
'అందుకే తునిలో ఉద్రిక్త పరిస్థితులు'
హైదరాబాద్/తుని: టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో చేర్చాల్సిందేనని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వద్ద అన్ని గణంకాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చడానికి 18 నెలలు ఎందుకు ? అని సూటిగా ప్రశ్నించారు. ఎవరినైనా మోసం చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ అంశంలో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు.
ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అంశంలో యువతను మోసం చేశారని ఆరోపించారు. తమను బీసీల్లో చేర్చకపోవడంపై కాపుల్లో అలజడి, అశాంతి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తునిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.