satyagraha deeksha
-
సత్యాగ్రహ దీక్షతో సమరానికి సై అంటోన్న తెలంగాణ కాంగ్రెస్
-
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో సత్యాగ్రహ దీక్ష
-
Anantapur: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
సాక్షి, అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు. అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం -
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైద్యం కోసం ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో భయంకర పరిస్థితులు ఉన్నాయని, ప్రజలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కరోనాతో దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: LetsTalkVaccination: కేంద్రంపై కేటీఆర్ ఫైర్ ఖరీదైన వైద్య పరీక్షలు ఇక ఉచితం -
నేడు ముద్రగడ దీక్ష
కర్నూలు(అర్బన్): కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న నగరంలో చేపడుతున్న సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన కర్నూలుకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనను కలిసిన నేతలతో దీక్షలపై వాకబు చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సత్యాగ్రహదీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారు. -
26న కర్నూలుకు ముద్రగడ రాక
కర్నూలు(అర్బన్): మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కర్నూలుకు రానున్నట్లు కాపు, తెలగ, బలిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర కార్యదర్శి అమరం నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ రిజర్వేషన్ల సాధనకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారన్నారు. దీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారని.. జిల్లాలోని కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారంతా హాజరు కావాలని కోరారు. -
ఈ నెల 26 న ముద్రగడ దీక్ష
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా ఈ నెల 26 వ తేదీన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే కాపులందరు ఒక్కరోజు దీక్ష చేపట్టాలని ఆయన కోరారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమకు వీలుగా ఉన్న ప్రదేశాల్లో సత్యాగ్రహ దీక్ష చేయాలని ఆయన నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొని తమ జాతికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు నిరసన తెలపాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో జరిగే సత్యాగ్రహ దీక్షలో ముద్రగడ పాల్గొననున్నట్టు తెలిపారు. -
బెజవాడలో న్యాయవాదుల సత్యాగ్రహ దీక్ష
విజయవాడ లీగల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బెజవాడలోని బార్ అసోసియేషన్ భవనం ఎదురుగా టెంట్ వేసి, 25 మంది న్యాయవాదులు అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తరువు జగదీశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. శిబిరాన్ని పీసీపీ ఛీఫ్ రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల పట్ల చంద్రబాబు వైఖరి గోదావరి పుష్కరాల సమయంలోనే తేటతెల్లం అయిందన్నారు. ప్రత్యేక హోదా సాధనపై ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని చేస్తున్న విజ్ఞప్తులను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. అందులో భాగంగా సత్యాగ్రహ దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరడంతోపాటు ఇందుకోసం సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదటి వారంలో అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ గత రెండ్రోజులుగా ఈ విషయంపై ఆ ప్రాంత నాయకులతో చర్చిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలు 25 రోజులుగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కార్యక్రమాలు రూపొందించుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని సత్యాగ్రహ దీక్ష చేయాలని యోచిస్తున్నారు.