రాష్ట్రం రావణకాష్టంలా తయారుకావడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.
విజయవాడ: రాష్ట్రం రావణకాష్టంలా తయారుకావడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కాపులు రోడ్డెక్కారన్నారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపు రిజర్వేషన్లు ఎలా సాధ్యమౌతాయని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.