పి. గన్నవరం(తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే అమరణ నిరాహార దీక్షకు దిగుతానని వైఎస్సార్‌సీపీ పి. గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు తెలిపారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలోనే చిట్టిబాబు ఆధ్వర్యంలో పి. గన్నవరం పట్టణంలో బంద్ నిర్వహించారు. పట్టణంలోని పలు దుకాణాలను, పాఠశాలలను మూసివేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
రాజమండ్రి రూరల్‌లో బైక్ ర్యాలీ
వైఎస్సార్‌సీపీ నాయకులు బంద్ సందర్భంగా రాజమండ్రి రూరల్ పరిధిలోని కోటిపల్లి బస్టాండ్ నుంచి కడెం మండలం వేమగిరి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం పెద్ద ఎత్తున కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకున్న నాయకులు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచందర్‌రావు, నాగేంద్రలు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన బంద్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదా కోసం నిరాహారదీక్ష చేస్తా..
Published Sat, Aug 29 2015 10:47 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement