kandukur sabha
-
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనను జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తాడికొడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ..సమావేశానికి పర్మిషన్ తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలిపారు. సభ ప్రాంగణం అనుమతి గురించి చర్చ జరిగిందన్నారు. అనుమతి తీసుకున్న డాక్యుమెట్స్ అడిగారని, సభకు అనుమతి తీసుకున్న పత్రాలు కమిషన్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 15 వ తేదీన 3 గంటలకు మళ్లీ విచారణకు రమన్నారని తెలిపారు. కాగా ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారించిన సంగతి తెలిసిందే. కందుకూరు విచారణ అనంతరం ప్రభుత్వానికి కమిషన్ నివేదకి అందజేయనుంది. కందుకూరులో చంద్రబాబు నాయుడు గత డిసెంబర్లో నిర్వహించిన రోడ్ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్ షో జరిగిన ఎన్టీఆర్ సర్కిల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. -
చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్..
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైరయ్యారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని కాకాణి అన్నారు. కాగా, మంత్రా కాకాణి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను మేము భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాము. టీడీపీ నేతలు మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు హయం అంతా కరువుకాటకాలే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను వీధిలోకి లాగిన వ్యక్తి చంద్రబాబు. తన పబ్లిసిటీ కోసం 8 మందిని బలితీసుకున్నారు. కందుకూరు ఘటనలో బాబు నిర్వాకంపై బీబీసీ న్యూస్‌లో చెప్పారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. అసలు రాజ్యాంగంపై చంద్రబాబుకు నమ్మకం ఉందా?. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కందుకూరు ఘటనపై కేసు నమోదు.. మంత్రి వనిత ఏమన్నారంటే?
సాక్షి, కొవ్వూరు: నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో విషాదం నెలకొన్ని విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ విషాద ఘటన జరిగింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ నిర్వహించకూడదనే విషయం తెలియదా?. గోదావరి పుష్కరాల్లో కూడా ఇలాగే పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి కర్మరా బాబు అని బాధపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏమిటి?. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశాము అని తెలిపారు. -
‘చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే ప్రమాదానికి కారణం’
సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే ఎనిమిది మంది అకారణంగా మృతిచెందారు. తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు అని రోజా అన్నారు. కాగా, మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీటింగ్‌లో జరిగిన ఘటన చూస్తుంటే చాలా బాధ వేస్తోంది. చంద్రబాబు తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏం అనాలి?. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎనిమిది మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటో కేసుగా స్వీకరించాలి. ఇది రాజకీయ హత్య.. కోర్టులు సుమోటోగా స్వీకరించి కేసు పెట్టాలి. మీటింగ్ జరిగే సమయంలో భద్రతా ఏర్పాట్లు ఉండాలి. కానీ, అవేవీ లేకుండా చంద్రబాబు సభలు, రోడ్‌షోలు అంటూ పచ్చ ఛానల్స్‌లో చూపించుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలను తీశాడు. ఇప్పుడు ఇలా 8 మంది ప్రాణాలను బలిగొన్నాడు అంటూ రోజా వ్యాఖ్యానించారు. -
ఆ డబ్బు వడ్డీకి కూడా సరిపోలేదు
-
ఆ డబ్బు వడ్డీకి కూడా సరిపోలేదు: వైఎస్ జగన్
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా ఆయన కందుకూరు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హమీలను విస్మరించారు' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో రూ. 87,610 కోట్ల రుణాలున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు హామీతో రైతులు రుణాలు కట్టలేదనీ.. దాంతో రైతులపై రూ. 80 వేల కోట్ల వడ్డీభారం పడిందని ఆయన చెప్పారు. చంద్రబాబు మాత్రం రుణమాఫీకి రూ. 7,300 కోట్లు మాత్రమే కేటాయించారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు కేటాయించిన డబ్బు వడ్డీకీ కూడా సరిపోలేదన్నారు. భారీ వర్షాలు పడ్డాకే చంద్రబాబు కరువు మండలాలు ప్రకటించారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీని బాబు విస్మరించారని ఆయన దుయ్యబట్టారు. పింఛన్లు సైతం కత్తిరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకపోవడంపై లోకాయుక్తను ఆశ్రయిస్తామని, ఆధార్, రేషన్ కార్డుల ఆధారాలను లోకాయుక్తకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.