సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ దంపతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
వివరాల ప్రకారం.. తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై బుధవారం కోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ క్రమంలోనే టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను కోర్టు తప్పుపట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఇది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీసు.. మంత్రి హరీష్ అభినందన
Comments
Please login to add a commentAdd a comment