సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైరయ్యారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని కాకాణి అన్నారు.
కాగా, మంత్రా కాకాణి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను మేము భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాము. టీడీపీ నేతలు మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు హయం అంతా కరువుకాటకాలే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు.
స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను వీధిలోకి లాగిన వ్యక్తి చంద్రబాబు. తన పబ్లిసిటీ కోసం 8 మందిని బలితీసుకున్నారు. కందుకూరు ఘటనలో బాబు నిర్వాకంపై బీబీసీ న్యూస్‌లో చెప్పారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. అసలు రాజ్యాంగంపై చంద్రబాబుకు నమ్మకం ఉందా?. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment