సాక్షి, అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు.
అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు.
శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం
Comments
Please login to add a commentAdd a comment