రగడ దీక్ష

Published Sun, Feb 26 2017 12:28 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

today mudragaga protest

కర్నూలు(అర్బన్‌): కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న నగరంలో చేపడుతున్న సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆయన కర్నూలుకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనను కలిసిన నేతలతో దీక్షలపై వాకబు చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక‌్షన్‌హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సత్యాగ్రహదీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement