
సీజేకు వినతి పత్రం అందజేస్తున్న న్యాయ శాఖ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాఖలో ఉన్న పెండింగ్ సమస్యలు, కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న 525 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీచంద్ర శర్మకు విజ్ఞప్తి చేసింది. న్యాయ శాఖ ఉద్యోగుల సం ఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి నేతృ త్వంలో ప్రతినిధిబృందం గురువారం జస్టిస్ శర్మను కలసి వినతిపత్రం సమర్పించింది.
సమస్యల పరిష్కారానికి, ఖాళీల భర్తీకి చర్య లు తీసుకుంటామని ఈ సందర్భంగా సీజే హామీ ఇచి్చనట్లు ప్రతినిధి బృందం పేర్కొంది. సీజేను కలిసిన వారిలో ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బ య్య, రమణ, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భుజంగరావు, ప్రేమ్‌కుమార్, నల్లారెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment