AP: మద్యం మాఫియా వీరంగం | Liquor Mafia Over Action In AP Over Wine Shops: Andhra pradesh | Sakshi
Sakshi News home page

AP: మద్యం మాఫియా వీరంగం

Published Thu, Oct 17 2024 6:01 AM | Last Updated on Thu, Oct 17 2024 6:03 AM

Liquor Mafia Over Action In AP Over Wine Shops: Andhra pradesh

రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు, హెచ్చరికలు 

సిండికేట్‌లో చేరని వైన్‌షాప్‌ల నిర్వాహకులపై కూటమి నేతల దౌర్జన్యం

20 శాతం ఉచిత వాటా లేదా లాభాల్లో 30–40 శాతం కమీషన్‌ ఇవ్వాలని హుకుం  

ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ నేత మద్యం దుకాణం ధ్వంసం 

కంప్యూటర్, ఫర్నీచర్‌ పగులగొట్టి.. మరికొన్ని మద్యం కేసులతో పరార్‌ 

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఫోన్లలో బెదిరింపులు  

సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ తమ చేతుల్లోనే ఉండాలని అధికార కూటమి పార్టీల నేతలు హుకుం జారీ చేస్తున్నారు. తమకు ఉచితంగా 20 శాతం వాటా ఇవ్వాలని, లేదా లాభాల్లో 30–35 శాతం కమీషన్‌ అయినా ఇవ్వాలని తెగేసి చెబుతున్నారు. ఇందుకు కాదు.. కూడదన్న చోట విధ్వంసం సృష్టిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మద్యం మాఫియా రెచి్చపోయింది. తమ సిండికేట్‌లో చేరలేదన్న కారణంతో ధర్మవరం పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలిరెడ్డికి చెందిన మద్యం దుకాణాన్ని కూటమి పారీ్టల నాయకులు, కార్యకర్తలు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.

రాత్రి మద్యం స్టాక్‌ను షాపులో దించుకుని తాళం వేసుకుని వెళ్లిపోయాడు. తమ సిండికేట్‌లో చేరాలని అప్పటికే కూటమి పార్టీల నాయకులు బాలిరెడ్డిని బెదిరించారు. అధిక ధరలకు మద్యం విక్రయించే ప్రశ్నే లేదని, సిండికేట్‌లో చేరబోమని ఆయన తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు అర్ధరాత్రి.. దుకాణం తాళాలు పగలగొట్టి.. లోపల నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను, కంప్యూటర్, ఫరీ్నచర్‌ను ఇనుప రాడ్‌లతో ధ్వంసం చేశారు. మరికొన్ని మద్యం కేస్‌లను తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై బాలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులంతా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ వర్గీయులని తెలిసింది.

తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూటమి నేతల బెదిరింపులు.. షాపులు దక్కించుకున్న వారికి స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోవటంతో కేవలం 127 షాపులు మాత్రమే బుధవారం ప్రారంభానికి నోచుకున్నాయి. 204 దుకాణాలు ప్రారంభం కాలేదు. పలమనేరు, పూతలపట్టు, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి పరిధిలో టీడీపీ, జనసేన నేతల అరాచకాల కారణంగా షాపులు దక్కించుకున్న వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ‘మేము అడిగినంత వాటా ఇవ్వాల్సిందే. కాదూ కూడదు అంటే.. జరిగే నష్టానికి మాకు సంబంధం ఉండదని’ అని కూటమి నాయకులు హుకుం జారీ చేశారు.  

అప్పుడే ‘బెల్ట్‌’ దందా  
టీడీపీ మద్యం మాఫియా తొలి రోజే రాష్ట్రంలో బెల్ట్‌ దుకాణాల దందాకు తెరతీసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సిండికేట్‌ మద్యం దుకాణాలు బుధవారం తెరచుకోగానే.. వాటికి అనుబంధంగా బెల్డ్‌ దుకాణాలకు తలుపులు బార్లా తీశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్‌ దుకాణాలు వెనువెంటనే ఏర్పాటు చేయడం గమనార్హం. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం మద్యం దుకాణాలతోపాటే పలు చోట్ల బెల్ట్‌ దుకాణాల్లో అమ్మకాలు మొదలు పెట్టడం గమనార్హం.

విజయవాడ తొమ్మిదో డివిజన్‌లోని చేపల మారెŠక్ట్‌ ప్రాంతంలో బుధవారం ఉదయమే ఓ బెల్ట్‌ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. విపరీతమైన రద్దీతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎక్సైజ్‌ శాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆ బెల్డ్‌ దుకాణాన్ని తాత్కాలికంగా మూయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇదే రీతిలో బెల్ట్‌ దుకాణాల దందా జోరందుకుంది. 

సర్కారుపై జనం కన్నెర్ర
పలు చోట్ల గుడి, బడి, గృహాల మధ్యే దుకాణాలు 
ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానికుల ఆందోళన  

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గుడి, బడి, గృహాల మధ్యే దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం పట్ల స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం ఎక్కడికక్కడ దుకాణాల ఏర్పాటును మహిళలు, విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉంటున్న తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని, తమ మాట కాదని ఏర్పాటు చేస్తే అందరం ఆత్మహత్యలు చేసుకుంటామని చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట ఆది ఆంద్రవాడ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు.

 బుధవారం ‘వద్దు వద్దు.. వైన్‌షాపు వద్దు’ అంటూ జోరువానలో నిరసనకు దిగారు. తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో, బాపట్లలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాత గుంటూరు మణి హోటల్‌ సెంటర్‌లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తమ విద్యా సంస్థ వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ బుధవారం విద్యార్థులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ నివాసానికి చేరుకుని విద్యా సంస్థ పక్కన మద్యం షాపు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.  మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, ఆచంట మండలం వల్లూరులో, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం రోడ్డులోని వినాయక స్వామి గుడి వద్ద స్థానికులు, రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు.   

ఇళ్ల మద్య దుకాణం వద్దంటూ చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో స్థానికులు నిరసన తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కొలుకుల రోడ్డులో, కృష్ణా జిల్లా ఘంటసాల సత్రం సెంటర్‌లో, గన్నవరంలోని కోనాయి చెరువు సమీపంలోని శ్రీ కాశీ విశాలాక్షి ఆలయం వద్ద,  ఎనీ్టఆర్‌ జిల్లా వెల్వడం–చిననందిగామ రహదారిలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను మహిళలు అడ్డుకున్నారు.   

 కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయం పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని స్థానిక మహిళలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథికి, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. హొళగుందలో స్థానికులు ఆందోళన చేపట్టారు.   

 విశాఖలోని 8వ వార్డు ఎండాడ దరి సుభా‹Ùనగర్, మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ సమీపంలోని వికలాంగుల కాలనీలో నివాసాల చెంత వైన్‌ షాపు ఏర్పాటు సహించబోమంటూ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి.. ఆ పక్కనే నిరి్మంచిన ఇంటిని వైన్‌ షాపు కోసం అద్దెకు ఇచ్చారంటూ ఆక్షేపించారు.    – సాక్షి నెట్‌వర్క్‌     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement