ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని నమ్మబలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన 'నారా హమారా.. టీడీపీ హమారా' సభలో న్యాయం కోసం నినదించిన యువకులను అరెస్ట్ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని యువకులు గుర్తు చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఒక ట్వీట్ పెట్టారు.