ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
విజయవాడ లీగల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బెజవాడలోని బార్ అసోసియేషన్ భవనం ఎదురుగా టెంట్ వేసి, 25 మంది న్యాయవాదులు అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తరువు జగదీశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు.
శిబిరాన్ని పీసీపీ ఛీఫ్ రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల పట్ల చంద్రబాబు వైఖరి గోదావరి పుష్కరాల సమయంలోనే తేటతెల్లం అయిందన్నారు. ప్రత్యేక హోదా సాధనపై ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.